రీకాల్ అలెర్ట్.. బ్యాటరీ సమస్య కారణంగా బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ మరియు ఐ4 ఎలక్ట్రిక్ కార్ల రీకాల్!

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ (BMW) యునైటెడ్ స్టేట్స్‌ లో విక్రయించిన ఐఎక్స్ (iX) మరియు ఐ4 (i4) ఎలక్ట్రిక్ కార్ల కోసం స్వచ్ఛంద సేఫ్టీ రీకాల్‌ జారీ చేసింది. ఈ రెండు రకాల ఎలక్ట్రిక్ వాహనాలలో వినియోగించిన బ్యాటరీలో సమస్య కారణంగా ఈ రీకాల్ జారీ చేసినట్లు కంపెనీ తెలిపింది. బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించిన బ్యాటరీ ప్యాక్ లు Samsung SDI కంపెనీ ద్వారా ఉత్పత్తి చేయబడ్డాయి.

రీకాల్ అలెర్ట్.. బ్యాటరీ సమస్య కారణంగా బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ మరియు ఐ4 ఎలక్ట్రిక్ కార్ల రీకాల్!

యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌తో బిఎమ్‌డబ్ల్యూ సమర్పించిన స్వచ్ఛంద రీకాల్ నివేదిక ప్రకారం, 2022 BMW i4 eDrive40 కి సంబంధించిన యూఎస్-యేతర ఫీల్డ్ ఘటనకు సంబంధించిన సంఘటన గురించి కార్‌మేకర్ మొదటగా తెలుసుకుంది. ఆ తర్వాత బిఎమ్‌డబ్ల్యూ ఇంజనీరింగ్ పరిశోధనను ప్రారంభించింది మరియు ఈ విషయాన్ని బ్యాటరీ సరఫరాదారుకి తెలియజేసింది.

రీకాల్ అలెర్ట్.. బ్యాటరీ సమస్య కారణంగా బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ మరియు ఐ4 ఎలక్ట్రిక్ కార్ల రీకాల్!

బిఎమ్‌డబ్ల్యూ తమ అధికారిక ప్రకటనలో, "ఏప్రిల్ సంఘటన నుండి వాహనం కోసం బ్యాటరీ సరఫరాదారు ఉత్పత్తి రికార్డులను సమీక్షించడం జరిగింది. సరఫరాదారు (శాంసంగ్ ఎస్‌డిఐ) బ్యాటరీ ఉత్పత్తి ప్రక్రియలో ఒక క్రమరాహిత్యాన్ని పాటించినట్లు విశ్లేషణలు సూచించాయి, ఇది బ్యాటరీ సెల్‌లోకి చెత్తను ప్రవేశించడానికి అనుమతించింది. తదుపరి విశ్లేషణలలో బ్యాటరీ సెల్స్ లో కాథోడ్ ముక్కలను గుర్తించామని" పేర్కొంది.

రీకాల్ అలెర్ట్.. బ్యాటరీ సమస్య కారణంగా బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ మరియు ఐ4 ఎలక్ట్రిక్ కార్ల రీకాల్!

జూన్ 3, 2022న యునైటెడ్ స్టేట్స్‌లో మోడల్ ఇయర్ 2022 iX xDrive50కి సంబంధించిన ఒక సంఘటన గురించి BMWకి తెలియజేయబడింది. జూన్ 19, 2022న యునైటెడ్ స్టేట్స్ వెలుపల జరిగిన మరో సంఘటన గురించి కార్‌మేకర్‌కు తెలియజేయబడింది, ఇందులో 2022 BMW iX M60 మోడల్ ఉంది. BMW iX ఎలక్ట్రిక్ SUVకి సంబంధించిన రెండు సంఘటనలలో ఒకే విధమైన విశ్లేషణను నిర్వహించింది మరియు i4లో చూసినట్లుగానే సరఫరాదారు ఉత్పత్తి ప్రక్రియలో ఒక అవకతవకతను చేసినట్లు గుర్తించింది.

రీకాల్ అలెర్ట్.. బ్యాటరీ సమస్య కారణంగా బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ మరియు ఐ4 ఎలక్ట్రిక్ కార్ల రీకాల్!

బ్యాటరీ ఉత్పత్తి సమస్యకు సంబంధించి యునైటెడ్ స్టేట్స్‌లో బిఎమ్‌డబ్ల్యూ ప్రకటించిన రీకాల్ లో 27 యూనిట్ల BMW i4 మరియు 56 యూనిట్ల BMW iX ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. ఈ రీకాల్ కు వర్తించే వాహనాలను గుర్తించి, కంపెనీ తమ కస్టమర్లను సంప్రదిస్తోంది. ఈ సమస్య ఉన్న వాహనాలను బిఎమ్‌డబ్ల్యూ అధీకృత సర్వీస్ సెంటర్లలో ఉచితంగా సర్వీస్ చేస్తామని, ఇందుకోసం కస్టమర్లు బిఎమ్‌డబ్ల్యూ డీలర్‌తో అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసుకోవాలని కంపెనీ

రీకాల్ అలెర్ట్.. బ్యాటరీ సమస్య కారణంగా బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ మరియు ఐ4 ఎలక్ట్రిక్ కార్ల రీకాల్!

