కొత్త 2022 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ మోడల్ గురించి తెలుసుకోవాల్సిన 6 గొప్ప విషయాలు!

ప్రముఖ జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా (Volkswagen India) భారతదేశంలో తమ సరికొత్త అప్‌గ్రేడెడ్ ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ (New Volkswagen Tiguan) ను తాజాగా దేశీయ మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కంపెనీ ఈ కొత్త కారును రూ. 31.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధరతో విక్రయిస్తోంది. మరి ఈ కొత్త టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కి సంబంధించిన టాప్ విషయాలను ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

కొత్త 2022 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ మోడల్ గురించి తెలుసుకోవాల్సిన 6 గొప్ప విషయాలు!

ఒకే ఒక వేరియంట్.. కానీ ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో..

కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీని కంపెనీ కేవలం ఒకే ఒక వేరియంట్లో మాత్రమే విక్రయిస్తోంది. కాకపోతే, ఈ ఒక్క వేరియంట్లోనే కంపెనీ ఫుల్లీ లోడెడ్ ఫీచర్లను అందిస్తోంది. అన్ని ఫీచర్లు మరియు సౌకర్యాలతో లభించే దీని ధర రూ. 31.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ వచ్చే జనవరి నెల నుండి డెలివరీలను చేయనుంది. ప్రస్తుతం, ఈ ఎస్‌యూవీ 5 సీటర్ మోడల్‌గా అందుబాటులో ఉంది.

కొత్త 2022 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ మోడల్ గురించి తెలుసుకోవాల్సిన 6 గొప్ప విషయాలు!

భారతదేశంలోనే అసెంబుల్ చేయబడుతోంది..

గతంలో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా విక్రయించిన పాత తరం టిగువాన్ మోడల్ ను కంపెనీ విదేశాలలో తయారు చేసి, పూర్తిగా తయారైన మోడల్ ఇక్కడి మార్కెట్లోకి దిగుమతి చేసుకొని (ఇంపోర్టెడ్ మోడల్‌గా) విక్రయించేంది. అయితే, ఇప్పుడు ఈ కొత్త 2022 ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను కంపెనీ ఇప్పుడు భారతదేశంలోనే అసెంబుల్ చేస్తోంది. ఫలితంగా, దీని ధర కూడా మునుపటి కన్నా తక్కువగా ఉంటుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఫోక్స్‌వ్యాగన్ ప్లాంట్‌లో ఈ కారును అసెంబుల్ చేసి భారతదేశంలో విక్రయిస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఈ కారు ఉత్పత్తి కూడా ప్రారంభమైంది.

కొత్త 2022 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ మోడల్ గురించి తెలుసుకోవాల్సిన 6 గొప్ప విషయాలు!

మరింత శుద్ధమైన బిఎస్ ఇంజన్..

కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో బిఎస్6 వెర్షన్ 2.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 187 బిహెచ్‌పి పవర్ ను మరియు 320 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7 స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది మరియు ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ యొక్క సిగ్నేచర్ ఆల్-వీల్ డ్రైవ్ (4MOTION) టెక్నాలజీతో లభిస్తుంది. ఈ కారు లీటరుకు 12.65 కి.మీ మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

కొత్త 2022 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ మోడల్ గురించి తెలుసుకోవాల్సిన 6 గొప్ప విషయాలు!

ఎక్స్టీరియర్ ఫీచర్లు..

2022 ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీ ముందు భాగంలో కొన్ని డిజైన్ మార్పులు జరిగాయి. ఇప్పుడు ఈ కారులో కొత్త ఎల్ఈడి మ్యాట్రిక్స్ హెడ్‌లైట్లు, రెండు L-ఆకారపు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, కొత్త ఫాగ్ లైట్లు వంటి మార్పులు ఉన్నాయి. అలాగే, సైడ్స్ లో ప్రీమియం 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు వెనుక భాగంలో సన్నటి ఎల్ఈడి టెయిల్ లైట్లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2022 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ మోడల్ గురించి తెలుసుకోవాల్సిన 6 గొప్ప విషయాలు!

ఇంటీరియర్ ఫీచర్లు..

టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్లలో కూడా భారీ మార్పులు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో వర్చువల్ కాక్‌పిట్, పెద్ద ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హ్యాండ్-హెల్డ్ కంట్రోల్స్, వియన్నా లెదర్ సీట్లు, సాఫ్ట్-టచ్ ప్లాస్టిక్‌తో కూడిన డ్యాష్‌బోర్డ్, 3 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ మరియు వివిధ రకాల కలర్ ఆప్షన్‌లు వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2022 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ మోడల్ గురించి తెలుసుకోవాల్సిన 6 గొప్ప విషయాలు!

సేఫ్టీ ఫీచర్లు..

సేఫ్టీ విషయానికి వస్తే, కొత్త 2022 ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఆటో హోల్డ్, ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో పాటుగా అనేక ఇతర భద్రతా ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

కొత్త 2022 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ మోడల్ గురించి తెలుసుకోవాల్సిన 6 గొప్ప విషయాలు!

ఇక ఇందులోని ఇతర ఫీచర్లను గమనిస్తే, 30 రకాల ఆఫ్ యాంబియంట్ లైటింగ్, ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్లు, పానోరమిక్ సన్‌రూఫ్, ఇల్యూమినేటెడ్ గేర్ నాబ్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు విశాలమైన బూట్ స్పేస్ మొదలైనవి ఉన్నాయి. కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ కోసం టెస్ట్ డ్రైవ్ లను డిసెంబర్ 10వ తేదీ నుండి ప్రారంభించనున్నారు. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ టక్సన్ మరియు సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఇది ఈ విభాగంలో అత్యంత విలువైనది మరియు వినియోగదారులకు ధరకు తగిన విలువను అందజేస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Top six things to know about new 2022 volkswagen tiguan facelift details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X