మరోసారి కెమెరాకు చిక్కిన ఫోర్స్ గుర్ఖా (Force Gurkha) 5-డోర్ వెర్షన్.. విడుదలకు సిద్ధమైనట్లేనా..?

ఆఫ్-రోడ్ వాహన ప్రియులకు ఫోర్స్ గూర్ఖా (Force Gurkha) ఎస్‌యూవీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెర్సిడెస్ బెంజ్ ఇంజన్ కలిగిన ఈ మేడ్ ఇన్ ఇండియా ఆఫ్-రోడ్ ఎస్‌యూవీని ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. ఇది ఈ విభాగంలో మహీంద్రా థార్ (Mahindra Thar) కు గట్టి పోటీగా నిలుస్తుంది. ఫోర్స్ మోటార్స్ (Force Motors) గతేడాది తమ సరికొత్త తరం ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసింది. ఆ సమయంలో ఇది 3-డోర్, 4-సీటర్ గా మాత్రమే అందుబాటులోకి వచ్చింది. కాగా, కంపెనీ ఇప్పుడు ఇందులో 5-డోర్ వెర్షన్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

మరోసారి కెమెరాకు చిక్కిన ఫోర్స్ గుర్ఖా (Force Gurkha) 5-డోర్ వెర్షన్.. విడుదలకు సిద్ధమైనట్లేనా..?

ఫోర్స్ గుర్ఖా 5-డోర్ వెర్షన్ ఎస్‌యూవీని కంపెనీ భారత రోడ్లపై పరీక్షిస్తుండగా మరోసారి కెమెరాకు చిక్కింది. కంపెనీ ఈ కొత్త మోడల్ ను ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా టెస్టింగ్ చేయడాన్ని చూస్తుంటే, త్వరలోనే ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. తాజాగా లీకైన స్పై చిత్రాలను గమనిస్తే, కొత్త 2022 మోడల్ ఫోర్స్ గుర్ఖా 5-డోర్ వెర్షన్ దాని 3-డోర్ వెర్షన్ కన్నా పొడవైన వీల్‌బేస్ ను మరియు అధిక గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

మరోసారి కెమెరాకు చిక్కిన ఫోర్స్ గుర్ఖా (Force Gurkha) 5-డోర్ వెర్షన్.. విడుదలకు సిద్ధమైనట్లేనా..?

ఫోర్స్ గుర్ఖా 3-డోర్ వెర్షన్ కేవలం 4 సీట్లతో మాత్రమే విడుదలైంది. కాగా, ఈ కొత్త 5-డోర్ వెర్షన్ గుర్ఖా 7-సీటర్ వెర్షన్ తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో పెరిగిన వీల్‌బేస్ కారణంగా కంపెనీ వెనుక భాగంలో రెండు సైడ్-ఫేసింగ్ సీట్లను అందించనున్నట్లు తెలుస్తోంది. మధ్య వరుసలో మూడు సీట్లతో కూడిన బెంచ్ సీట్ ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా, పొడవైన వీల్‌బేస్ కారణంగా, 2వ-వరుస సీట్లు మరింత ఎక్కువ లెగ్‌రూమ్‌ను కూడా కలిగి ఉంటాయని భావిస్తున్నారు.

మరోసారి కెమెరాకు చిక్కిన ఫోర్స్ గుర్ఖా (Force Gurkha) 5-డోర్ వెర్షన్.. విడుదలకు సిద్ధమైనట్లేనా..?

ఫోర్స్ గుర్ఖా 3-డోర్ వెర్షన్ లో వెనుక వైపు రెండు వ్యక్తిగత కెప్టెన్ సీట్లు ఉండేవి, ఇవి ప్రయాణీకులకు సౌకర్యవంతమైన సీటింగ్ స్థానాన్ని అందిస్తాయి. కాగా, ఈ 5-డోర్ వెర్షన్ ఫోర్స్ గూర్ఖా లో మాత్రం 3-డోర్ వెర్షన్‌లో కెప్టెన్ సీట్లకు బదులుగా రెండవ వరుసలో 3-సీటర్ బెంచ్ సీటును ఆఫర్ చేయనున్నారు. గుర్ఖా ఎస్‌యూవీలో ఎక్కువ సీటింగ్ సామర్థ్యం కోరుకునే ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ కొత్త మోడల్ ను అభివృద్ధి చేసింది. అయితే, కస్టమర్ల ఎంపిక కోసం కంపెనీ ఈ 5-డోర్ వెర్షన్ లో కూడా మధ్యలో కెప్టెన్ సీట్లను అందించవచ్చని భావిస్తున్నారు.

మరోసారి కెమెరాకు చిక్కిన ఫోర్స్ గుర్ఖా (Force Gurkha) 5-డోర్ వెర్షన్.. విడుదలకు సిద్ధమైనట్లేనా..?

ఒకవేళ, గుర్ఖా 5-డోర్ వెర్షన్ లో మధ్య వరుసలో కెప్టెన్ సీట్లను అందించినట్లయితే, వెనుక మూడవ వరుసలో బెంచ్ సీటును అందించే అవకాశం ఉంటుంది మరియు ఇది 6-సీటర్ వేరియంట్ గా అందుబాటులో ఉండవచ్చు. మధ్య వరుసలో ఉన్న కెప్టెన్ సీట్లను ఉపయోగించడం వలన 3వ వరుస సీట్లకు సులువుగా యాక్సెస్ లభిస్తుంది. గమనించినట్లయితే, ఫోర్స్ గూర్ఖా యొక్క 5-డోర్ వెర్షన్ వెడల్పాటి 255/65 టైర్లతో 18 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ను కూడా కలిగి ఉంది. పోల్చి చూస్తే, ఫోర్స్ గూర్ఖా యొక్క 3-డోర్ వెర్షన్ 245/70 టైర్లతో 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉంటుంది.

