టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూవీ ధరలో రూ.72,000 పెంపు!

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా ఈ ఏడాది జనవరి నెలలో కొత్త ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్‌తో పాటుగా లెజెండర్ అనే ప్రత్యేకమైన మోడల్‌ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూవీ ధరను తొలిసారిగా పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.

టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూవీ ధరలో రూ.72,000 పెంపు!

టొయోటా ఫార్చ్యూనర్ లెజండర్ ధరను కంపెనీ ఏకంగా రూ.72,000 మేర పెంచింది. తాజా పెంపు తర్వాత ఈ మోడల్ ధర ఇప్పుడు రూ.38.30 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1, 2021వ తేదీ నుండి అమలులోకి రానున్నాయి.

టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూవీ ధరలో రూ.72,000 పెంపు!

ధరల పెరుగుదల మినహా ఈ ఎస్‌యూవీలో ఎలాంటి ఇతర మార్పులు లేవు. ఇందులో 2.8 లీటర్ టర్బోచార్జ్డ్, ఇన్‌లైన్-4 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 204 పిఎస్ పవర్‌ను మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది.

MOST READ:మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా; థార్ ఎస్‌యూవీ పొందిన మహ్మద్ సిరాజ్

టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూవీ ధరలో రూ.72,000 పెంపు!

టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూవీ రియర్-వీల్-డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే లభిస్తుంది, ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ లేదు. ఫార్చ్యూనర్‌లో ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ కోరుకునే వారు స్టాండర్డ్ మోడల్‌లో డీజిల్ ఇంజన్ వెర్షన్‌ను ఎంచుకోవచ్చు.

టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూవీ ధరలో రూ.72,000 పెంపు!

సాధారణ టొయోటా ఫార్చ్యూనర్‌తో పోలిస్తే లెజెండర్ వెర్షన్ డిజైన్‌లో కొద్దిపాటి ఎక్స్టీరియర్ మార్పులు ఉన్నాయి. లెజెండర్‌లో కొత్త ఫ్రంట్ గ్రిల్ మరియు ఫ్రంట్ బంపర్‌తో పూర్తిగా సరికొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్‌తో కూడిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు కూడా ఉంటాయి.

MOST READ:వాహన ధరలు పెంచిన హోండా మోటార్‌సైకిల్.. కానీ ఆ వెహికల్ ధర మాత్రం తగ్గింది

టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూవీ ధరలో రూ.72,000 పెంపు!

స్టాండర్డ్ ఫార్చ్యూనర్‌తో పోలిస్తే, లెజెండర్‌లోని వెనుక బంపర్ కూడా భిన్నంగా కనిపిస్తుంది. ఇందులో కొత్త 18 ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ను ఉపయోగించారు. టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ మోడల్‌లో సన్‌రూఫ్ ఆప్షనల్‌గా కూడా అందుబాటులో లేదు.

టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూవీ ధరలో రూ.72,000 పెంపు!

ఇంకా ఇందులో బ్లాక్ అండ్ మెరూన్ డ్యూయెల్ టోన్ లెథర్ అప్‌హోలెస్ట్రీ, బ్రష్ మెటల్ అండ్ గ్లోసీ బ్లాక్ ఇంటీరియర్ ట్రిమ్స్, మెరూన్ కలర్ స్టిచింగ్ ఆటో, డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్, హ్యాండ్స్ ఫ్రీ బూట్ ఓపెనింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు రియర్ యుఎస్‌బి చార్జింగ్ పోర్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ:కొండెక్కిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరలు.. దేనిపై ఎంతంటే?

టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూవీ ధరలో రూ.72,000 పెంపు!

అంతేకాకుండా, ఇందులో యాంబియంట్ క్యాబిన్ లైటింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ అండ్ పవర్ అడ్జస్టబల్ ఫ్రంట్ సీట్స్, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ (రీచ్ అండ్ హైట్ సర్దుబాటుతో) మరియు స్మార్ట్ కీలెస్ ఎంట్రీ ఇతర స్మార్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూవీ ధరలో రూ.72,000 పెంపు!

సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, బ్రేక్ అసిస్ట్, స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ (ఆటో ఎమర్జెన్సీ అన్‌లాక్‌తో), మరియు అత్యవసర బ్రేక్ సిగ్నల్ మొదలైనవి ఉన్నాయి. భారత మార్కెట్లో ఇది ఒకే కలర్ ఆప్షన్‌లో (బ్లాక్ రూఫ్ విత్ వైట్ పెర్ల్ క్రిస్టల్ షైన్) మాత్రమే లభిస్తుంది.

MOST READ:ఈ టిప్స్ వాడండి, వాహన దొంగతనాలకు చెక్ పెట్టండి

Most Read Articles

English summary
Toyota Fortuner Legender SUV Price Increased In India, Details. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X