టాటా సఫారీ ఉత్పత్తి ప్రారంభం; దీని ధర ఎంత ఉండొచ్చో తెలుసా?

మరికొద్ది రోజుల్లోనే విడుదల కానున్న సరికొత్త 2021 టాటా సఫారీ (అలియాస్ గ్రావిటాస్) ఉత్పత్తిని పూనేలోని టాటా మోటార్స్ ప్లాంట్‌లో కంపెనీ ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు వెల్లడయ్యాయి.

టాటా సఫారీ ఉత్పత్తి ప్రారంభం; దీని ధర ఎంత ఉండొచ్చో తెలుసా?

టాటా మోటార్స్ గడచిన 2019లో జరిగిన జెనీవా మోటార్ షోలో హారియర్ ఎస్‌యూవీ ఆధారంగా తయారు చేసిన 7-సీటర్ కాన్సెప్ట్‌ను 'టాటా బజార్డ్' పేరుతో ఆవిష్కరించింది. ఆ తర్వాత అదే ఎస్‌యూవీని 2020 ఆటో ఎక్స్‌పోలో 'టాటా గ్రావిటాస్' పేరుతో ఆవిష్కరించింది.

టాటా సఫారీ ఉత్పత్తి ప్రారంభం; దీని ధర ఎంత ఉండొచ్చో తెలుసా?

ఇప్పుడు అదే కాన్సెప్ట్ ఆధారంగా తయారు చేస్తున్న వాహనానికి 'టాటా సఫారీ' అనే పేరును ఖరారు చేసింది. పేరు ఏదైనప్పటికీ, ఇది టాటా హారియర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఆధారంగా వస్తున్న ఎక్స్‌టెండెడ్ 7-సీటర్ ప్రీమియం ఎస్‌యూవీ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.

టాటా సఫారీ ఉత్పత్తి ప్రారంభం; దీని ధర ఎంత ఉండొచ్చో తెలుసా?

టాటా మోటార్స్ ఈ కొత్త ఎస్‌యూవీకి సఫారీ పేరును ఖరారు చేయటానికి ముందే, పూణేలోని తమ ప్లాంట్‌లో ఈ మోడల్ ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. తాజాగా గాడిఫై లీక్ చేసిన చిత్రాల ప్రకారం, టాటా మోటార్స్ ప్లాంట్‌లో తయారవుతున్న కొత్త సఫారీ ఎస్‌యూవీని ఇందులో చూడొచ్చు.

టాటా సఫారీ ఉత్పత్తి ప్రారంభం; దీని ధర ఎంత ఉండొచ్చో తెలుసా?

ఈ చిత్రంలో రెండు టాటా ఆల్ట్రోజ్ కార్ల మధ్యలో ఉన్న కొత్త టాటా సఫారీ కనిపిస్తుంది. సైడ్ నుంచి చూస్తుంటే, కొత్త సఫారీ అచ్చం టాటా హారియర్ మాదిరిగానే అనిపిస్తుంది. అయితే, ఇది హారియర్ కంటే గ్రావిటాస్ 63 మి.మీ ఎక్కువ పొడవును మరియు 80 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది.

టాటా సఫారీ ఉత్పత్తి ప్రారంభం; దీని ధర ఎంత ఉండొచ్చో తెలుసా?

హారియర్‌తో పోల్చినప్పుడు ఈ పొడగించిన కొలతల కారణంగా, టాటా సఫారీలో మరింత విశాలవంతమైన క్యాబిన్ అనుభూతి కలుగుతుంది. అంతేకాకుండా, మూడవ వరుసలోని ప్రయాణీకులకు మరింత హెడ్‌రూమ్, లెగ్‌రూమ్ కూడా లభిస్తుంది. థర్డ్ రో సీటింగ్ కోసం కంపెనీ దీని వెనుక డిజైన్‌లో భారీ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అయితే, హారియర్ మరియు సఫారీ రెండు మోడళ్ల వీల్‌బేస్ మాత్రం ఒకేలా (2741 మి.మీ) ఉంటుందని సమాచారం.

టాటా సఫారీ ఉత్పత్తి ప్రారంభం; దీని ధర ఎంత ఉండొచ్చో తెలుసా?

