రెండు వేరియంట్లలో విడుదల కానున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్!

మనదేశంలో పికప్ ట్రక్కులను చాలా వరకు వాణిజ్య ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తుంటారు. కానీ, విదేశాల్లో మాత్రం పికప్ ట్రక్కులను ప్రీమియం లైఫ్‌స్టైల్ వాహనాలుగా కూడా ఉపయోగిస్తుంటారు. నిజానికి అమెరికా మార్కెట్లో సాధారణ కార్ల కన్నా పికప్ ట్రక్కులే ఎక్కువ ధరను కలిగి ఉంటాయి.

రెండు వేరియంట్లలో విడుదల కానున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్!

సరే అదంతా అటుంచి అసలు విషయానికి వస్తే, మనదేశం కూడా ఇప్పుడిప్పుడే లైఫ్‌స్టైల్ పికప్ ట్రక్ విభాగానికి అలవాటు పడుతోందని చెప్పాలి. తాజాగా మార్కెట్లోకి వచ్చిన బిఎస్6 ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ మోడల్‌తో భారత లైఫ్‌స్టైల్ పికప్ ట్రక్ విభాగం మరోసారి సజీవంగా మారింది.

రెండు వేరియంట్లలో విడుదల కానున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్!

ఇప్పుడు ఈ విభాగంలోకి తాజాగా మరొక జపనీస్ బ్రాండ్ మోడల్ రాబోతోంది. జపాన్‌కు చెందిన టొయోటా బ్రాండ్ తమ హైలక్స్ ప్రీమియం లైఫ్‌స్టైల్ పికప్ ట్రక్కును ఇప్పుడు భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం, ప్రకారం టొయోటా హైలక్స్ కూడా రెండు వేరియంట్లలో విడుదల కావచ్చని తెలుస్తోంది.

రెండు వేరియంట్లలో విడుదల కానున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్!

ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి టొయోటా కిర్లోస్కర్ మోటార్ తమ హైలక్స్ పికప్ ట్రక్కును భారత మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చని సమాచారం. టొయోటా 1980 కాలం నుండి తమ హైలక్స్ బ్రాండ్ పేరును ఉపయోగిస్తోంది. తాజాగా, కంపెనీ ఈ పేరును భారతదేశంలో కూడా ట్రేడ్‌మార్క్ కోసం ధరఖాస్తు చేసుకుంది మరియు ఈ పేరు 2030 వరకూ చెల్లుబాటులో ఉంటుంది.

రెండు వేరియంట్లలో విడుదల కానున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్!

టొయోటా గత 2016లో హైలక్స్ రేవో పేరును కూడా ట్రేడ్‌మార్క్ కోసం ధరఖాస్తు చేసింది. కాకపోతే, ఈ పేరును ప్రధానంగా ఆసియా మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ రెండు పేర్లను (హైలక్స్, హైలక్స్ రెవో) పికప్ యొక్క రెండు వేరియంట్ల కోసం ఉపయోగించబడుతుయని విశ్వసిస్తున్నారు.

రెండు వేరియంట్లలో విడుదల కానున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్!

ప్రస్తుతం భారత మార్కెట్లో ఇసుజు విక్రయిస్తున్న హై-ల్యాండర్ మరియు వి-క్రాస్ మోడళ్ల మాదిరిగానే టొయోటా కూడా తమ హైలక్స్‌ను బేస్ మరియు ప్రీమియం వేరియంట్లుగా అందించే అవకాశం ఉంది. టొయోటా ఫార్చ్యూనర్, ఇన్నోవా వంటి మోడళ్లకు మద్దతునిచ్చే ఐఎమ్‌వి-2 ప్లాట్‌ఫామ్‌పైనే ఈ కొత్త టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కును కూడా నిర్మించనున్నారు.

రెండు వేరియంట్లలో విడుదల కానున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్!

ఈ నేపథ్యంలో, టొయోటా హిలక్స్ దాని యాంత్రిక అండర్‌పిన్నింగ్స్‌ను కూడా ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్‌తో పంచుకునే అవకాశం ఉంది. టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కు సుమారు 5.3 మీటర్ల పొడవును కలిగి ఉంటుందని సమాచారం.

రెండు వేరియంట్లలో విడుదల కానున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్!

కొత్త 2021 మోడల్ టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కులో కంపెనీ తమ పాపులర్ ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివిలో ఉపయోగిస్తున్న 150 బిహెచ్‌పి 2.4-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించే అకాశం ఉంది. ఈ ఇంజన్ 150 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. టాప్-ఎండ్ వేరియంట్లో ఆల్-వీల్ డ్రైవ్ మరియు దిగువ వేరియంట్లలో రియర్-వీల్ డ్రైవ్ లేఅవుట్‌తో వచ్చే అవకాశం ఉంది.

రెండు వేరియంట్లలో విడుదల కానున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్!

టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో ఉపయోగిస్తున్న పెద్ద 2.8-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ను కూడా టొయోటా హైలక్స్ టాప్-ఎండ్ వేరియంట్లలో ఆఫర్ చేయవచ్చని సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 204 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది స్టాండర్డ్ 4-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుందని అంచనా. ఈ రెండు ఇంజన్లు కూడా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో రావచ్చు.

రెండు వేరియంట్లలో విడుదల కానున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్!

టొయోటా హైలక్స్‌లో పెద్ద హెక్సాగనల్ గ్రిల్, డ్యూయెల్-బీమ్ ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్స్, పెద్ద బంపర్ మరియు భారీ సిల్వర్ స్కిడ్ ప్లేట్‌, అల్లాయ్ వీల్స్, సైడ్ స్టెప్, క్రోమ్ గార్నిష్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇంటీరియర్స్‌లో కూడా లేటెస్ట్ కనెక్టింగ్ ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. ఈ పికప్‌కి సంబంధించిన తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Toyota Hilux Pickup Truck To Be Launched In Two Trims In India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X