తరగని అందానికి మరో అందమైన కారు తోడైతే.. అదిరిపోయే కారులో కనిపించిన 'కాజోల్'

సెలబ్రెటీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలను కొనుగోలు చేస్తూ ఉంటారనే విషయం అందరికి తెలుసు. గతంలో కూడా సెలబ్రెటీలు కొనుగోలు చేసిన చాలా కార్లను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ కాజోల్ కొనుగోలు చేసిన లగ్జరీ కార్ గురించి తెలుసుకుందాం.

నటి 'కాజోల్' కొనుగోలు చేసిన లగ్జరీ కారు 'బిఎండబ్ల్యు' యొక్క 'ఎక్స్7' అని తెలుస్తోంది. ఈ బిఎండబ్ల్యు ఎక్స్7 ధర రూ.1.78 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త కారులో కనిపించే చిన్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కాజోల్ ఈ కొత్త లగ్జరీ కారు నుంచి బయటకు రావడం చూడవచ్చు. గత విజయదశమి సందర్భంగా కీర్తి సురేష్ కూడా ఈ బిఎండబ్ల్యు ఎక్స్7 కొనుగోలు చేసింది.

అదిరిపోయే కారులో కనిపించిన అందాల భామ కాజోల్

యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయబడిన ఈ వీడియోలో కాజోల్ 'సలాం వెంకీ' ప్రమోషన్లో భాగంగా ముంబైలోని అంధేరిలో కనిపించింది. కారు దిగి కెమెరా వైపు చూసి నవ్వి వెళ్ళిపోతుంది. ఈ వీడియో అంతటితో ,ముగుస్తుంది, ఆ తరువాత ఆ కారులోకి మళ్ళీ రావడం ఇందులో లేదు. మొత్తానికి నటి ఫైటోనిక్ బ్లూ కలర్ లో ఉన్న ఖరీదైన లగ్జరీ కారుని సొంతం చేసుకుంది.

నిజానికి కాజోల్ భర్త అజయ్ దేవగన్ 2020 లో BMW X7 కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కావున ఇప్పుడు కాజోల్ కనిపించిన కారు, ఆ కారు ఒకటేనా అనేది తెలియాల్సిన విషయం. BMW X7 అనేది ప్రస్తుతం భారతదేశంలోని తయారీదారు యొక్క ఫ్లాగ్ షిప్ మోడల్. కావున ఇది ఆధునిక డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఉత్తమ పనితీరుని కూడా అందిస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 SUV 12.3 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, హర్మాన్ ఆడియో సిస్టం, వైర్లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, లేన్ మానిటరింగ్, సెల్ఫ్ లెవలింగ్ అడాప్టివ్ సస్పెన్షన్, రియర్ సీట్ కోసం ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ మరియు మూడు వరుసలకు రిక్లైనింగ్ ఫంక్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇంజిన్ విషయానికి వస్తే, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 ఎక్స్‌డ్రైవ్ 40ఐ వేరియంట్ లో 3.0-లీటర్ ఇన్-లైన్ సిక్స్-సిలిండర్ ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 335 బిహెచ్‌పి మరియు 450 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే సమయంలో ఎక్స్‌డ్రైవ్30డి వేరియంట్ 3.0 లీటర్ ఇన్-లైన్ సిక్స్-సిలిండర్ ట్విన్-టర్బో డీజల్ ఉంటుంది. ఇది 260 బిహెచ్‌పి మరియు 620 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ 8 స్పీడ్ స్టెప్‌ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటాయి.

కాజోల్ కనిపించిన ఈ BMW X7 కారు 3.0 లీటర్, సిక్స్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది చూడటానికి ఆకర్షణీయంగా మాత్రమే కాదు, అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, రియర్ పార్కింగ్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

ఇదిలా ఉండగా కాజోల్ భర్త మరియు ప్రముఖ సినీ నటుడు 'అజయ్ దేవ్‌గణ్' అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కల్లినన్ కలిగి ఉన్నాడు. అజయ్ దేవ్‌గణ్ ఎక్కువగా ఈ కారులోని కనిపిస్తూ ఉంటారు. 6.75 లీటర్ వ్ 0 పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. కావున ఇది 571 పిఎస్ పవర్ మరియు 850 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ కి జతచేయబడి ఉంటుంది.

Most Read Articles

English summary
Bollywood actress kajol new bmw x7 details
Story first published: Sunday, November 27, 2022, 8:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X