ఈ విభాగంలో ఇటీవలే విడుదలైన కొత్త ఎమ్‌జి హెక్టర్ ప్లస్ మోడల్‌కు పోటీనిచ్చేందుకు గాను టాటా సఫారీని కూడా ఆరు మరియు ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌లో విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇందులో 6-సీటర్ వెర్షన్‌లో మధ్య వరుసలో రెండు కెప్టెన్ సీట్లు మరియు 7-సీటర్ వెర్షన్ మధ్య వరుసలో బెంచ్ సీట్ ఉండే అవకాశం ఉంది.

టాటా సఫారీ ఉత్పత్తి ప్రారంభం; దీని ధర ఎంత ఉండొచ్చో తెలుసా?

టాటా సఫారీ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు కంపెనీ ఈ కారుని హారియర్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్న విషయం మనకు తెలిసినదే. ఈ నేపథ్యంలో, హారియర్‌లో కనిపించే అనేక పరికరాలు, విడిభాగాలు సఫారీలో కూడా అలానే కొనసాగించనున్నారు. దీని డ్యాష్‌బోర్డ్ లేఅవుట్, ఫీచర్లు, ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు మొదలైన వాటిని హారియర్ నుండి గ్రహించనున్నారు.

టాటా సఫారీ ఉత్పత్తి ప్రారంభం; దీని ధర ఎంత ఉండొచ్చో తెలుసా?

టాటా హారియర్‌లో కనిపించినట్లుగా, సఫారీలో కూడా ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 8.8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, జెబిఎల్ సౌండ్ సిస్టమ్, 7-అంగుళాల మల్టీ-ఇన్ఫర్మేషన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ వంటి ఫీచర్లు ఉండొచ్చని సమాచారం.

అంతేకాకుండా, ఇందులో మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన స్టీరింగ్ వీల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 6 ఎయిర్‌బ్యాగులు, కెమెరాతో రియర్ పార్కింగ్ సెన్సార్లు, ట్రాక్షన్న్ కంట్రోల్, ఈబిడితో కూడిన ఏబిఎస్ వంటి ఫీచర్లు కూడా ఇందులో స్టాండర్డ్‌గా లభించే అవకాశం ఉంది.

టాటా సఫారీ ఉత్పత్తి ప్రారంభం; దీని ధర ఎంత ఉండొచ్చో తెలుసా?

ఇంజన్ విషయానికి వస్తే, టాటా హారియర్ ఎస్‌యూవీలో ఉపయోగిస్తున్న బిఎస్6 కంప్లైంట్ 2.0-లీటర్, ఫోర్ సిలిండర్, 'క్రయోటెక్' డీజిల్ ఇంజన్‌నే కొత్త సఫారీలోనూ ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 170 పిఎస్ పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా ఆప్షనల్ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

టాటా సఫారీ ఉత్పత్తి ప్రారంభం; దీని ధర ఎంత ఉండొచ్చో తెలుసా?

తాజా నివేదికల ప్రకారం, కొత్త టాటా సఫారీ ధర ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాటా హారియర్ ధర కంటే సుమారు 1 లక్ష రూపాయలు అదనంగా ఉండొచ్చని అంచనా. కాగా, టాటా హారియర్ ఎస్‌యూవీని ప్రస్తుతం రూ.13.84 లక్షల నుంచి రూ.20.30 లక్షల (ఎక్స్‌షోరూమ్) మధ్యలో విక్రయిస్తున్నారు.

టాటా సఫారీ ఉత్పత్తి ప్రారంభం; దీని ధర ఎంత ఉండొచ్చో తెలుసా?

ఫుల్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలో విడుదల కానున్న కొత్త 2021 టాటా సఫారీ, ఈ విభాగంలో ప్రధానంగా ఎమ్‌జి హెక్టర్ ప్లస్, మహీంద్రా ఆల్ట్యూరాస్ జి4, ఫోర్డ్ ఎండీవర్, టొయోటా ఫార్చ్యూనర్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

చిత్ర సౌజన్యం: గాడిఫై

Most Read Articles

English summary
New 2021 Tata Safari Production Started In Pune Plant, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X