2022 Camry Hybrid విడుదల చేసిన Toyota: ధర & వివరాలు కోసం ఇక్కడ చూడండి

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన అప్డేటెడ్ 2022 టయోటా క్యామ్రీ హైబ్రిడ్‌ (2022 Toyota Camry Hybrid) విడుదల చేసింది. ఈ కొత్త అప్డేటెడ్ మోడల్ ధర దేశీయ మార్కెట్లో రూ. 41.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ హైబ్రిడ్ వెర్షన్ యొక్క బుకింగ్స్ ప్రారంభించింది, కావున కస్టమర్లు కంపెనీ యొక్క డీలర్‌షిప్‌లలో లేదా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి. ఈ కొత్త హైబ్రిడ్ కారు గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2022 Camry Hybrid విడుదల చేసిన Toyota: ధర & వివరాలు కోసం ఇక్కడ చూడండి

ఈ కొత్త మోడల్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. టయోటా క్యామ్రీ హైబ్రిడ్ వెర్షన్ భారత దేశంలో మొదటిసారిగా 2013 సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. అప్పట్లోనే ఈ కారుని ఎక్కువమంది కొనుగోలుదారులు ఎగబడి కొనుగోలు చేశారు. అయితే ఇప్పడు ఈ మోడల్ మరిన్ని అప్డేట్స్ విడుదలయ్యింది. ఈ మోడల్ కూడా కస్టమర్లను తప్పకుండా ఆకర్షిస్తుందని ఆశిస్తున్నాము.

2022 Camry Hybrid విడుదల చేసిన Toyota: ధర & వివరాలు కోసం ఇక్కడ చూడండి

2022 టయోటా క్యామ్రీ హైబ్రిడ్‌ విడుదల సందర్భంగా టయోటా కిర్లోస్కర్ మోటార్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ & స్ట్రాటజిక్ మార్కెటింగ్) 'అతుల్ సూద్' మాట్లాడుతూ.. ఈ కొత్త 2022 టయోటా క్యామ్రీ హైబ్రిడ్ ఆకర్షణీయమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల తప్పకుండా కస్టమర్లను ఆకర్శించడంలో విజయం పొందుతుందన్నారు. 2022 టయోటా క్యామ్రీ హైబ్రిడ్ కార్బన్ న్యూట్రల్ పర్యావరణం పట్ల మా అచంచలమైన ప్రయత్నాలకు నిదర్శనం అని ఆయన అన్నారు.

2022 Camry Hybrid విడుదల చేసిన Toyota: ధర & వివరాలు కోసం ఇక్కడ చూడండి

ఈ కొత్త టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ డిజైన్ విషయానికి వస్తే, ఇది కొత్త ఫ్రంట్ బంపర్ డిజైన్, గ్రిల్ మరియు అల్లాయ్ వీల్స్‌తో దాని బోల్డ్ మరియు అధునాతన రూపాన్ని మెరుగుపరుస్తుంది. సెల్ఫ్-ఛార్జింగ్ టయోటా క్యామ్రీ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సెడాన్ ఇప్పుడు కొత్త మెటల్ స్ట్రీమ్ మెటాలిక్ అనే ఎక్స్టీరియర్ కలర్ లో అందుబాటులో ఉంటుంది.

2022 Camry Hybrid విడుదల చేసిన Toyota: ధర & వివరాలు కోసం ఇక్కడ చూడండి

ఈ కొత్త వెర్షన్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా వరకు అప్డేటెడ్ గా ఉంటుంది. ఇందులోని క్యాబిన్ కూడా లేటెస్ట్ డిజైన్ పొందుతుంది. ఆంగ్తె కాకూండా ఫ్లోటింగ్-టైప్ పెద్ద 9 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి వాటికి మద్దతు ఇస్తుంది.

2022 Camry Hybrid విడుదల చేసిన Toyota: ధర & వివరాలు కోసం ఇక్కడ చూడండి

ఇవి మాత్రమే కాకూండా, ఇందులో 10 వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ORVM మరియు మెమరీ ఫంక్షన్‌తో టిల్ట్-టెలీస్కోపిక్ స్టీరింగ్ కాలమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ మరియు హెడ్స్-అప్ డిస్‌ప్లే వంటివి కూడా అందుబటులో ఉన్నాయి. వెనుక సీట్లకు రిక్లైనర్ ఫీచర్, పవర్ అసిస్టెడ్ రియర్ సన్‌షేడ్, కెపాసిటివ్ టచ్ ప్యానెల్‌పై ఆడియో మరియు ఏసీ కంట్రోల్ ఉన్నాయి, వీటిని రియర్ ఆర్మ్ రెస్ట్‌లో ఉంచారు.

2022 Camry Hybrid విడుదల చేసిన Toyota: ధర & వివరాలు కోసం ఇక్కడ చూడండి

కొత్త 2022 టయోటా క్యామ్రీ హైబ్రిడ్ 2.5-లీటర్, ఫోర్-సిలిండర్ పెట్రోల్ హైబ్రిడ్ డైనమిక్ ఫోర్స్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. శక్తివంతమైన మోటారు-జనరేటర్ ఈ ఇంజన్‌తో జత చేయబడింది. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది. ఇది 160 కిలో వాట్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ఈ వెహికల్ యొక్క హైబ్రిడ్ బ్యాటరీపై 8 సంవత్సరాలు లేదా 1,60,000 కి.మీ వారంటీని అందిస్తుంది.

2022 Camry Hybrid విడుదల చేసిన Toyota: ధర & వివరాలు కోసం ఇక్కడ చూడండి

కొత్త క్యామ్రీ హైబ్రిడ్ మోడల్ మూడు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి స్పోర్ట్, ఎకో మరియు నార్మల్ మోడ్స్. స్పోర్ట్ మోడ్‌లో, కామ్రీ యొక్క డైనమిక్ ఫోర్స్ ఇంజిన్ నాన్-లీనియర్ త్రాటల్ కంట్రోల్ ద్వారా యాక్సిలరేషన్ యొక్క రెస్పాన్స్ ను మెరుగుపరుస్తుంది. ఈ ఇంజన్‌పై టయోటా అధ్యయనం కూడా చేసింది. కావున ఇది వాహన వినియఁగదారులకు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

2022 Camry Hybrid విడుదల చేసిన Toyota: ధర & వివరాలు కోసం ఇక్కడ చూడండి

2022 టయోటా క్యామ్రీ హైబ్రిడ్ టయోటా న్యూ గ్లోబల్ ఆర్కిటెక్చర్ (TNGA)పై నిర్మించబడింది. ఈ ఆర్కిటెక్చర్ కారుకు అధిక శరీర దృఢత్వం, అపూర్వమైన సౌలభ్యం, మెరుగైన స్థిరత్వం మరియు మెరుగైన నిర్వహణను అందిస్తుంది. కావున వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

2022 Camry Hybrid విడుదల చేసిన Toyota: ధర & వివరాలు కోసం ఇక్కడ చూడండి

2022 టయోటా క్యామ్రీ హైబ్రిడ్ సెడాన్ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 9 ఎయిర్‌బ్యాగ్‌లు మరియు బ్యాక్ గైడ్ మానిటర్‌తో పార్కింగ్ అసిస్ట్‌ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ బ్రేక్ హోల్డ్ ఫంక్షన్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా అందించబడ్డాయి.

ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. మొత్తానికి ఈ కొత్త మోడల్ కొత్త ఫీచర్స్ తో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టింది. అయితే ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుందనే విషయం త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
2022 toyota camry hybrid launched in india at rs 41 70 lakhs details
Story first published: Thursday, January 13, 2022, 9:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X