ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ TVC విడుదల చేసిన Toyota.. ఇందులో రెండు కొత్త ఫీచర్స్ కూడా..

ప్రముఖ జపనీస్ వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ (Toyota Kirloskar) భారతీయ మార్కెట్లో తన పరిధిని మరింత విస్తరించడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు ఆధునిక మోడల్స్ విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ తన ప్రసిద్ధ MPV టయోటా ఇన్నోవా క్రిస్టా యొక్క లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. అయితే ఇప్పుడు కంపెనీ దీని యొక్క TVC విడుదల చేసింది దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ TVC విడుదల చేసిన Toyota.. ఇందులో రెండు కొత్త ఫీచర్స్ కూడా..

టయోటా కంపెనీ 2021 అక్టోబర్‌లో టయోటా ఇన్నోవా క్రిస్టా యొక్క లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇది దాని ప్రామాణిక మోడల్ యొక్క GX ట్రిమ్ ఆధారంగా రూపొందించబడింది. కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త ఎడిషన్ యొక్క పెట్రోల్ వేరియంట్ ధర రూ. 17.18 లక్షలు (ఎక్స్ షోరూమ్) కాగా, డీజిల్ వేరియంట్ ధర రూ. 18.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).

ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ TVC విడుదల చేసిన Toyota.. ఇందులో రెండు కొత్త ఫీచర్స్ కూడా..

కంపెనీ ఇప్పుడు విడుదల చేసిన ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ యొక్క TVC వీడియోలో రెండు ఫీచర్లను గురించి వెల్లడించింది. ఇందులో కొత్త ఎయిర్ ఐయోనైజర్ మరియు ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. ఇందులో కొత్త ఎయిర్ ఐయోనైజర్ వాహన వినియోగదారులు చాలా అద్భుతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.

ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ TVC విడుదల చేసిన Toyota.. ఇందులో రెండు కొత్త ఫీచర్స్ కూడా..

ప్రస్తుత కాలంలో వాయు కాలుష్యం నిరంతరం పెరుగుతున్న కారణంగా, చాలా మంది వాహన వినియోగదారులు తమ కార్లలో ఎయిర్ ఐయోనైజర్లను వినియోగించడం ప్రారంభించారు. అయితే ఈ ఫీచర్ కోసం ప్రజలు కొంత మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు టయోటా కంపెనీ తన టయోటా ఇన్నోవా క్రిస్టా యొక్క లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌లో ఈ ఫీచర్ అందిస్తుంది.

ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ TVC విడుదల చేసిన Toyota.. ఇందులో రెండు కొత్త ఫీచర్స్ కూడా..

అంతే కాకూండా.. ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్‌కు టయోటా జోడించిన మరో ఫీచర్ 360-డిగ్రీస్ పార్కింగ్ కెమెరా. ఇది డ్రైవర్‌కు ఎమ్‌పివిని ఇరుకైన ప్రదేశాలలో చాలా సౌకర్యవంతంగా పార్క్ చేయడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న దాదాపు హై ఎండ్ కార్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది ప్రాథమికంగా వాహనం యొక్క టాప్-డౌన్ వ్యూ అందిస్తుంది. టయోటా దీనిని మల్టీ-టెర్రైన్ మానిటర్ అని పిలుస్తుంది.

ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ TVC విడుదల చేసిన Toyota.. ఇందులో రెండు కొత్త ఫీచర్స్ కూడా..

టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇప్పుడు రెండవ వరుస ప్రయాణీకుల కోసం కూడా వైర్‌లెస్ ఛార్జర్‌ను అందిస్తోంది. ఇది రెండవ వరుసలో ఉన్న ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటుంది. దీనితో పాటు కంపెనీ ఈ కారులోని క్యాబిన్‌కు మరింత ప్రీమియం అనుభూతిని అందించే యాంబియంట్ లైటింగ్‌ను కూడా అందించింది.

ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ TVC విడుదల చేసిన Toyota.. ఇందులో రెండు కొత్త ఫీచర్స్ కూడా..

ఇన్నోవా క్రిస్టా యొక్క లిమిటెడ్ ఎడిషన్‌లో హెడ్స్-అప్ డిస్‌ప్లే కూడా అందుబాటులో ఉంటుంది. ఇది టైమ్ మరియు స్పీడ్ వంటి ప్రాధమిక సమాచారాన్ని విండ్‌షీల్డ్‌పై ప్రొజెక్ట్ చేస్తుంది. దీని కారణంగా, డ్రైవర్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ని చూడాల్సిన అవసరం లేదు. కావున డ్రైవర్ తన మొత్తం దృష్టిని డ్రైవింగ్ పై పెట్టవచ్చు.

ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ TVC విడుదల చేసిన Toyota.. ఇందులో రెండు కొత్త ఫీచర్స్ కూడా..

టయోటా ఈ కొత్త ఎడిషన్‌కు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా జోడించబడింది. ఇది కారు డ్రైవర్‌కు రియల్ టైమ్ టైర్ ప్రెజర్ చూపుతుంది. టైర్ ప్రెజర్ తగ్గడం ప్రారంభిస్తే అది డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది మరియు పంక్చర్ ఉందని డ్రైవర్‌కు తెలుస్తుంది. మిగిలిన దాదాపు చాలా ఫీచర్లు స్టాండర్డ్ MPV యొక్క GX వేరియంట్‌ని పోలి ఉంటాయి.

ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ TVC విడుదల చేసిన Toyota.. ఇందులో రెండు కొత్త ఫీచర్స్ కూడా..

ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ లోని ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో హీటర్‌తో మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, బ్రేక్ అసిస్ట్‌తో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, టిల్ట్ మరియు టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ మరియు ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ అవుట్‌సైడ్ రియర్‌వ్యూ మిర్రర్‌ వంటివి ఉంటాయి.

ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ TVC విడుదల చేసిన Toyota.. ఇందులో రెండు కొత్త ఫీచర్స్ కూడా..

అంతే కాకుండా టయోటా ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ లో అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబటులో ఉన్నాయి. ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, క్నీ ఎయిర్‌బ్యాగ్ వంటివి కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ మరియు 12వి ఛార్జింగ్ సాకెట్‌తో కూడిన డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేతో కూడిన 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ వంటివాటిని కూడా పొందుతుంది.

మార్కెట్లో టయోటా ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ 7 మరియు 8 సీట్ల ఎంపికలలో విక్రయించబడుతోంది. 7 సీట్ల వేరియంట్‌కు మధ్య వరుసలో రెండు కెప్టెన్ సీట్లు లభిస్తుండగా, 8 సీట్ల వెర్షన్‌కు బెంచ్ సీటు లభిస్తుంది. ఇవి ఫ్యామిలీతో ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ TVC విడుదల చేసిన Toyota.. ఇందులో రెండు కొత్త ఫీచర్స్ కూడా..

టయోటా ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ రెండు ఇంజిన్ ఆప్సన్ కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ కాగా, మరొకటి 2.4-లీటర్ డీజిల్ ఇంజన్.

ఇందులోని 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ 166 బిహెచ్‌పి పవర్‌ మరియు 245 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే విధంగా ఇందులోని 2.4-లీటర్ డీజిల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్‌ మరియు 343 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇవి మంచి ఇంధన సామర్థ్యాన్ని అందిస్తాయి.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota innova crysta limited edition new tvc released features details
Story first published: Friday, December 24, 2021, 16:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X