దీపావళి లోపు కార్ డెలివరీ చేసుకోవాలా.. అయితే ఇవి చూడండి

భారతదేశంలో వినాయక చవితితో పండుగ సీజన్ ప్రారంభమైంది. అయితే విజయదశమి మరియు దీపావళి త్వరలోనే రానున్నాయి. అయితే ఈ పండుగల సందర్భంగా దేశీయ మార్కెట్లో కొత్త కార్లను కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతుంది. అయితే చాలామంది ఇప్పుడు బుక్ చేసుకుంటే రానున్న పండుగలలోపు డెలివరీ చేసుకోవడానికి ఇష్టపడతారు.

Recommended Video

భారతీయ మార్కెట్లో Tata Nexon కొత్త వేరియంట్ లాంచ్ | వివరాలు

ఇప్పటికే మహీంద్రా కంపెనీ యొక్క XUV700, థార్ మరియు ఇటీవల విడుదలైన స్కార్పియో-ఎన్ వంటి వాటిని ఇప్పుడు బుక్ చేసుకుంటే డెలివరీ చేసుకోవడానికి కనీసం 24 నెలలు వేచి ఉండాలి. కావున పండుగలోపు మీరు కారుని డెలివరీ చేసుకోవాలనుకుంటే మారుతి, టయోటా మరియు రెనాల్ట్ వంటి కంపెనీ బ్రాండ్స్ కొనుగోలు చేయవచ్చు. మనం ఈ కథనంలో అలాంటి కార్లను గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.

దీపావళి లోపు కారు కొనాలా.. అయితే ఇవి చూడండి

రెనాల్ట్ కైగర్ (Renault Kiger):

రెనాల్ట్ కైగర్ అనేది కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన సబ్-ఫోర్ మీటర్ SUV. ఈ SUV ని బుక్ చేసుకుంటే డెలివరీ చేసుకోవడానికి ఇప్పుడు కనీసం 4 నుంచి 6 వారాల సమయం పడుతుంది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఈ డెలివరీ టైమ్ 6 నెలల వరకు ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో ఈ SUV ని కేవలం 20 నుంచి 25 రోజుల్లో డెలివరీ చేస్తున్నారు. ఇది కూడా బుక్ చేసుకున్న వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది.

దీపావళి లోపు కారు కొనాలా.. అయితే ఇవి చూడండి

రెనాల్ట్ కైగర్ మంచి డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. కావున ఎక్కువమంది యువ కస్టమర్లను కూడా ఆకర్శించడంలో విజయం పొందుతోంది. దేశీయ మార్కెట్లో రెనాల్ట్ కైగర్ ధర రూ. 5.84 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ. 10.62 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. అయితే పండుగ సీజన్లో ఆఫర్స్ ఏమైనా అందుబాటులో ఉన్నాయా, అని కూడా కొనుగోలుదారులు డీలర్‌షిప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

దీపావళి లోపు కారు కొనాలా.. అయితే ఇవి చూడండి

టాటా నెక్సాన్ (Tata Nexon):

భారతీయ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న కాంపాక్ట్ SUV టాటా మోటార్స్ యొక్క నెక్సాన్ అనే చెప్పాలి. టాటా నెక్సాన్ ప్రతి నెలలోనూ మంచి అమ్మకాలు పొందుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ SUV ని 12,000 నుంచి 15,000 యూనిట్లను ప్రతి నెలలోనూ విక్రయిస్తోంది.

దీపావళి లోపు కారు కొనాలా.. అయితే ఇవి చూడండి

టాటా మోటార్స్ గత నెలలో మొత్తమ్ 15,085 యూనిట్ల నెక్సాన్ SUV లను విక్రయించింది. అయితే ఈ SUV ని ఇప్పుడు బుక్ చేసుకుంటే డెలివరీ చేసుకోవడానికి 8 నుంచి 10 వారాల్లో డెలివరీ అవుతుంది. మార్కెట్లో నెక్సాన్ కి ఎంత డిమాండ్ ఉందొ తెలుసు, ఈ సమయంలో ఈ మాత్రం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. నెక్సాన్ ప్రారంభ ధర భారతీయ మార్కెట్లో రూ. 7.60 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా టాప్ వేరియంట్ ధర రూ. 14.08 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

దీపావళి లోపు కారు కొనాలా.. అయితే ఇవి చూడండి

నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite):

నిస్సాన్ కంపెనీ యొక్క మాగ్నైట్ సబ్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఇది ఈ విభాగంలో అత్యంత పోటీని ఎదుర్కొని కంపెనీకి మంచి అమ్మకాలను అందిస్తోంది. ఈ SUV ని బుక్ చేసుకుంటే, డెలివరీ కోసం 1 నెల నుంచి 3 నెలల సమయం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే కొన్ని డీలర్లు ఈ SUV ని డెలివరీ చేయడానికి 3 నుంచి 5 వారాల సమయం తీసుకుంటున్నారు.

