టాటా నెక్సాన్ ఈవీలో ఆ రెండు వేరియంట్లకే భలే డిమాండ్; చార్జింగ్ స్టేషన్ల పెంపుకు ప్లాన్స్!

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ విక్రయిస్తున్న ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు గత కొన్నేళ్లుగా మెరుగ్గా ఉంటున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్లతో పాటుగా టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లను కూడా విక్రయిస్తోంది. గడచిన సంవత్సరం ఆరంభంలో టాటా మోటార్స్ భారత ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించి నెక్సాన్ ఈవీని విడుదల చేసింది.

టాటా నెక్సాన్ ఈవీలో ఆ రెండు వేరియంట్లకే భలే డిమాండ్; చార్జింగ్ స్టేషన్ల పెంపుకు ప్లాన్స్!

ప్రస్తుతం భారతదేశంలో లభిస్తున్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా టాటా నెక్సాన్ ఈవీ ఈ విభాగంలో అగ్రస్థానాన్ని కలిగి ఉంది. ఎలక్ట్రిక్ వాహన విభాగాన్ని శాసిస్తున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి వినియోగదారుల నుండి మంచి స్పందన లభిస్తోంది. దీంతో టాటా నెక్సాన్ ఇవి దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వాహనంగా అవతరించింది.

టాటా నెక్సాన్ ఈవీలో ఆ రెండు వేరియంట్లకే భలే డిమాండ్; చార్జింగ్ స్టేషన్ల పెంపుకు ప్లాన్స్!

టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీని మార్కెట్లో ప్రవేశపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 4,000 యూనిట్లకు పైగా విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. జనవరి 28, 2020వ తేదీన టాటా నెక్సాన్ ఈవీ కారును తొలిసారిగా భారత మార్కెట్లో విడుదల చేశారు. ఆగస్టు 18, 2020 నాటికి నెక్సాన్ ఈవీ 1,000 యూనిట్ల మార్కును మరియు డిసెంబర్ 2, 2020 నాటికి 2000 యూనిట్ల మార్కును చేరుకుంది.

టాటా నెక్సాన్ ఈవీలో ఆ రెండు వేరియంట్లకే భలే డిమాండ్; చార్జింగ్ స్టేషన్ల పెంపుకు ప్లాన్స్!

తాజాగా, మార్చి 2021 నెలాఖరు నాటికి భారత మార్కెట్లో టాటా నెక్సాన్ ఈవీ అమ్మకాల సంఖ్య 4000 యూనిట్లకు చేరుకుంది. టాటా నెక్సాన్ ఈవీ భారతదేశంలో స్థిరమైన ప్రజాదరణ పొందుతూ, అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వాహనంగా అవతరించింది. ఇది గడచిన ఆర్థిక సంవత్సరంలో 64 శాతం మార్కెట్‌తో భారతదేశపు నెంబర్ వన్ ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది.

టాటా నెక్సాన్ ఈవీలో ఆ రెండు వేరియంట్లకే భలే డిమాండ్; చార్జింగ్ స్టేషన్ల పెంపుకు ప్లాన్స్!

దేశీయ మార్కెట్లో టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్ఎమ్, ఎక్స్‌జెడ్ ప్లస్ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్ లగ్జరీ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో దీని బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.13.99 లక్షలుగా ఉంటే, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.16.40 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).

టాటా నెక్సాన్ ఈవీలో ఆ రెండు వేరియంట్లకే భలే డిమాండ్; చార్జింగ్ స్టేషన్ల పెంపుకు ప్లాన్స్!

తాజా నివేదికల ప్రకారం, ఈ మోడల్‌లో ఎక్స్‌జెడ్ ప్లస్ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్ లగ్జరీ వేరియంట్లకు ఎక్కువ ప్రజాదరణ ఉన్నట్లు తేలింది. ఈ రెండు వేరియంట్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, కంపెనీ వీటి ఉత్పత్తిని కూడా పెంచింది.

టాటా నెక్సాన్ ఈవీలో ఆ రెండు వేరియంట్లకే భలే డిమాండ్; చార్జింగ్ స్టేషన్ల పెంపుకు ప్లాన్స్!

టాటా ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ల తయారీ మరియు ఉపయోగించిన బ్యాటరీల రీసైక్లింగ్ కోసం టాటా మోటార్స్ టాటా కెమికల్స్‌తో చేతులు కలిపింది. ప్రస్తుతం టాటా కెమికల్స్ లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్ తయారీ, క్రియాశీల రసాయన తయారీని అన్వేషించడం మరియు బ్యాటరీ రీసైక్లింగ్‌పై పనిచేస్తోంది. అంతేకాకుండా, కార్లలో ఉపయోగించిన బ్యాటరీలను నిల్వ చేసేందుకు అవసరమయ్యే పరిష్కారాలపై కూడా టాటా కెమికల్స్ పనిచేస్తోంది.

టాటా నెక్సాన్ ఈవీలో ఆ రెండు వేరియంట్లకే భలే డిమాండ్; చార్జింగ్ స్టేషన్ల పెంపుకు ప్లాన్స్!

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు విషయానికి వస్తే, ఇందులో 95 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఈ మోటార్‌ను ఫ్రంట్ యాక్సిల్‌లో అమర్చారు. ఇది 30.2 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ మోటర్ గరిష్టంగా 129 బిహెచ్‌పి పవర్‌ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టాటా నెక్సాన్ ఈవీలో ఆ రెండు వేరియంట్లకే భలే డిమాండ్; చార్జింగ్ స్టేషన్ల పెంపుకు ప్లాన్స్!

కంపెనీ పేర్కొన్న ప్రకారం, నెక్సాన్ ఈవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పూర్తి ఛార్జీపై 312 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. నెక్సాన్ ఈవీ స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీలని సపోర్ట్ చేస్తుంది. హోమ్ ఛార్జర్ ద్వారా ఈ కారు పూర్తిగా ఛార్జ్ చేయటానికి సుమారు 7 నుండి 8 గంటల సమయం పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే, కేవలం 60 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

టాటా నెక్సాన్ ఈవీలో ఆ రెండు వేరియంట్లకే భలే డిమాండ్; చార్జింగ్ స్టేషన్ల పెంపుకు ప్లాన్స్!

టాటా నెక్సాన్ ఈవీ వినియోగదారుల కోసం దేశంలో చార్జింగ్ మౌళిక సదుపాయాలను విస్తృతం చేసేందుకు టాటా మోటార్స్ ఇటీవలే టాటా పవర్ సంస్థతో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు మరియు హైదరాబాద్ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది.

టాటా నెక్సాన్ ఈవీలో ఆ రెండు వేరియంట్లకే భలే డిమాండ్; చార్జింగ్ స్టేషన్ల పెంపుకు ప్లాన్స్!

టాటా మోటార్స్ మరియు టాటా పవర్ సంస్థలు ఇప్పటివరకు దేశంలోని 45 నగరాల్లో 400కి పైగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశాయి. ఈ ఛార్జింగ్ స్టేషన్లను టాటా మోటార్స్ డీలర్‌షిప్స్ మరియు పబ్లిక్ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇతర నగరాలు మరియు రహదారులపై 2500 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Most Read Articles

English summary
Tata Nexon EV Top-Spec Variants Are In More Demand, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X