కస్టమర్ల కోసం కొండంత ఆఫర్స్ తీసుకువచ్చిన 'హోండా'.. మోడల్ వారీగా వివరాలు

2022 ముగియడానికి ఇంక ఎన్నో రోజులు లేదు. అయితే ఈ సందర్భంలో చాలా కంపెనీలు తమ వాహనాల మీద ఇయర్ ఎండ్ ఆఫర్స్ అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే హోండా కంపెనీ హోండా సిటీ, అమేజ్, జాజ్, డబ్ల్యుఆర్-వి వంటి వాటిపై డిస్కౌంట్స్ అందిస్తోంది.

హోండా డబ్ల్యుఆర్-వి:

హోండా కంపెనీ యొక్క డబ్ల్యుఆర్-వి కొనుగోలుపైన ఈ నెలలో (2022 డిసెంబర్) రూ. 72,340 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో కూడా పెట్రోల్ మోడల్స్ మీద ఎక్కువ డిస్కౌంట్స్ అందిస్తోంది. కంపెనీ ఈ మోడల్స్ మీద రూ. 30,000 లేదా రూ. 35,340 విలువైన ఫ్రీ యాక్ససరీస్ క్యాష్ డిస్కౌంట్ అందిస్తుంది. దీనితోపాటు కొనుగోలుదారులు ఎక్స్చేంజ్ మరియు లాయల్టీ బోనస్ వంటివి కూడా పొందవచ్చు.

కస్టమర్ల కోసం కొండంత ఆఫర్స్ తీసుకువచ్చిన హోండా

హోండా డబ్ల్యుఆర్-వి 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజల్ ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఈ రెండు ఇంజిన్ ఆప్సన్స్ మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్సన్స్ తో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ కార్లు 2023 మార్చి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాగా 2023 ఫిబ్రవరి నుంచి హోండా కంపెనీ భారతదేశంలో డీజిల్ కార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది.

హోండా సిటీ (5 వ జనరేషన్):

హోండా కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్స్ లో ఒకటి హోండా సిటీ. అయితే కంపెనీ ప్రస్తుతం 5వ జనరేషన్ హోండా సిటీ మీద రూ.72,145 వరకు బెనిఫిట్స్ అందిస్తుంది. ఇందులో మాన్యువల్ వెర్షన్లపై రూ.30,000 వరకు క్యాష్ డిస్కౌంట్ లేదా రూ.32,145 విలువైన ఫ్రీ యాక్ససరీస్, రూ.20,000 కార్ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.7,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.8,000 మరియు లాయల్టీ బోనస్ కింద రూ.5,000 తగ్గింపు లభిస్తుంది.

హోండా అమేజ్:

హోండా అమేజ్ మీద కంపెనీ ఇప్పుడు రూ.43,144 వరకు బెనిఫిట్స్ అందిస్తుంది. కంపెనీ యొక్క ఈ కాంపాక్ట్ సెడాన్ గత 9 సంవత్సరాలలో 5 లక్షల యూనిట్లను విక్రయించి విక్రయాల్లో మంచి వృద్ధిని సాధించింది. ఈ కాంపాక్ట్ సెడాన్ పెట్రోల్ వెర్షన్ మీద రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.12,144 ఫ్రీ యాక్సెసరీస్, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ. 20,000, లాయల్టీ బోనస్ కింద రూ.5,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.6,000 లభిస్తాయి.

హోండా అమేజ్ 2021 లో అప్డేట్ పొందింది. కాగా ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజిన్ ఆప్సన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ఇంజిన్ ఆప్సన్స్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్సన్ మాత్రమే పొందుతాయి. కంపెనీ ఈ మోడల్ కొనుగోలుపైన కేవలం ఈ నెలలో (2022 డిసెంబర్) మాత్రమే తగ్గింపులను అందిస్తుంది. అయితే 2023 నుంచి ఈ డిస్కౌంట్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉండదు.

హోండా జాజ్:

హోండా జాజ్ (Honda Jazz) కొనుగోలుపైనా కస్టమర్లను ఈ నెలలో రూ. 37,047 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్ లేదా రూ. 12,047 విలువైన ఫ్రీ యాక్ససరీస్, కారు ