భారత మార్కెట్ కోసం టొయోటా కొత్త హ్యాచ్‌బ్యాక్, పేరు ఆగ్య, పేటెంట్ నమోదు!

టొయోటా కార్లతో భారతీయులకు ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. అప్పట్లో టొయోటా విక్రయించిన క్వాలిస్ ఎమ్‌పివి ద్వారా ఈ బ్రాండ్ చాలా విశ్వసనీయతను దక్కించుకుంది. టొయోటా ఇంజన్లు సుధీర్ఘకాలం మన్నుతాయనే భావన అందిరిలోనూ ఉంది. ఈ జపనీస్ బ్రాండ్ ఇప్పుడు భారత మార్కట్ కోసం ఓ చిన్న కారును ప్లాన్ చేస్తోంది.

భారత మార్కెట్ కోసం టొయోటా కొత్త హ్యాచ్‌బ్యాక్, పేరు ఆగ్య, పేటెంట్ నమోదు!

భారత కార్ మార్కెట్లోని ఎస్‌యూవీ, ఎమ్‌పివి విభాగాల్లో టొయోటా అమ్మకాలు బాగానే ఉన్నప్పటికీ, హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మాత్రం సంస్థ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. టొయోటా ప్రస్తుతం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో గ్లాంజా అనే మోడల్‌ను మాత్రమే విక్రయిస్తోంది.

భారత మార్కెట్ కోసం టొయోటా కొత్త హ్యాచ్‌బ్యాక్, పేరు ఆగ్య, పేటెంట్ నమోదు!

మారుతి సుజుకి నుండి టొయోటా కొనుగోలు చేసిన బాలెనో హ్యాచ్‌బ్యాక్‌ను రీబ్యాడ్జ్ చేసి, కంపెనీ టొయోటా గ్లాంజా పేరుతో విక్రయిస్తోంది. నిజానికి ఇది టొయోటా స్వంత హ్యాచ్‌బ్యాక్ కాదు. సింపుల్‌గా చెప్పాలంటే, ఇది మారు వేషంలో ఉన్న మారుతి సుజుకి బాలెనో హ్యాచ్‌బ్యాక్.

MOST READ:కూరగాయల అమ్మకానికి కొత్త టయోటా ఫార్చ్యూనర్.. వినటానికి వింతగా ఉన్నా, ఇది నిజమే

భారత మార్కెట్ కోసం టొయోటా కొత్త హ్యాచ్‌బ్యాక్, పేరు ఆగ్య, పేటెంట్ నమోదు!

అయితే, టొయోటా ఇప్పుడు భారత మార్కెట్లోని హ్యాచ్‌బ్యాక్ విభాగంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే వాహన విభాగంలో ప్రధానమైన హ్యాచ్‌బ్యాక్ విభాగంలో కంపెనీ ఓ కొత్త మోడల్‌ను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.

భారత మార్కెట్ కోసం టొయోటా కొత్త హ్యాచ్‌బ్యాక్, పేరు ఆగ్య, పేటెంట్ నమోదు!

టొయోటా కిర్లోస్కర్ మోటార్ తాజాగా భారత మార్కెట్లో ఓ కారు పేరును ట్రేడ్ మార్క్ చేసింది. ఆ పేరే 'ఆగ్య' (Agya). టొయోటా అనుబంధ సంస్థ అయిన డైహత్సు 2012 నుండి ఇండోనేషియాలో విక్రయిస్తున్న ఐలా (Ayla) కాంపాక్ట్ హాచ్‌బ్యాక్‌ను భారత్‌లో టొయోటా ఆగ్య పేరుతో విక్రయించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. డైహత్సు అనేది టొయోటా యొక్క చవక కార్ బ్రాండ్.

MOST READ:వేలానికి సిద్ధంగా ఉన్న సూపర్ కండిషన్‌లో ఉన్న 42 ఏళ్ల మెర్సిడెస్ బెంజ్; వివరాలు

భారత మార్కెట్ కోసం టొయోటా కొత్త హ్యాచ్‌బ్యాక్, పేరు ఆగ్య, పేటెంట్ నమోదు!

