అక్టోబర్ 2021 నెలలో అత్యధికంగా అమ్ముడైన సెడాన్స్.. అగ్రస్థానంలో Maruti Dzire

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో ఇటీవలి కాలంలో ఎస్‌యూవీ టైప్ కార్లకు గిరాకీ పెరగడంతో సెడాన్ కార్లను ఆదరించే వారు కరువైపోతున్నారు. అయితే, సెడాన్ కార్లు ఆఫర్ చేసే కంఫర్ట్ ను కొన్ని ఎస్‌యూవీలు అందించలేవు. సెడాన్ కార్లు చూడటానికి చాలా క్లాసీగా కనిపిస్తూ, మంచి లగ్జరీ ఫీల్ ను అందిస్తాయి. ప్రస్తుతం, భారతదేశంలో అనేక రకాల సెడాన్లు అందుబాటులో ఉన్నాయి. వచ్చే ఏడాదిలో మరిన్ని కొత్త మోడళ్లు మార్కెట్లోకి రాబోతున్నాయి.

అక్టోబర్ 2021 నెలలో అత్యధికంగా అమ్ముడైన సెడాన్స్.. అగ్రస్థానంలో Maruti Dzire

తాజాగా, గత అక్టోబర్ 2021 నెలలో భారత మార్కెట్లో విక్రయించబడిన సెడాన్‌ల వివరాలు వెల్లడయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయం (అక్టోబర్ 2020)తో పోలిస్తే, గత నెలలో ఒకటి, రెండు మోడళ్లు మినహా మిగిలిన అన్ని కార్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. మరి వీటిలో ఏ కారు ఎక్కువగా అమ్ముడైంతో చూద్దాం రండి..!

అక్టోబర్ 2021 నెలలో అత్యధికంగా అమ్ముడైన సెడాన్స్.. అగ్రస్థానంలో Maruti Dzire

సెడాన్ కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి ఎల్లప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుంది. గత నెలలో kt[e మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) కాంపాక్ట్ సెడాన్ గరిష్టంగా 8,077 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే, అక్టోబర్ 2020 నెలలో ఈ మోడల్ అమ్మకాలు17,675 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో డిజైర్ అమ్మకాలు ఏకంగా 54.30 శాతం క్షీణించాయి.

అక్టోబర్ 2021 నెలలో అత్యధికంగా అమ్ముడైన సెడాన్స్.. అగ్రస్థానంలో Maruti Dzire

జపనీస్ కార్ బ్రాండ్ హోండా అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ సిటీ (Honda City) ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. అక్టోబర్ 2020 ఈ మోడల్ అమ్మకాలు 4,121 యూనిట్లుగా ఉంటే, గత నెలలో (అక్టోబర్ 2020లో) హోండా సిటీ అమ్మకాలు 3,611 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో హోండా సిటీ అమ్మకాలు 12.44 శాతం తగ్గాయి. ఐదవ తరం హోండా సిటీ సెడాన్ ను ప్రవేశపెట్టినప్పటి నుండి, ఈ మోడల్ అమ్మకాలు స్థిరంగా సాగుతున్నాయి.

అక్టోబర్ 2021 నెలలో అత్యధికంగా అమ్ముడైన సెడాన్స్.. అగ్రస్థానంలో Maruti Dzire

ఆసక్తిగకరంగా, ఈ జాబితాలో మూడవ స్థానాన్ని కూడా హోండా బ్రాండ్ కారే దక్కించుకుంది. మారుతి డిజైర్ కి పోటీగా హోండా అందిస్తున్న కాంపాక్ట్ సెడాన్ అమేజ్ (Honda Amaze) గత నెలలో 3,009 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అయితే, గతేడాది ఇదే సమయంలో (అక్టోబర్ 2020లో) హోండా అమేజ్ అమ్మకాలు 4,709 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో అమేజ్ అమ్మకాలు 36.10 శాతం పడిపోయాయి.

అక్టోబర్ 2021 నెలలో అత్యధికంగా అమ్ముడైన సెడాన్స్.. అగ్రస్థానంలో Maruti Dzire

ఈ జాబితాలో నాల్గవ మరియు ఐదవ స్థానాల్లో ఉన్నవి హ్యుందాయ్ బ్రాండ్ కార్లు. అక్టోబర్ 2020 నెలతో పోలిస్తే, గత నెలలో హ్యుందాయ్ ఆరా (Hyundai Aura) కాంపాక్ట్ సెడాన్ అమ్మకాలు 5,577 యూనిట్ల నుండి 2,701 యూనిట్లకు పడిపోయి 51.57 శాతం క్షీణతను నమోదు చేయగా, హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna) మిడ్-సైజ్ సెడాన్ అమ్మకాలు 2,166 యూనిట్ల నుండి 2,438 యూనిట్లకు పెరిగి 12.56 శావంత వృద్ధిని సాధించాయి.

