2021 VIVO IPL అధికారిక భాగస్వామిగా టాటా సఫారీ

టాటా మోటార్స్ తన టాటా సఫారిని తిరిగి భారతదేశంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే, దీని ధర దేశీయ మార్కెట్లో రూ. 14.69 లక్షలు. ఇప్పుడు టాటా సఫారి కంపెనీ యొక్క ప్రధాన మోడల్ గా నిలిచింది. అయితే ఇక్కడ మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే టాటా సఫారీ వివో ఐపిఎల్ 2021 యొక్క అధికారిక భాగస్వామిగా నిలిచింది. బిసిసిఐతో టాటా మోటార్స్ భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఇది వరుసగా నాలుగో సారి.

2021 VIVO IPL అధికారిక భాగస్వామిగా టాటా సఫారీ

2021 ఏప్రిల్ 9 న చెన్నైలో టోర్నమెంట్ ప్రారంభం కానుంది. దీనితో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్‌లతో సహా దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ప్రారంభం కానుంది. ఇందులో కస్టమర్ల దృష్టిని ఆకర్షించడానికి అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు టాటా మోటార్స్ కంపెనీ తెలిపింది.

2021 VIVO IPL అధికారిక భాగస్వామిగా టాటా సఫారీ

ఈ టోర్నమెంట్ సందర్భంగా పైన పేర్కొన్న నగరాల స్టేడియాలలో కొత్త టాటా సఫారీలు ప్రదర్శించబడతాయి. సాధారణంగా ఇండియన్ మార్కెట్లో టాటా సఫారి విజయవంతమైన మరియు అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్. కావున కంపెనీ మళ్లీ వినియోగదారులలో ఆదరణ పొందటానికి మరియు కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి అనేక ప్రణాళికలను రూపొందిస్తోంది.

MOST READ:క్రిమినల్స్ నుండి సీజ్ చేసిన కార్లతో మంచి పనులు చేస్తున్న పోలీసులు!

2021 VIVO IPL అధికారిక భాగస్వామిగా టాటా సఫారీ

టాటా సఫారి 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 173 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ ఉన్నాయి.

2021 VIVO IPL అధికారిక భాగస్వామిగా టాటా సఫారీ

కంపెనీ ఇప్పుడు దీని బ్రేకింగ్ ప్యాకేజీని హారియర్‌కు వ్యతిరేకంగా అప్‌డేట్ చేసింది, అంతే కాకుండా అదనపు బరువును నిర్వహించడానికి నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఇవ్వబడ్డాయి. టాటా సఫారీ యొక్క 6 సీట్ల వేరియంట్‌లో మధ్య వరుసలో కెప్టెన్ సీటు, 7 సీట్ల వేరియంట్‌లో బెంచ్ సీటు ఉన్నాయి.

MOST READ:200 రూపాయల ట్రాఫిక్ ఫైన్ రద్దు కోసం రూ. 10,000 ఖర్చు చేసిన వ్యాపారవేత్త

2021 VIVO IPL అధికారిక భాగస్వామిగా టాటా సఫారీ

టాటా సఫారీ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, హిల్ డీసెంట్ కంట్రోల్, చైల్డ్ సీట్ ఐసోఫిక్స్, రియర్ పార్కింగ్ సెన్సార్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

2021 VIVO IPL అధికారిక భాగస్వామిగా టాటా సఫారీ

సఫారి యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో లెదర్ సీట్ అపోల్స్ట్రే, లేత గోధుమరంగు ఇంటీరియర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రియర్ ఎయిర్ వెంట్స్, యుఎస్బి ఛార్జింగ్ స్లాట్లు, 8.8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ పానెల్, జెబిఎల్ స్పీకర్, పనరోమిక్ సన్‌రూఫ్, ఐఆర్‌ఎ కనెక్ట్ టెక్నిక్స్, దీనితో పాటు హిందీ, ఇంగ్లీష్ మరియు హింగ్లిష్ వాయిస్ అసిస్ట్ వంటివి ఉన్నాయి.

MOST READ:ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన జాగ్వార్ ఐ-పేస్ : ధర, ఫీచర్లు & వివరాలు

2021 VIVO IPL అధికారిక భాగస్వామిగా టాటా సఫారీ

టాటా మోటార్స్ ఈ ఎస్‌యూవీని తన వినియోగదారులకు డెలివరీ చేయడం ప్రారంభించింది. అయితే ఈ కొత్త సఫారికి దేశీయ మార్కెట్లో పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా దీని వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు 2 నెలల కన్నా ఎక్కువ కాలం ఎదురుచూడాల్సి వస్తుంది. ఇవన్నీ గమనిస్తే ఈ కొత్త సఫారీకి ఎంత ఎక్కువ ఆదరణ ఉందొ మనం ఊహించవచ్చు.

2021 VIVO IPL అధికారిక భాగస్వామిగా టాటా సఫారీ

ఇప్పటికే చాలామంది కస్టమర్లు తమ టాటా సఫారీని మరింత ఆకర్షనీయంగా చేయడానికి తమకు నచ్చినట్లు మాడిఫైడ్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలలో, కొత్త టాటా సఫారి యొక్క కొత్త అల్లాయ్ సఫారీ స్థానంలో కొత్త మరియు పెద్ద డిజైన్ అల్లాయ్ వీల్స్ రావడం గమనించవచ్చు. ఏది ఏమైనా త్వరలో టాటా సఫారీకి దేశీయ మార్కెట్లో పూర్వ వైభంగా రానుంది.

MOST READ:ఇండియన్ ఆర్మీలో చేరనున్న 1300 మహీంద్రా వెహికల్స్, ఇవే

Most Read Articles

English summary
Tata SAFARI Is The Official Partner For VIVO IPL 2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X