Vento సెడాన్‌కి రీప్లేస్‌మెంట్‌గా వస్తున్న Volkswagen Virtus

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ Volkswagen (ఫోక్స్‌వ్యాగన్) భారత మార్కెట్లో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇటీవలే తమ సరికొత్త 'Taigun' (టైగన్) ఎస్‌యూవీని ఆవిష్కరించిన Volkswagen, దేశీయ మార్కెట్ కోసం మరొక సరికొత్త సెడాన్ మోడల్‌ను పరిచయం చేయనున్నట్లు దృవీకరించింది.

సెడాన్‌కి రీప్లేస్‌మెంట్‌గా వస్తున్న Volkswagen Virtus

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) పేరుతో ఓ మిడ్-సైజ్ సెడాన్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇది ప్రస్తుతం Volkswagen బ్రాండ్ దేశీయ మార్కెట్లో లభిస్తున్న Vento సెడాన్ స్థానాన్ని భర్తీ చేయనుంది మరియు మార్కెట్లో ఇది హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, మారుతి సుజుకి సియాజ్ మరియు స్కోడా ర్యాపిడ్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

సెడాన్‌కి రీప్లేస్‌మెంట్‌గా వస్తున్న Volkswagen Virtus

సెడాన్ విభాగంలో ప్రస్తుతం Volkswagen నుండి లభిస్తున్న ఏకైక మోడల్ Vento మాత్రమే. అయితే, ఈ మోడల్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ నేపథ్యంలో, ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా కొత్తదనం కోరుకునే కస్టమర్ల కోసం కంపెనీ ఓ సరికొత్త సెడాన్‌ను విడుదల చేయాలని భావిస్తోంది.

సెడాన్‌కి రీప్లేస్‌మెంట్‌గా వస్తున్న Volkswagen Virtus

కంపెనీ తమ Volkswagen Virtus సెడాన్‌ని ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తోంది మరియు అక్కడి మార్కెట్లలో ఇది ఓ మంచి సక్సెస్‌ఫుల్ మోడల్‌గా ఉంది. కాగా, Volkswagen India, ఈ కొత్త సెడాన్‌ను ప్రస్తుతం భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. పలు సందర్భాల్లో ఇందుకు సంబంధించిన స్పై చిత్రాలు కూడా ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

సెడాన్‌కి రీప్లేస్‌మెంట్‌గా వస్తున్న Volkswagen Virtus

తాజాగా 'ఆటోకార్ ఇండియా' ద్వారా అందిన సమాచారం ప్రకారం, కొత్త Volkswagen Virtus వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి భారత మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. వాస్తవానికి, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మన దేశంలో జరగబోయే 2022 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ కొత్త సెడాన్‌ను ఆవిష్కరించాలని ప్లాన్ చేసింది.

సెడాన్‌కి రీప్లేస్‌మెంట్‌గా వస్తున్న Volkswagen Virtus

అయితే, దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆ ఆటో షో క్యాన్సిల్ అయింది. కోవిడ్-19 నేపథ్యంలో, ఆటో ఎక్స్‌పో నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని తదుపరి తేదీలకు వాయిదా వేశారు. ఈ కారణంగా, భారత మార్కెట్లో కొత్త Volkswagen Virtus సెడాన్ లాంచ్ అనుకున్న సమయం కన్నా మరింత ఆలస్యం కానుంది. అయితే, ఏదేమైనప్పటికీ, కంపెనీ మాత్రం ఈ కారును వచ్చే ఏడాది ఆరంభంలో ఆవిష్కరించే అవకాశం ఉంది.

సెడాన్‌కి రీప్లేస్‌మెంట్‌గా వస్తున్న Volkswagen Virtus

ఈ బ్రాండ్ నుండి ఇటీవల ఆవిష్కరించబడిన Taigun ఎస్‌యూవీని నిర్మించిన MQB A0 IN ప్లాట్‌ఫామ్‌పైనే ఈ కొత్త Virtus సెడాన్‌ను కూడా రూపొందించనున్నారు. Volkswagen ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రత్యేకించి భారత మార్కెట్ కోసం రూపొందించింది. ఈ కొత్త సెడాన్ 4,482 మిమీ పొడవు, 1,751 మిమీ వెడల్పు మరియు 1,472 మిమీ ఎత్తును కలిగి ఉంటుందని సమాచారం.

