డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్

టొయోటా ఇటీవేల భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త 2021 ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ ఇప్పుడు తమ డీలర్‌షిప్ కేంద్రాలకు పంపిణీ చేస్తోంది. తాజాగా, ఈ బిగ్ సైజ్ ఎస్‌యూవీ బెంగుళూరు, హైదరాబాద్ నగరాల్లోని టొయోటా డీలర్‌షిప్ కేంద్రాల్లో దర్శనమిచ్చింది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్

ఈ కొత్త ఫార్చ్యూనర్ మోడల్‌తో పాటుగా కంపెనీ ఇందులో లెజెండర్ అన్ పవర్‌ఫుల్ వేరియంట్‌ను కూడా విడుదల చేసింది. మార్కెట్లో ఈ కొత్త టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ ధరలు రూ.29.98 లక్షల నుంచి రూ.37.48 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్

టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మునుపటి ఫార్చ్యూనర్‌తో పోల్చుకుంటే ఈ కొత్త మోడల్‌లో అనేక డిజైన్, ఫీచర్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఆసక్తి కలిగిన కస్టమర్లు దీనిని ఆన్‌లైన్‌లో కానీ లేదా అధీకృత టొయోటా డీలర్‌షిప్‌లలో కానీ బుక్ చేసుకోవచ్చు.

MOST READ:మళ్ళీ లాంగ్ డ్రైవ్‌లో కనిపించిన అజిత్.. ఈ సారి ఎక్కడికెళ్లాడో తెలుసా

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్

కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ 4x4 మరియు 4x2 డ్రైవ్ ఆప్షన్లలో లభిస్తుండగా, లెజెండర్ వేరియంట్ మాత్రం 4x2 ఆప్షన్‌తోనే లభిస్తోంది. ఇవి రెండూ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. కొత్త టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ మొత్తం 7 వేరియంట్లలో లభిస్తోంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్

టయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్‌లో సరికొత్త ఫ్రంట్ గ్రిల్ డిజైన్, సన్నటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, కొత్త ఎల్‌ఇడి డిఆర్‌ఎల్స్, కొత్త ఫ్రంట్ బంపర్, స్మాల్ ఫాగ్ లాంప్ మరియు సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఉన్నాయి. ఈ కారులో కొత్త డిజైన్‌తో కూడిన ఎల్‌ఈడి టెయిల్ లైట్స్ మరియు మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.

MOST READ:కొత్త హోండా వెజెల్ ఎస్‌యూవీ టీజర్ విడుదల

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్

లెజెండ్ వేరియంట్ విషయానికి వస్తే, దీని ఫ్రంట్ డిజైన్ స్టాండర్డ్ ఫార్చ్యూనర్ కన్నా మరింత అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. ఇందులో స్లిమ్ ఫ్రంట్ గ్రిల్, హై ఫ్రంట్ బంపర్ మరియు పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ డ్యామ్ ఉన్నాయి. దీనికి మరింత ప్రీమియం రూపాన్ని ఇచ్చేందుకు ఇందులో కొత్తగా రూపొందించిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ సెటప్ ఉంటుంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్

ఈ కారులోని ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎల్‌ఈడి యాంబియంట్ లైటింగ్, అప్‌డేటెడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

MOST READ:3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్

అంతేకాకుండా, సబ్ వూఫర్ మరియు 11 జెబిఎల్ స్పీకర్లతో కూడిన పవర్‌ఫుల్ డైనమిక్ ఆడియో సిస్టమ్, ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్, బ్లాక్ అండ్ చమోయిస్ లెథర్ అప్‌హోలెస్ట్రీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్ సిస్టమ్ మరియు హై అండ్ లో రేంజ్ గేర్‌బాక్స్ (4x4లో మాత్రమే) వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్ (4x4లో మాత్రమే), ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్, 360 డిగ్రీ కెమెరా, లేన్ కీప్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, రాడార్ గైడెడ్ డైనమిక్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:సైనికుల కోసం బుల్లెట్ బైక్‌లనే మొబైల్ అంబులెన్స్‌లుగా మార్చేశారు..

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్

సరికొత్త టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో శక్తివంతమైన 2.8-లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 204 బిహెచ్‌పి పవర్‌ను మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 166 బిహెచ్‌పి పవర్‌ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్

ఫార్చ్యూనర్ పెట్రోల్ వెర్షన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇకపోతే, డీజిల్ వెర్షన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది, ఇందులో ఆటోమేటిక్ వేరియంట్ లేదు. డీజిల్‌లో టూ-వీల్, ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్లు ఉన్నాయి, పెట్రోల్‌లో టూ-వీల్ డ్రైవ్ ఆప్షన్ మాత్రమే ఉంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్

టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ మొత్తం 8 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి: సూపర్ వైట్, గ్రే మెటాలిక్, సిల్వర్ మెటాలిక్, యాటిట్యూడ్ బ్లాక్, ఫాంటమ్ బ్రౌన్, అవాంట్ గార్డ్ బ్రాంజ్ మరియు స్పార్క్లింగ్ బ్లాక్ కలర్. కాగా, 8వ కలర్ ఆప్షన్‌గా ఫార్చ్యూనర్ లెజెండ్ డ్యూయల్ టోన్ పెరల్ వైట్ మరియు మ్యాట్ బ్లాక్ పెయింట్ స్కీమ్‌లో అందుబాటులో ఉంది.

Source: Team BHP

Most Read Articles

English summary
Toyota Fortuner Facelift Started Arriving At Dealerships. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X