భారత్‌లో వోల్వో ఎస్90 డిస్‌కంటిన్యూ అయిందా!? వెబ్‌సైట్ నుండి తొలగింపు

స్వీడిష్ కార్ కంపెనీ వోల్వో, భారత మార్కెట్లో విక్రయిస్తున్న వోల్వో ఎస్90 సెడాన్‌ను మార్కెట్లో నిలివిపేసినట్లుగా తెలుస్తోంది. వోల్వో ఎస్90 సెడాన్ మోడల్‌ను కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్ నుండి తొలగించడాన్ని చూస్తుంటే, ఈ విషయం స్పష్టమవుతోంది.

భారత్‌లో వోల్వో ఎస్90 డిస్‌కంటిన్యూ అయిందా!? వెబ్‌సైట్ నుండి తొలగింపు

వోల్వో ఎస్90 సెడాన్‌ను తొలిసారిగా 2016లో భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. అధిక ధర కారణంగా ఈ మోడల్ అమ్మకాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. వోల్వో ఇండియా దేశీయ విపణిలో తమ ఎస్90 సెడాన్‌ను శాస్వతంగా నిలిపివేసిందా లేక తాత్కాలికంగా నిలిపివేసిందా అనేది తెలియాల్సి ఉంది.

భారత్‌లో వోల్వో ఎస్90 డిస్‌కంటిన్యూ అయిందా!? వెబ్‌సైట్ నుండి తొలగింపు

వోల్వో సంస్థ ఇటీవలే అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త తరం 2021 మోడల్ ఎస్90 సెడాన్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో, భారతదేశంలో కూడా ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను పరిచయం చేసేందుకే వోల్వో తమ పాత తరం ఎస్90 సెడాన్‌ను నిలిపివేసినట్లుగా తెలుస్తోంది.

MOST READ:బజాజ్ ఆటో లాంచ్ చేసిన కొత్త బైక్; పూర్తి వివరాలు

భారత్‌లో వోల్వో ఎస్90 డిస్‌కంటిన్యూ అయిందా!? వెబ్‌సైట్ నుండి తొలగింపు

ప్రస్తుతం వోల్వో ఇండియా భారత మార్కెట్లో ఎస్60 సెడాన్, ఎక్స్‌సి40, ఎక్స్‌సి60 మరియు ఎక్స్‌సి90 ఎస్‌యూవీలను విక్రయిస్తోంది. ఇవే కాకుండా ఎక్స్‌సి90 రీచార్జ్ అనే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీని మరియు ఎక్స్‌సి40 రీచార్జ్ అనే ఆల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా కంపెనీ విక్రయిస్తోంది.

భారత్‌లో వోల్వో ఎస్90 డిస్‌కంటిన్యూ అయిందా!? వెబ్‌సైట్ నుండి తొలగింపు

వోల్వో ఎస్90 సెడాన్‌ను భారత మార్కెట్ నుండి తొలగించి వేయడంతో, ఇప్పుడు వోల్వో నుండి లభిస్తున్న ఏకైక సెడాన్‌గా వోల్వో ఎస్60 కొనసాగుతోంది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.45,90,000 (ఎక్స్-షోరూమ్, ఇండియా).

MOST READ:చిట్టి చిట్టి రోబో కాదు, పిజ్జా డెలివరీ రోబో, తెలుసా.. అయితే ఇది చూడండి

భారత్‌లో వోల్వో ఎస్90 డిస్‌కంటిన్యూ అయిందా!? వెబ్‌సైట్ నుండి తొలగింపు

వోల్వో ఎస్90 సెడాన్‌ను 2016లో ప్రవేశపెట్టినప్పుడు, దానిని కేవలం ఒకే ఒక వేరియంట్ (ఇన్‌స్క్రిప్షన్)లో మాత్రమే విక్రయించే వారు. ఆ తర్వాత 2018లో ఇందులో మొమెంటం అనే కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టారు.

భారత్‌లో వోల్వో ఎస్90 డిస్‌కంటిన్యూ అయిందా!? వెబ్‌సైట్ నుండి తొలగింపు

భారత మార్కెట్లో వోల్వో ఎస్90 సెడాన్ ప్రారంభ ధర రూ.58.96 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉండేది. ఈ కారు ఒనిక్స్ బ్లాక్ మెటాలిక్, ముస్సెల్ బ్లూ మెటాలిక్ మరియు క్రిస్టల్ వైట్ పెరల్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండేది.

MOST READ:2021 టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ రివ్యూ.. భారత మార్కెట్లో పవర్‌పుల్ ఎస్‌యూవీ

భారత్‌లో వోల్వో ఎస్90 డిస్‌కంటిన్యూ అయిందా!? వెబ్‌సైట్ నుండి తొలగింపు

వోల్వో ఎస్90 కారులో శక్తివంతమైన 2.0-లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 187 బిహెచ్‌పి పవర్‌ను మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

భారత్‌లో వోల్వో ఎస్90 డిస్‌కంటిన్యూ అయిందా!? వెబ్‌సైట్ నుండి తొలగింపు

భారత లగ్జరీ మార్కెట్లో విడుదలైన వోల్వో ఎస్90 ఈ విభాగంలో బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్, ఆడి ఏ6, మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్, జాగ్వార్ ఎస్‌ఎఫ్ వంటి మోడళ్లకు పోటీగా ఉండేది.

MOST READ:బ్రేకింగ్ న్యూస్; బెంగళూరులో తిరగాలంటే మీ బైక్‌కి ఇది తప్పని సరి.. లేకుంటే?

భారత్‌లో వోల్వో ఎస్90 డిస్‌కంటిన్యూ అయిందా!? వెబ్‌సైట్ నుండి తొలగింపు

మరి వోల్వో ఇండియా తమ ఎస్90 సెడాన్‌ను శాస్వతంగా భారత మార్కెట్ నుండి తొలగించివేసిందా లేక ఇందులో కొత్త 2021 మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు ఈ మోడల్‌ను తాత్కాలికంగా నిలిపివేసిందా అనేది తెలియాల్సి ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

Read more on: #వోల్వో #volvo
English summary
Volvo India Removes S90 Sedan From Its Official Website, Details. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X