కుర్రకారుకి కిర్రెక్కించే కారు.. సిట్రోయెన్ సి3.. ఈ కారు గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు

భారత మార్కెట్లో మీరు కూడా ఓ మంచి యూత్‌ఫుల్ కారు కోసం చూస్తున్నారా..? అయితే మీకు సిట్రోయెన్ సి3 (Citroen C3) ఓ ఉత్తమమైన మరియు సరసమైన ఆప్షన్ కావచ్చు. ఫ్రాన్స్ కి చెందిన కార్ కంపెనీ సిట్రోయెన్ (Citroen) భారత మార్కెట్లో విడుదల చేసిన రెండవ మోడల్ సిట్రోయెన్ సి3 కాంపాక్ట్ ఎస్‌యూవీ. సిట్రోయెన్ అనేది భారతదేశానికి కొత్త బ్రాండ్ కావచ్చు, కానీ సిట్రోయెన్ కార్ల తయారీ కొత్తేమీ కాదు. యూరోపియన్ మార్కెట్లో అత్యంత పాపులర్ అయిన కార్ బ్రాండ్లలో సిట్రోయెన్ కూడా ఒకటి. అలాంటి పాపురల్ యూరోపియన్ కార్ బ్రాండ్ ఇప్పుడు మనదేశంలో కూడా అందుబాటులోకి వచ్చింది.

కుర్రకారుకి కిర్రెక్కించే కారు.. సిట్రోయెన్ సి3.. ఈ కారు గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు

సిట్రోయెన్ భారత మార్కెట్లో విడుదల చేసిన మొదటి మోడల్ సి5 ఎయిర్‌క్రాస్. అయితే, దాని ఖరీదైన ప్రైస్ ట్యాగ్ కారణంగా, కస్టమర్లలో ఇది పెద్దగా ఆదరణ పొందలేకపోయింది. ఈ నేపథ్యంలో, సిట్రోయెన్ తమ చిన్న కారును అత్యంత ఆకర్షణీయమైన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ ట్యాగ్ తో మార్కెట్లో విడుగదల చేసింది. భారత మార్కెట్లో సిట్రోయెన్ సి3 ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 5.71 లక్షల నుండి రూ.8.05 లక్షల మధ్యలో ఉన్నాయి. ఇది మంచి యూత్‌ఫుల్ డిజైన్‌ని కలిగి ఉండి, భారతదేశంలో ఇప్పటి వరకూ ఏ కారులో చూడని విశిష్టమైన డిజైన్ లక్షణాలను కలిగి ఉంటుంది.

కుర్రకారుకి కిర్రెక్కించే కారు.. సిట్రోయెన్ సి3.. ఈ కారు గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు

మొదటిసారిగా కారు కొనుగోలు చేసేవారు, కొత్తగా ఉద్యోగం చేస్తున్న ఐటి ఉద్యోగులు, చిన్న సైజులో మంచి యూత్‌ఫుల్ డిజైన్ కలిగిన కారును కోరుకునే వారు మరియు చిన్న ఫ్యామిలీకి సిట్రోయెన్ సి3 ఓ చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఓవరాల్‌గా చెప్పాలంటే, ఇది భారతదేశంలోని యువ కొనుగోలుదారులకు సరైన కారు అనేది మా అభిప్రాయం. సిట్రోయెన్ సి3 ఈ విభాగంలో టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనో కైగర్ వంటి ఇతర చిన్న ఎస్‌యూవీలకు పోటీగా ఉండే మైక్రో-ఎస్‌యూవీ మాదిరిగానే కనిపిస్తుంది. సిట్రోయెన్ తమ సి3 కారుని హ్యాచ్‌బ్యాక్‌గా సంబోధించినప్పటికీ ఇది ఖచ్చితంగా ట్రెండింగ్ ఎస్‌యూవీ రూపాన్ని కలిగి ఉందని చెప్పవచ్చు.