దీపావళి లోపు కారు కొనాలా.. అయితే ఇవి చూడండి

దేశీయ మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ బుక్ చేసుకుంటే త్వరలోనే డెలివరీ పొందవచ్చు. ఇది ఆకర్షణీయమైన ధర వద్ద అందుబాటులో ఉంటుంది. కావున ఈ పండుగ సీజన్లో బుక్ చేసుకోవడానికి సరైన కారు, ఈ SUV ని ఇప్పుడు బుక్ చేసుకుంటే బహుశా దీపావళి నాటికి డెలివరీ పొందవచ్చు.

దీపావళి లోపు కారు కొనాలా.. అయితే ఇవి చూడండి

మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza):

మారుతి సుజుకి కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో అప్డేటెడ్ బ్రెజ్జా విడుదల చేసింది. బ్రెజ్జా అమ్మకాలు కూడా దేశీయ మార్కెట్లో ఆశాజనకంగానే ఉన్నాయి. 2022 ఆగష్టులో మార్కెట్లో మారుతి బ్రెజ్జా 15,193 యూనిట్ల అమ్మకాలను పొందింది. ఈ అమమకాలు 2021 ఆగష్టు కంటే 18 శాతం ఎక్కువ.

దీపావళి లోపు కారు కొనాలా.. అయితే ఇవి చూడండి

నివేదికల ప్రకారం, మారుతి సుజుకి యొక్క బ్రెజ్జా కోసం అధికారిక వెయిటింగ్ పీరియడ్ దాదాపు 4 నెలలు ఉంది. అయితే ఇందులో విఎక్స్ఐ ట్రిమ్‌ను బుక్ చేసుకుంటే డెలివరీ 8 నుంచి 10 వారాలు పడుతుంది. కావున ఇది త్వరగానే మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు.

దీపావళి లోపు కారు కొనాలా.. అయితే ఇవి చూడండి

హ్యుందాయ్ వెన్యూ:

హ్యుందాయ్ కంపెనీ యొక్క వెన్యూ కూడా మార్కెట్లో మంచి అమ్మకాలతో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఇది ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. కంపెనీ ఇటీవల హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ధర దేశీయ మార్కెట్లో రూ. 12.16 లక్షలు (ఎక్స్-షోరూమ్).

దీపావళి లోపు కారు కొనాలా.. అయితే ఇవి చూడండి

నివేదికల ప్రకారం, హ్యుందాయ్ వెన్యూ డీజిల్ వేరియంట్‌లకు అధిక డిమాండ్ కారణంగా వాటి డెలివరీకి 4 నుంచి 6 నెలలు ఉండే అవకాశం ఉంది. అయితే ఇందులోని పెట్రోల్ వేరియంట్స్ అయిన S, S (O) మరియు SX బుక్ చేసుకుంటే డెలివరీ చేసుకోవడానికి రెండు నెలలు పట్టే అవకాశం ఉంటుంది.

దీపావళి లోపు కారు కొనాలా.. అయితే ఇవి చూడండి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో పండుగ సీజన్లో ఎక్కువ వాహనాలు విక్రయించబడే అవకాశం ఉంది, దాదాపు అన్ని కంపెనీలు కూడా పండుగ సీజన్లో ఎక్కువ డెలివరీ చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేసుకుంటుంది. అయితే మీరు బుక్ చేసుకునే ఆర్ వేరియంట్ మరియు డీలర్ వంటి వాటిని పరిగణలోకి తీసుకుంటే వెయిటింగ్ పీరియడ్ మరియు డెలివరీ టైమ్ మారే అవకాశం ఉంటుంది. కావున డెలివరీ గురించి ఖచ్చితమైన సమాచారం కోసం మీ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించండి.

Most Read Articles

English summary
Book these suvs to get delivery by diwali details
Story first published: Wednesday, September 21, 2022, 10:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X