లిమిటెడ్ మాట్ ఎడిషన్‌లో విడుదలైన Volkswagen Polo & Vento: ధర & వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ Volkswagen (ఫోక్స్‌వ్యాగన్) భారతీయ మార్కెట్లో Polo (పోలో) మరియు Vento (వెంటో) యొక్క Limited Matt Edition ను విడుదల చేసింది. ఫోక్స్‌వ్యాగన్ పోలో లిమిటెడ్ మాట్ ఎడిషన్ ధర రూ. 9.99 లక్షలు కాగా, ఫోక్స్‌వ్యాగన్ వెంటో లిమిటెడ్ మాట్ ఎడిషన్ ధర రూ. 11.94 లక్షలు. వెంటో హైలైన్ ప్లస్ AT వేరియంట్ ధర రూ. 13.34 లక్షలు.

లిమిటెడ్ మాట్ ఎడిషన్‌లో విడుదలైన Volkswagen Polo & Vento: ధర & వివరాలు

Polo (పోలో) మరియు Vento (వెంటో) యొక్క Limited Matt Edition 5 అక్టోబర్ 2021 నుండి అన్ని ఫోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది. కంపెనీ బుకింగ్స్ ప్రారంభించింది. కావున కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు సమీపంలోని ఏదైనా డీలర్‌షిప్‌ని సందర్శించి లేదా బ్రాండ్ యొక్క ఆన్‌లైన్ లో బుక్ చేసుకోవచ్చు.

లిమిటెడ్ మాట్ ఎడిషన్‌లో విడుదలైన Volkswagen Polo & Vento: ధర & వివరాలు

ఈ కొత్త మోడల్స్ కి 4 సంవత్సరాల ప్రామాణిక వారంటీ, 4 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెంట్ వారంటీ మరియు 3 సంవత్సరాల ఫ్రీ సర్వీస్‌తో కూడిన కంపెనీ 4EVER కేర్ ప్యాకేజీని ప్రామాణికంగా అందిస్తోంది. Matt Edition ను కంపెనీ అక్టోబర్ 5 నుండి డెలివరీలను కూడా ప్రారంభించింది.

లిమిటెడ్ మాట్ ఎడిషన్‌లో విడుదలైన Volkswagen Polo & Vento: ధర & వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ పోలో రెండు పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. మొదటి ఇంజిన్ 1.0-లీటర్, త్రీ సిలిండర్ల ఎంపిఐ యూనిట్, ఇది 76 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ ఎంట్రీ లెవల్ ట్రెండ్‌లైన్ మరియు కంఫర్ట్ లైన్ ట్రిమ్‌లలో మాత్రమే లభిస్తుంది.

లిమిటెడ్ మాట్ ఎడిషన్‌లో విడుదలైన Volkswagen Polo & Vento: ధర & వివరాలు

ఇక ఇందులోని 1.0-లీటర్, 3-సిలిండర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజిన్, ఇది 110 బిహెచ్‌పి పవర్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. వెంటో అదే టిఎస్ఐ ఇంజిన్‌తో మాత్రమే లభిస్తుంది మరియు పోలో వలె అదే గేర్‌బాక్స్ ఎంపికలను పంచుకుంటుంది.

లిమిటెడ్ మాట్ ఎడిషన్‌లో విడుదలైన Volkswagen Polo & Vento: ధర & వివరాలు

ప్రస్తుత తరం పోలో కంపెనీ MQB AO IN ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. ఫోక్స్‌వ్యాగన్ పోలో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ వెంట్స్ వంటి అనేక ఫీచర్లను పొందుతుంది.

ఫోక్స్‌వ్యాగన్ పోలో 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఫ్లాష్ రెడ్, సన్ సెట్ రెడ్, కాండీ వైట్ మరియు కార్బన్ స్టీల్త్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

లిమిటెడ్ మాట్ ఎడిషన్‌లో విడుదలైన Volkswagen Polo & Vento: ధర & వివరాలు

ఇక ఫోక్స్‌వ్యాగన్ వెంటో విషయానికి వస్తే, ఇది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, వాయిస్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబిడి, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, రేంజ్ సెన్సింగ్ వైపర్స్ మరియు రియర్ ఏసీ వెంట్స్ వంటివి కలిగి ఉంటుంది.

భారతీయ మార్కెట్లో ప్రస్తుత తరం పోలో ధర రూ. 6.27 లక్షల నుండి రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో అందుబాటులో ఉంది. అదే విధంగా ప్రస్తుత తరం వెంటో ధర రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 14.10 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

లిమిటెడ్ మాట్ ఎడిషన్‌లో విడుదలైన Volkswagen Polo & Vento: ధర & వివరాలు

ఇటీవల Volkswagen కంపెనీ భారతీయ మార్కెట్లో ఎంతోమంది వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ను విడుదల చేసింది. ఈ కొత్త SUV ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది రెండు ఇంజిన్ ఎంపికలలో అందించబడుతుంది. ఇందులో ఒకటి 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కాగా, రెండవది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇందులోని 1.0-లీటర్ ఇంజిన్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 113 బిహెచ్‌పి పవర్ మరియు 1750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జతచేయబడింది.

లిమిటెడ్ మాట్ ఎడిషన్‌లో విడుదలైన Volkswagen Polo & Vento: ధర & వివరాలు

ఇక 1.5-లీటర్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 5000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 148 బిహెచ్‌పి శక్తిని మరియు 1500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. జిటి వేరియంట్లో 1.5-లీటర్ టీఎస్ఐ ఇంజిన్‌తో ప్రామాణికంగా అందించబడుతుంది.

Most Read Articles

English summary
Volkswagen launches polo and vento limited matt edition price features details
Story first published: Tuesday, October 5, 2021, 19:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X