మరోసారి కెమెరాకు చిక్కిన ఫోర్స్ గుర్ఖా (Force Gurkha) 5-డోర్ వెర్షన్.. విడుదలకు సిద్ధమైనట్లేనా..?

పెద్ద టైర్లు మరియు పెద్ద అల్లాయ్ వీల్స్ కారణంగా, ఫోర్స్ గూర్ఖా యొక్క 5-డోర్ వెర్షన్ దాని 3-డోర్ వెర్షన్ కంటే చాలా ఎక్కువ రోడ్ ప్రెజెన్స్‌ ని కలిగి ఉంటుంది. కొత్త ఫోర్స్ గుర్ఖాలో బయటి వైపు మార్పులు మినహా, ఇంజన్ మరియు ఇంటీరియర్ ఫీచర్ల చాలా వరకూ అలానే ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ, కంపెనీ ఇందులో ప్రయాణీకుల సౌకర్యం కోసం లోపలి భాగంలో చిన్నపాటి మార్పులు చేయవచ్చని అంచనా. అంతేకాకుండా, పెరిగిన వీల్‌బేస్ మరియు సీటింగ్ సామర్థంతో పాటు పెరిగిన బరువుకు తగినట్లుగా కంపెనీ దీని ఇంజన్‌ను రీట్యూన్ చేయడం లేదా కొత్త ఇంజన్ ను ఉపయోగించడం చేయవచ్చని భావిస్తున్నారు.

మరోసారి కెమెరాకు చిక్కిన ఫోర్స్ గుర్ఖా (Force Gurkha) 5-డోర్ వెర్షన్.. విడుదలకు సిద్ధమైనట్లేనా..?

ఫోర్స్ గుర్ఖా 3-డోర్ వెర్షన్ లో ఉపయోగించిన ఇంజన్ మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ నుండి గ్రహించబడినది. ఈ 2.6 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజన్‌ గరిష్టంగా 90 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. అయితే, కొత్త గుర్ఖా 5-డోర్ వెర్షన్ లో ఈ ఇంజన్ సుమారు 120 బిహెచ్‌పిల వరకూ శక్తిని ఉత్పత్తి చేయగలిగితే, అది పెరిగిన బరువుకు ఇంజన్ పవర్‌ను బ్యాలెన్స్ చేయడంలో సహకరిస్తుంది.

మరోసారి కెమెరాకు చిక్కిన ఫోర్స్ గుర్ఖా (Force Gurkha) 5-డోర్ వెర్షన్.. విడుదలకు సిద్ధమైనట్లేనా..?

ప్రస్తుత ఫోర్స్ గూర్ఖాలో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ తో లభిస్తుంది. కాబట్టి, కొత్తగా రాబోయే 5-డోర్ వెర్షన్ గుర్ఖాలో కూడా ఈ ఫీచర్ ఇలానే కొనసాగుతుందని భావిస్తున్నారు. ఇతర ఫీచర్ల విషయానికొస్తే, రాబోయే ఫోర్స్ గూర్ఖా ఎస్‌యూవీ యొక్క 5-డోర్ వెర్షన్ లో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అనలాగ్ స్పీడోమీటర్‌తో మరియు టాకోమీటర్ తో కూడిన సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, టిల్ట్ మరియు టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, ఇండివిడ్యువల్ ఆర్మ్‌రెస్ట్, స్పీడ్-సెన్సింగ్ డోర్ లాక్‌లు, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, ఫాలో-మీ-హోమ్ ల్యాంప్స్, ఎల్ఈడి హెడ్‌లైట్లు మరియు ఎల్ఈడి టెయిల్‌లైట్‌లు మొదలైన ఫీచర్లను ఆశించవచ్చు.

మరోసారి కెమెరాకు చిక్కిన ఫోర్స్ గుర్ఖా (Force Gurkha) 5-డోర్ వెర్షన్.. విడుదలకు సిద్ధమైనట్లేనా..?

ఇక సేఫ్టీ విషయానికి వస్తే, కొత్త ఫోర్స్ గూర్ఖా 5-డోర్ వెర్షన్ లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, వన్-టచ్ లేన్ చేంజ్ ఇండికేటర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్స్ మరియు హై స్పీడ్ అలర్ట్ మొదలైనవి ఉండే అవకాశం ఉంది. ఇక చివరిగా ధర విషయానికి వస్తే, ఫోర్స్ గుర్ఖా 5-డోర్ వెర్షన్ ప్రస్తుత 3-డోర్ వెర్షన్ ధర కన్నా సుమారు 1 లక్ష రూపాయాలు అదనంగా ఉండొచ్చని అంచనా. ఇది ఈ విభాగంలో మహీంద్రా నుండి రాబోయే కొత్త 5-డోర్ వెర్షన్ మోడల్ కి పోటీగా నిలుస్తుంది.

Source: Rushline/Youtube

Most Read Articles

English summary
Force gurkha 5 door suv spied for first time launch will be soon in india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X