డైహత్సు ఐలా మరియు టొయోటా ఆగ్య కార్ల రెండింటి డిజైన్ ఇంచు మించు ఒకేలా ఉంటుందని సమాచారం. పెద్ద ఓపెనింగ్‌తో కూడిన హెక్సాగనల్ ఫ్రంట్ గ్రిల్, త్రిభుజాకారపు ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, సన్నటి హెడ్‌ల్యాంప్‌లు మరియు అల్లాయ్ వీల్స్‌తో ఇది ఓవరాల్ కాంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

భారత మార్కెట్ కోసం టొయోటా కొత్త హ్యాచ్‌బ్యాక్, పేరు ఆగ్య, పేటెంట్ నమోదు!

ఏడాది క్రితం ఇండోనేషియాలో ప్రవేశపెట్టిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ డైహత్సు ఆధారంగా ఈ కొత్త టొయోటా ఆగ్య కారును రూపొందించే అవకాశం ఉంది. అక్కడి మార్కెట్లో ఇది 1.0జి, 1.2జి మరియు 1.2జి టిఆర్‌డితో సహా పలు ఇతర వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో 1.0జి మోడల్ 1.0 లీటర్ త్రీ సిలిండర్ వివిటి-ఐ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 67 బిహెచ్‌పి శక్తిని 89 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:కరోనా కాటుకి బలైపోయిన బుల్లెట్ బైక్‌పై లాంగ్ డ్రైవ్స్ చేసే వృద్ధ జంట; వివరాలు

భారత మార్కెట్ కోసం టొయోటా కొత్త హ్యాచ్‌బ్యాక్, పేరు ఆగ్య, పేటెంట్ నమోదు!

ఇందులోని ఇతర వేరియంట్లు 1.2-లీటర్ ఫోర్ సిలిండర్ డ్యూయల్ వివిటి-ఐ ఇంజన్‌ను కలిగి ఉంటాయి. ఈ ఇంజన్ 88 బిహెచ్‌పి పవర్‌ను మరియు 108 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్ మరియు ఫోర్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

భారత మార్కెట్ కోసం టొయోటా కొత్త హ్యాచ్‌బ్యాక్, పేరు ఆగ్య, పేటెంట్ నమోదు!

ఇండోనేషియన్ మార్కెట్లో ఈ హ్యాచ్‌బ్యాక్ అనేక రకాల కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులోని టిఆర్‌డి పెర్ఫార్మెన్స్ వెర్షన్ బాడీ కలర్‌తో విరుద్ధమైన రెడ్ యాక్సెంట్స్‌ను మరియు టిఆర్‌డి బ్యాడ్జ్‌లను కలిగి ఉంటుంది.

MOST READ:నడి రోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు పోలీసులు[వీడియో].. కారణం ఏమిటంటే?

భారత మార్కెట్ కోసం టొయోటా కొత్త హ్యాచ్‌బ్యాక్, పేరు ఆగ్య, పేటెంట్ నమోదు!

ఈ చిన్న కారు వెనుక భాగంలో సింగిల్-పీస్ టెయిల్‌గేట్, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, ఎల్-ఆకారపు గ్రాఫిక్ టెయిల్ లాంప్స్, అగ్రెసివ్ బంపర్స్ మరియు క్రోమ్ గార్నిష్‌లు ఉంటాయి. ఇందులోని 1.2జి వేరియంట్‌లో ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ మరియు 14-ఇంచ్ మెషిన్డ్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి.

భారత మార్కెట్ కోసం టొయోటా కొత్త హ్యాచ్‌బ్యాక్, పేరు ఆగ్య, పేటెంట్ నమోదు!

భారతదేశంలో టొయోటా ఆగ్య రూపకల్పనకు పేటెంట్ మంజూరు కావటాన్ని చూస్తుంటే, కంపెనీ భవిష్యత్తులో ఈ ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Toyota Gets Patent For Agya Hatchback Design In India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X