ఎకోస్పోర్ట్, ఫిగో, ఆస్పైర్, ఫ్రీస్టైల్ కార్లు రీకాల్.. భారత్ నుండి వెళ్లిపోయినప్పటికీ కస్టమర్లకు సేవలు..

అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ (Ford) భారతదేశంలో తన కార్యకలాపాలను ముగించినప్పటికీ, తమ వినియోగదారులకు అవసరమైన సేవలను అందించడాన్ని కొనసాగిస్తూనే ఉంటామని హామీ ఇచ్చిన సంగతి తెలిసినదే. ఫోర్డ్ హామి ఇచ్చినట్లుగానే తమ వినియోగదారులకు అవసరమైన సేవలు, విడిభాగాలు మరియు వారంటీ మద్దతును అందించడాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే, ఫోర్డ్ ఇండియా ఇప్పుడు ఎకోస్పోర్ట్, ఫిగో, ఆస్పైర్ మరియు ఫ్రీస్టైల్ యొక్క ఎంపిక చేసిన బిఎస్6 డీజిల్ మోడళ్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.

అలెర్ట్.. అలెర్ట్.. ఎకోస్పోర్ట్, ఫిగో, ఆస్పైర్, ఫ్రీస్టైల్ కార్లు రీకాల్.. భారత్ నుండి వెళ్లిపోయినప్పటికీ కస్టమర్లకు సేవలు..!

ఫోర్డ్ భారతదేశంలో విక్రయించిన ఈ బిఎస్6 డీజిల్ కార్లలో ఉద్గార నిబంధనలను పాటించడం మరియు డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ (DPF) సామర్థ్యం కారణంగా ఈ రీకాల్ జారీ చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ రెండు సమస్యలకు అదనంగా, ఫోర్డ్ 'ఆయిల్ లైఫ్ రిలేటెడ్ ఇష్యూస్' (ఇంజన్ ఆయిల్ జీవితకాలానికి సంబంధించిన సమస్య) ని కూడా ఈ రీకాల్ లో లిస్ట్ చేసింది. ఈ రీకాల్ కు వర్తించి వాహన యజమానులను గుర్తించి, ఫోర్డ్ వారికి ఈ రీకాల్ గురించి వివరించనుంది.

అలెర్ట్.. అలెర్ట్.. ఎకోస్పోర్ట్, ఫిగో, ఆస్పైర్, ఫ్రీస్టైల్ కార్లు రీకాల్.. భారత్ నుండి వెళ్లిపోయినప్పటికీ కస్టమర్లకు సేవలు..!

ఫోర్డ్ ఇండియా లేటెస్ట్ రీకాల్‌ కు వర్తించే వాహనాలలో ఎగ్జాస్ట్ సిస్టమ్ లో కొత్త క్యాటలైటిక్ కన్వర్టర్ తో పాటుగా కొత్త ఎగ్జాస్ట్ గ్యాస్ O2 సెన్సార్‌ ను కూడా అప్‌డేట్ చేయబడుతుంది. సెప్టెంబర్ 2021లో జారీ చేయబడిన బిఎస్6 డీజిల్ వాహనాల కోసం చివరి రీకాల్‌లో కొత్త యూనిట్‌తో అప్‌డేట్ చేయబడిన వాహనాలపై క్యాటలైటిక్ కన్వర్టర్ రీకాలిబ్రేట్ చేయబడుతుంది. అంతేకాకుండా, అన్ని ప్రభావిత మోడల్‌లు కూడా ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ (ECU) కోసం తాజా ఫర్మ్‌వేర్‌తో అప్‌డేట్ చేయబడతాయని కంపెనీ తెలిపింది.

అలెర్ట్.. అలెర్ట్.. ఎకోస్పోర్ట్, ఫిగో, ఆస్పైర్, ఫ్రీస్టైల్ కార్లు రీకాల్.. భారత్ నుండి వెళ్లిపోయినప్పటికీ కస్టమర్లకు సేవలు..!

రీకాల్ కు ప్రభావితమైన అన్ని వాహనాలపై ఈ అప్‌గ్రేడ్ ఉచితంగా చేయబడుతుంది మరియు ప్రభావిత వాహనాల యజమానులు నేరుగా ఫోర్డ్‌కు మెయిల్ లేదా కాల్ ద్వారా సంప్రదిస్తుంది. ఒకవేళ, మీరు కూడా ఫోర్డ్ బిఎస్6 డీజిల్ వాహనాన్ని ఉపయోగిస్తూ ఉండి, మీ ఫోర్డ్ వాహనం ఈ రీకాల్ కు ప్రభావితమైందో లేదో తెలుసుకోవాలనుకుంటే, కంపెనీ వెబ్‌సైట్‌లో మీవాహనం యొక్క 17 అంకెల VIN నంబర్‌ను ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. మీ వాహనం రీకాల్‌కు ప్రభావితమైందని తెలిస్తే, మీ సమీపంలోని సర్వీస్ సెంటరను సంప్రదించి ఈ సమస్యను ఉచితంగా సరిచేయించుకోవచ్చు.

అలెర్ట్.. అలెర్ట్.. ఎకోస్పోర్ట్, ఫిగో, ఆస్పైర్, ఫ్రీస్టైల్ కార్లు రీకాల్.. భారత్ నుండి వెళ్లిపోయినప్పటికీ కస్టమర్లకు సేవలు..!

ఫోర్డ్ ఇండియా రీకాల్ చేసిన ఎకోస్పోర్ట్, ఫిగో, ఆస్పైర్ మరియు ఫ్రీస్టైల్ వాహనాలు అన్నీ కూడా ఒకే రకమైన 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ తో పనిచేస్తాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పి శక్తిని మరియు 215 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఫోర్డ్ తన సర్వీస్ నెట్‌వర్క్‌లో దాదాపు 90 శాతం నిలుపుకుంటుందని గత సంవత్సరం ధృవీకరించింది. సర్వీస్ సెంటర్‌కు చేరుకోవడంలో కస్టమర్‌లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కంపెనీ తన వినియోగదారులకు హామీ ఇచ్చింది.

అలెర్ట్.. అలెర్ట్.. ఎకోస్పోర్ట్, ఫిగో, ఆస్పైర్, ఫ్రీస్టైల్ కార్లు రీకాల్.. భారత్ నుండి వెళ్లిపోయినప్పటికీ కస్టమర్లకు సేవలు..!

గత కొన్ని సంవత్సరాలు భారతదేశంలో వస్తున్న నష్టాల కారణంగా, ఇక్కడి మార్కెట్లో తమ వ్యాపారాన్ని నిలిపివేస్తున్న ఫోర్డ్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసినదే. భారత మార్కెట్ కోసం ఫోర్డ్ తమ కార్ల తయారీని చాలా రోజుల క్రితమే నిలిపివేసి గుజరాత్ ప్లాంట్ ను మూసివేయగా, ఇటీవలే ఎగుమతి కోసం పెండింగ్‌లో ఉన్న వాహనాలను కూడా పూర్తిగా తయారు చేసి చెన్నై ప్లాంట్ ను కూడా మూసివేసింది. చెన్నై లోని మరైమలై నగర్ ప్లాంట్ లో తయారు చేసిన చివరి ఎకోస్పోర్ట్‌ను కంపెనీ ఇటీవల ఫ్యాక్టరీ నుండి బయటకు పంపింది.

అలెర్ట్.. అలెర్ట్.. ఎకోస్పోర్ట్, ఫిగో, ఆస్పైర్, ఫ్రీస్టైల్ కార్లు రీకాల్.. భారత్ నుండి వెళ్లిపోయినప్పటికీ కస్టమర్లకు సేవలు..!

ఫోర్డ్ ఇండియా, భారతదేశంలో సుమారు 1999 నుండి కార్లను తయారు చేస్తోంది. భారత మార్కెట్లో ఫోర్డ్ ఫోర్డ్ ఎకోస్పోర్, ఎండీవర్ మరియు ఫిగో కార్లు బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే, ఇటీవలి సంవత్సరాలలో ఫోర్డ్ భారతదేశంలో సరైన అమ్మకాలను చూడలేకపోయింది. ఫోర్డ్ ఇండియా ఇక్కడి మార్కెట్లో సుమారు 2 బిలియన్ డాలర్ల మేర నష్టాన్ని చవిచూసింది. దీంతో మరో మార్గం లేక ఈ అమెరికన్ బ్రాండ్ భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. అయితే, ఫోర్డ్ భారతదేశాన్ని వదిలి వెళ్లినప్పటికీ, తమ వినియోగదారులకు అవసరమైన వాహన సేవలు మరియు విడిభాగాలను అందిస్తూనే ఉంటామని కంపెనీ హామీ ఇచ్చింది.

అలెర్ట్.. అలెర్ట్.. ఎకోస్పోర్ట్, ఫిగో, ఆస్పైర్, ఫ్రీస్టైల్ కార్లు రీకాల్.. భారత్ నుండి వెళ్లిపోయినప్పటికీ కస్టమర్లకు సేవలు..!

ఎలక్ట్రిక్ కార్లు, ఇంపోర్టెడ్ కార్లపై కూడా నోరు విప్పని ఫోర్డ్..

ఇదిలా ఉంటే, ఫోర్డ్ ఇప్పటికే భారతదేశంలో తమ వాహనాల ఉత్పత్తిని నిలిపివేసినప్పటికీ, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని ప్లాన్ చేసింది. అంతేకాకుండా, విదేశాలలో విక్రయించబడే కొన్ని లగ్జరీ కార్లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్లు)గా భారతదేశానికి దిగుమతి చేసుకొని విక్రయించాలని కూడా కంపెనీ ప్లాన్ చేసింది. అయితే, ఇప్పుడు ఈ విషయాలను అధికారికంగా ధృవీరించేందుకు ఫోర్డ్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కంపెనీ ఇప్పుడు ఈ రెండు ప్లాన్స్ ను కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అలెర్ట్.. అలెర్ట్.. ఎకోస్పోర్ట్, ఫిగో, ఆస్పైర్, ఫ్రీస్టైల్ కార్లు రీకాల్.. భారత్ నుండి వెళ్లిపోయినప్పటికీ కస్టమర్లకు సేవలు..!

ఫోర్డ్ ఇండియా గతంలో తమ వ్యాపార పునర్నిర్మాణంలో భాగంగా భారత ప్రభుత్వం యొక్క ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ PLI ప్రణాళిక ప్రకారం, ఫోర్డ్ ఎగుమతి మరియు దేశీయ మార్కెట్ల కోసం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి దాని రెండు తయారీ సౌకర్యాలలో ఒకదాన్ని ఉపయోగిస్తుందని గతంలో తెలిపింది. అయితే, ఇప్పుడు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రారంభించడం లేదని కంపెనీ ప్రకటించింది. ఓ వైపు ఫిస్కర్ వంటి అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీలు భారతదేశంలోకి ప్రవేశించేందుకు క్యూ కడుతుంటే, జిఎమ్ మరియు ఫోర్డ్ వంటి కంపెనీలు ఇక్కడి నుండి తట్టాబుట్టా సర్దేస్తున్నాయి.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford india recall diesel models of ecosport figo aspire freestyle reason details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X