2022 టాటా టిగోర్ ఈవి: మరిన్ని ఫీచర్స్ & మరింత ఎక్కువ రేంజ్ - ధర, వివరాలు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు అత్యంత నమ్మికయిన దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' ఇప్పుడు అప్డేటెడ్ 'టిగోర్ ఈవి' విడుదల చేసింది.

దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త అప్డేటెడ్ 'టాటా టిగోర్ ఈవి' ధరలు, డిజైన్ అప్డేట్స్, అప్డేటెడ్ ఫీచర్స్ మరియు బ్యాటరీ ప్యాక్ వంటి మరిన్ని పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

2022 టాటా టిగోర్ ఈవి

కొత్త టాటా టిగోర్ ఈవి మొత్తమ్ నాలుగు ట్రిమ్స్ లో అందుబాటులో ఉంది. అవి ఎక్స్ఈ, ఎక్స్‌టి, ఎక్స్‌జెడ్ ప్లస్ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్ లక్స్. టాటా టిగోర్ ఈవి 'ఎక్స్ఈ' ధర రూ. 12.49 లక్షలు కాగా, టాప్ వేరియంట్ 'ఎక్స్‌జెడ్ ప్లస్ లక్స్' ధర రూ. 13.75 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఎక్స్‌జెడ్ ప్లస్ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్ లక్స్ వేరియంట్స్ కొత్తగా పరిచయం చేయబడినవి.

2022 టాటా టిగోర్ EV 'మాగ్నెటిక్ రెడ్' అనే కొత్త కలర్ ఆప్సన్ లో కూడా అందుబాటులో ఉంటుంది. అంతే కాకూండా ఇందులో దాని మునుపటి స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ పొందుతుంది. అదే సమయంలో రేంజ్ కూడా దాని మునుపటి మోడల్ కంటే ఎక్కువ. కావున ఈ కొత్త 2022 టిగోర్ EV రేంజ్ ఇప్పుడు 315 కిమీ వరకు ఉంటుంది.

టాటా టిగోర్‌ యొక్క మునుపటి మోడల్ యొక్క రేంజ్ 306 కిమీ. ఈ కొత్త అప్డేటెడ్ టాటా టిగోర్ EV మల్టీ మోడ్ రీజెన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ మరియు టైర్ పంక్చర్ రిపేర్ కిట్ వంటి 10 కొత్త స్మార్ట్ ఫీచర్‌లతో వస్తుంది. మల్టీ మోడ్ రీజెన్ అనేది నెక్సాన్ ఈవి మ్యాక్స్ వంటి వాటిలో అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇక్కడ తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కొత్త అప్డేటెడ్ 2022 టిగోర్ EV సెడాన్‌లో ప్రవేశపెట్టబడిన చాలా ఫీచర్లు ఇప్పటికే ఉన్న టిగోర్ EV కస్టమర్‌లకు సాధారణ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా అందుబాటులో ఉంటాయి. అయితే ఈ అప్‌డేట్ ప్రస్తుతం ఉన్న టిగోర్ EV కస్టమర్‌లకు ఉచితంగా అందించబడుతుంది. కావున ఇప్పటికే టాటా టిగోర్ EV కలిగిన కస్టమర్లు ఈ అప్‌డేట్ పొందవచ్చు.

టాటా మోటార్స్ అందించిన సమాచారం ప్రకారం, ప్రస్తుత టిగోర్ EV కలిగిన కస్టమర్‌లు ఇప్పుడు ఈ ఫ్రీ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ను పొందేందుకు టాటా కంపెనీ యొక్క అధీకృత సర్వీస్ సెంటర్‌లను సందర్శించి అప్డేట్ పొందవచ్చు. అంతే కాకుండా ఈ కొత్త స్మార్ట్ ఫీచర్లు ఈ టిగోర్ EV ఎలక్ట్రిక్ సెడాన్ యొక్క అన్ని ట్రిమ్ లెవల్స్ లో అందుబాటులో ఉంటాయి. ఇది టిగోర్ EV కస్టమర్లు గమనించాలి.

కొత్త 2022 టాటా టిగోర్ EV 26 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది IP67 సర్టిఫికేషన్‌ పొందింది కావున ఇది దుమ్ము మరియు నీరు వంటి వాటిని నుంచి రక్షించబడే విధంగా ఉంటుంది. ఇది గరిష్టంగా 74 బిహెచ్‌పి పవర్ మరియు 170 ఎన్ఎమ్ టార్క్ కలిగి ఉంది. టియాగో ఈవి కేవలం 5.7 సెకన్లలోనే 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

Most Read Articles

English summary
2022 tata tigor ev launched with increased range price features details
Story first published: Wednesday, November 23, 2022, 15:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X