ఈ సమస్యను పరిష్కరించడానికి ఏకైక మార్గం ఇందులో బ్యాటరీ ప్యాక్ ను మార్చడమే. ఇది ఈ కారు ధరలో దాదాపు సగానికి పైగా ఉంటుంది. రీకాల్ చేయబడిన BMW i4 ఎలక్ట్రిక్ సెడాన్ లో 83.9 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, ఇది పూర్తి చార్జ్ పై 590 కిలోమీటర్ల (WLTP సర్టిఫైడ్) రేంజ్ ను అందిస్తుంది. ఇక BMW iX ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఇది రెండు విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందించబడుతుంది. ఇందులోని 76.6kWh బ్యాటరీ ప్యాక్ 425 రేంజ్ ను అందిస్తుండగా, 111.5kWh బ్యాటరీ ప్యాక్ 630 కిలోమీటర్ల (WLTP సర్టిఫైడ్) రేంజ్ ను అందిస్తుంది.

రీకాల్ అలెర్ట్.. బ్యాటరీ సమస్య కారణంగా బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ మరియు ఐ4 ఎలక్ట్రిక్ కార్ల రీకాల్!

రీకాల్ కు ప్రభావితమైన i4 వాహనాలు నవంబర్ 22, 2021 నుండి జూన్ 13, 2022 మధ్య తయారు చేయబడ్డాయి. అయితే, సమస్యాత్మకమైన iX వాహనాలు డిసెంబర్ 2, 2021 మరియు జూన్ 30, 2022 మధ్య కాలంలో ఉత్పత్తి చేయబడ్డాయి. ఓనర్‌లు తమ వాహనాలకు ఛార్జ్ చేయవద్దని, వాటిని అలాగే డ్రైవ్ చేయవద్దని మరియు వారి వాహనాలను నిర్మాణాలకు దూరంగా పార్క్ చేయమని కంపెనీ సూచిస్తోంది.

రీకాల్ అలెర్ట్.. బ్యాటరీ సమస్య కారణంగా బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ మరియు ఐ4 ఎలక్ట్రిక్ కార్ల రీకాల్!

భారతదేశంలో బిఎమ్‌డబ్ల్యూ ఐ4 (BMW i4) విడుదల

ఇదిలా ఉంటే, బిఎమ్‌డబ్ల్యూ భారత మార్కెట్లో తమ కొత్త ఎలక్ట్రిక్ కారు బిఎమ్‌డబ్ల్యూ ఐ4 (BMW i4) ను ఇటీవలే విడుదల చేసింది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది పూర్తి చార్జ్ పై 590 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. ప్రస్తుతం, భారతదేశంలో కెల్లా అత్యధిక రేంజ్ ను అందించే ఎలక్ట్రిక్ కారు కూడా ఇదే. భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ ఐ4 సెడాన్ ప్రారంభ ధర రూ.69.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

రీకాల్ అలెర్ట్.. బ్యాటరీ సమస్య కారణంగా బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ మరియు ఐ4 ఎలక్ట్రిక్ కార్ల రీకాల్!

భారతదేశంలో విక్రయించే బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ కార్లను కంపెనీ పూర్తిగా విదేశాల్లో తయారు చేసి, ఇక్కడికి దిగుమతి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో, భారత్ లో విక్రయించిన ఐ4 ఎలక్ట్రిక్ కార్లు కూడా ఈ రీకాల్ కు వర్తిస్తాయా లేదా అనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ మాదిరిగానే, ఐ4 కూడా CLAR ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉంటుంది మరియు ఇది శక్తివంతమైన 83.9 kWh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది.

రీకాల్ అలెర్ట్.. బ్యాటరీ సమస్య కారణంగా బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ మరియు ఐ4 ఎలక్ట్రిక్ కార్ల రీకాల్!

ఈ బ్యాటరీ ప్యాక్ సాయంతో వెనుక భాగంలో అమర్చిన రియర్ యాక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 340 hp శక్తిని మరియు 430 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న వివరాల ప్రకారం, ఈ హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కారు కేవలం 5.7 సెకన్లలోనే గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 190 కిలోమీటర్లకు ఎలక్ట్రానిక్ గా పరిమితం చేయబడి ఉంటుంది.

Most Read Articles

English summary
Bmw recalls ix4 ev132139
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X