సెడాన్‌కి రీప్లేస్‌మెంట్‌గా వస్తున్న Volkswagen Virtus

ఈ కొలతలను Volkswagen Vento సెడాన్‌తో పోల్చి చూసినప్పుడు, Volkswagen Virtus సెడాన్ వెంటో కన్నా దాదాపు 92 మిమీ పొడవు, 52 మిమీ వెడల్పు మరియు 5 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ కూడా వెంటో కన్నా 98 మిమీ ఎక్కువ పొడవును కలిగి ఉంటుంది. ఈ కొలతలతో ఇది చాలా విశాలమైన ఇంటీరియర్ క్యాబిన్ మరియు మెరుగైన బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది.

సెడాన్‌కి రీప్లేస్‌మెంట్‌గా వస్తున్న Volkswagen Virtus

అంతేకాకుండా, డిజైన్, ఫీచర్లు మరియు టెక్నాలజీ పరంగా ఇది Vento కన్నా ఎన్నో రెట్లుగా మెరుగ్గా ఉండనుంది. క్యాబిన్ లోపల 10 ఇంచ్ 'వర్చువల్ కాక్‌పిట్', 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు వెనుక ప్రయాణికుల కోసం ఏసి వెంట్స్ వంటి ఫీచర్లను ఈ కారులో ఆశించవచ్చు.

సెడాన్‌కి రీప్లేస్‌మెంట్‌గా వస్తున్న Volkswagen Virtus

ఇదివరకు చెప్పుకున్నట్లుగా Volkswagen Virtus సెడాన్ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించబడుతోంది. అయితే, భారత మార్కెట్లో మాత్రం కంపెనీ ఇందులోని ఫేస్‌లిఫ్టెడ్ మోడల్‌ను విడుదల చేయవచ్చు. ఈ కారును Tigun ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మిస్తున్న నేపథ్యంలో, ఆ ఎస్‌యూవీలో కనిపించే కొన్ని రకాల ఫీచర్లను ఇందులో కూడా ఆశించవచ్చు.

సెడాన్‌కి రీప్లేస్‌మెంట్‌గా వస్తున్న Volkswagen Virtus

ఈ రెండు మోడళ్లలో ఇంజన్ ఆప్షన్లు కూడా ఒకేలా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం Volkswagen Tigun ఎస్‌యూవీ లో అందించే 1.0 లీటర్ మరియు 1.5 లీటర్ టిఎస్ఐ ఇంజన్లనే కొత్త Virtus సెడాన్‌లో కూడా అందించవచ్చు. ఇందులోని చిన్న 1.0 లీటర్ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పి శక్తిని మరియు పెద్ద 1.5 లీటర్ టిఎస్ఐ ఇంజన్ గరిష్టంగా 148 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

సెడాన్‌కి రీప్లేస్‌మెంట్‌గా వస్తున్న Volkswagen Virtus

ఈ రెండు ఇంజన్లు కూడా ప్రామాణికంగా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో లభిస్తాయి. కాకపోతే, ఇందులోని 1.0 లీటర్ ఇంజన్ మాత్రం అదనంగా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు 1.5 లీటర్ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. కాబట్టి, Volkswagen Virtus సెడాన్‌లో కూడా ఇవే ట్రాన్సిమిషన్ ఆప్షన్లను ఆశించవచ్చు.

సెడాన్‌కి రీప్లేస్‌మెంట్‌గా వస్తున్న Volkswagen Virtus

ఇక ఈ కారులో ఆఫర్ చేయబోయే సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి) తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్, ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామా (ఈఎస్‌పి) మరియు హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో పాటుగా మరికొన్ని అదనపు లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లను కంపెనీ ఇందులో అందించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Volkswagen virtus to replace vento sedan in india launch expected by 2022 april
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X