కుర్రకారుకి కిర్రెక్కించే కారు.. సిట్రోయెన్ సి3.. ఈ కారు గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు

సిట్రోయెన్ సి3లో కస్టమర్లను ఆకట్టుకునే మొదటి అంశం దాని విశిష్టమైన డిజైన్. ఈ క్విర్కీ డిజైన్ లాంగ్వేజ్ సిట్రోయెన్ సి3 కారుకి మంచి యవ్వనాన్ని మరియు క్యారెక్టర్ ను జోడిస్తుంది. ఈ క్విర్కీ డిజైన్ లాంగ్వేజ్ కారు లోపలి భాగంలో కూడా కనిపిస్తుంది. దాని విశిష్టమైన డ్యాష్‌బోర్డ్ డిజైన్ ను మనం ఇప్పటి వరకూ ఏ ఇతర ఇండియన్ కారులో కూడా చూసినట్లు అనిపించదు. ఈ కారు చవక ధరను కలిగి ఉన్నప్పటికీ, కారు లోపలి భాగం మాత్రం చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇందులోని ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, వెడల్పాటి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ వంటి ఫీచర్లు ఖరీదైన కార్లని తలపిస్తాయి.

కుర్రకారుకి కిర్రెక్కించే కారు.. సిట్రోయెన్ సి3.. ఈ కారు గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు

సి3 కారు లోపల కస్టమర్లను ఆకట్టుకునే అంశాలు చాలానే ఉన్నాయి. ముందుగా ఇందులోని డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో ప్రారంభించినట్లయితే, ఇది చాలా ప్రాథమికంగా కనిపించే యూనిట్. ఇందులో కారు ప్రయాణించే వేగం, డిస్టెన్స్ టూ ఎంప్టీ, సగటు ఇంధన వినియోగం, తక్కువ ఇంధన హెచ్చరిక, గేర్ షిఫ్ట్ ఇండికేషన్, డోర్ అజర్ వార్నింగ్, ప్రయాణించిన దూరం వంటి మరెన్నో ముఖ్యమైన సమాచారం ప్రదర్శించబడుతుంది. బడ్జెట్‌పై నిఘా ఉంచే యువ ప్రయాణికులకు ఈ ఫీచర్‌లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

కుర్రకారుకి కిర్రెక్కించే కారు.. సిట్రోయెన్ సి3.. ఈ కారు గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు

ఇక ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ విషయానికి వస్తే, ఇది కూడా ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా కనెక్టింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది Apple CarPlay మరియు Android Auto కనెక్టివిటీ ఫీచర్‌లతో కూడిన పెద్ద 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ యూనిట్. అయితే, ఈ యూనిట్‌లో అంతర్నిర్మిత నావిగేషన్ సిస్టమ్ లేదు. అయినా, పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఈరోజుల్లో దాదాపు ప్రతి స్మార్ట్ ఫోన్ లో కూడా మ్యాప్స్/నావిగేషన్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది కాబట్టి, ఇందులో బిల్ట్-ఇన్ నావిగేషన్ లేకపోయినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

కుర్రకారుకి కిర్రెక్కించే కారు.. సిట్రోయెన్ సి3.. ఈ కారు గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు

సిట్రోయెన్ ఈ కారును టెక్నాలజీపై ఆధారపడే యువ డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. సి3 కారులో అందించిన మొబైల్ ఫోన్ హోల్డర్ మరియు ఛార్జర్ వైర్‌ను గట్టిగా పట్టి ఉంచే క్లిప్‌లు మరియు ముందు భాగంలో USB పోర్ట్‌ మొదలైన అంశాలు ఈ విషయాన్ని మరోసారి నొక్కి చెప్పినట్లుగా అనిపిస్తుంది. సాధారణంగా, మొదటిసారిగా కారు కొనేవారు లేదా యువ కొనుగోలుదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు చిన్నపాటి పొరపాట్లు చేయడం సాధారణం. కాబట్టి, సిట్రోయెన్ అలాంటి వారి గురించి ఆలోచించి సి3 కారులో కొన్ని ఫీచర్లను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలుస్తోంది.