అక్టోబర్ 2021 నెలలో అత్యధికంగా అమ్ముడైన సెడాన్స్.. అగ్రస్థానంలో Maruti Dzire

టాటా మోటార్స్ అందిస్తున్న సేఫెస్ట్ సెడాన్ టిగోర్ (Tata Tgor) ఈ జాబితాలో ఆరవ స్థానంలో ఉంది. అక్టోబర్ 2020తో పోలిస్తే గత నెలలో టాటా టిగోర్ అమ్మకాలు 1,501 యూనిట్ల నుండి 1,377 యూనిట్లకు పడిపోయాయి 8.4 శాతం క్షీణతను నమోదు చేశాయి. ఆ తర్వాతి (7వ) స్థానంలో మారుతి సుజుకి సియాజ్ (Maruti Szuuki Ciaz) ఉంది. ఈ సమయంలో సియాజ్ మిడ్-సైజ్ సెడాన్ అమ్మకాలు 1,422 యూనిట్ల నుండి 1,069 యూనిట్లకు పడిపోయి, 24.82 శాతం తగ్గాయి.

అక్టోబర్ 2021 నెలలో అత్యధికంగా అమ్ముడైన సెడాన్స్.. అగ్రస్థానంలో Maruti Dzire

భారత మార్కెట్లో ఇటీవలి కాలంలో స్కోడా కార్లకు గిరాకీ బాగా పెరిగింది. గత నెలలో స్కోడా విక్రయించిన సూపర్బ్ మరియు అక్టావియా సెడాన్లు 8వ మరియు 9వ స్థానాల్లో నిలిచాయి. అక్టోబర్ 2020తో పోలిస్తే స్కోడా సూపర్బ్ (Skoda Superb) అమ్మకాలు 184 యూనిట్ల నుండి 251 యూనిట్లకు పెరిగి 36.41 శాతం వృద్దిని సాధించాయి. కాగా, ఇదే సమయంలో స్కోడా ఆక్టావియా (Skoda Octavia) సెడాన్ అమ్మకాలు 31 యూనిట్ల నుండి 219 యూనిట్లకు పెరిగి 606.45 సాతం వృద్ధిని సాధించాయి.

అక్టోబర్ 2021 నెలలో అత్యధికంగా అమ్ముడైన సెడాన్స్.. అగ్రస్థానంలో Maruti Dzire

ఈ జాబితాలో చివరి స్థానంలో ఉన్నది కూడా స్కోడా అందిస్తున్న కారే. స్కోడా ర్యాపిడ్ సెడాన్ (Skoda Rapid) సెడాన్. గత నెలలో కేవలం 165 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ 1,024 స్కోడా ర్యాపిడ్ సెడాన్లను విక్రయించింది. స్కోడా ర్యాపిడ్ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు కంపెనీ స్లావియా అనే కొత్త సెడాన్ మరికొద్ది రోజుల్లోనే ఆవిష్కరించనుంది.

అక్టోబర్ 2021 నెలలో అత్యధికంగా అమ్ముడైన సెడాన్స్.. అగ్రస్థానంలో Maruti Dzire

స్కోడా స్లావియా (Skoda Slavia) సెడాన్ ను కంపెనీ నవంబర్ 18, 2021వ తేదీన అధికారికంహా భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది. కంపెనీ ఇప్పటికీ ఈ సెడాన్ టీజర్ ను కూడా విడుదల చేసింది. ఇది భారత్ కోసం స్కోడా ఆటో ఇండియా ప్లాన్ చేసిన ఇండియా 2.0 ప్రాజెక్ట్ లో భాగంగా వస్తున్న రెండవ మోడల్, ఈ ప్రాజెక్టులో ఇప్పటికే మొదటి మోడల్ అయిన స్కోడా కుషాక్ ను కంపెనీ విడుదల చేసిన సంగతి తెలిసినదే.

Most Read Articles

English summary
Top 10 best selling sedans in october 2021 report
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X