కుర్రకారుకి కిర్రెక్కించే కారు.. సిట్రోయెన్ సి3.. ఈ కారు గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు

సాధారణంగా, చాలా చిన్న ప్రమాదాలలో ఎలక్ట్రిక్ సైడ్ వ్యూ మిర్రర్‌లను కోల్పోవడం మరియు వాహనం యొక్క మూలలను తాకడం వలన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు పగిలిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఆ తర్వాత, ఈ భాగాలను భర్తీ చేసుకోవడానికి కస్టమర్లు తమ చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో, సిట్రోయెన్ సి3 కారులో కంపెనీ అలాంటి ఖరీదైన ఫీచర్లను అందించలేదు. దీని సైడ్ మిర్రర్స్ ఎలక్ట్రికల్ కావు, ఇవి సాధారణమైన మ్యాన్యువల్ అడ్జస్టబల్ మిర్రర్లు. అలాగే, లైట్లు కూడా ఎల్ఈడి యూనిట్లు కావు, అవి హ్యాలోజెన్ లైట్లు. కాబట్టి, వీటిని రీప్లేస్ చేసుకోవడానికి వాహన యజమానులు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.

కుర్రకారుకి కిర్రెక్కించే కారు.. సిట్రోయెన్ సి3.. ఈ కారు గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు

గమనించాల్సిన విషయం ఏంటంటే, సిట్రోయెన్ సి3 టాప్-ఎండ్ వేరియంట్‌లో కూడా అల్లాయ్ వీల్స్ లభించవు. కనీసం ఆప్షనల్ ఫీచర్ గా కూడా ఇవి అందుబాటులో లేవు. కంపెనీ ఈ కారు ధరను అందుబాటులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇవి స్టైలిష్ వీల్‌క్యాప్స్ తో లభిస్తాయి. ఫలితంగా, ఇవి చూడటానికి అల్లాయ్ వీల్స్ మాదిరిగా కనిపిస్తాయి. ఒకవేళ కస్టమర్లు కావాలనుకుంటే, ఆఫ్టర్ మార్కెట్లో లభించే అల్లాయ్ వీల్స్ ని కొనుగోలు చేయవచ్చు.

కుర్రకారుకి కిర్రెక్కించే కారు.. సిట్రోయెన్ సి3.. ఈ కారు గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు

సిట్రోయెన్ సి3 సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సింగిల్ టోన్ మరియు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లలో మొత్తం 10 విభిన్న రంగులో లభిస్తుంది. వీటికి అదనంగా, కస్టమర్లు తమ సిట్రోయెన్ సి3 ఎస్‌యూవీని తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకునేందుకు కంపెనీ అనేక యాక్ససరీలు, 3 రకాల యాక్ససరీ ప్యాక్‌లు మరియు 56 కస్టమైజేషన్ ఆప్షన్లను కూడా అందిస్తోంది. వీటి సాయంతో కస్టమర్లు తమ సి3 కారుని తమ అభిరుచికి అనుగుణంగా ప్రత్యేకంగా కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

కుర్రకారుకి కిర్రెక్కించే కారు.. సిట్రోయెన్ సి3.. ఈ కారు గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు

వీటన్నింటికి మించి సిట్రోయెన్ సి3 న్యాచురల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని 1.2-లీటర్, న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్, 3-సిలిండర్ ప్యూర్‌టెక్ 82 పెట్రోల్ 80.8 బిహెచ్‌పి శక్తిని మరియు 115 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. పవర్‌బూస్ట్ కోరుకునే యువ కస్టమర్ల కోసం కంపెనీ ఇందులో టర్బో పెట్రోల్ ఇంజన్ ను కూడా అందిస్తోంది.

కుర్రకారుకి కిర్రెక్కించే కారు.. సిట్రోయెన్ సి3.. ఈ కారు గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు

ఇందులోని 1.2 లీటర్ టర్బో ప్యూర్‌టెక్ 110 పెట్రోల్ ఇంజన్ 108.4 బిహెచ్‌పి శక్తిని మరియు 190 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ప్రస్తుతానికి ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు. ఇది సిట్రోయెన్ సి3 గురించిన పూర్తి సమాచారం. సిట్రోయెన్ ఇప్పుడిప్పుడే భారత మార్కెట్‌కు సుపరిచితం అవుతోంది. ప్రస్తుతం, ఈ కంపెనీ డీలర్‌షిప్‌లు మరియు సర్వీస్ సెంటర్లు చాలా పరిమితంగా ఉన్నాయి. అయితే, భవిష్యత్తులో కంపెనీ మరిన్ని కొత్త ఉత్పత్తులను విడుదల చేయడం ద్వారా తమ సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవాలని సిట్రోయెన్ చూస్తోంది.

Most Read Articles

English summary
Citroen c3 all you need to know125846
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X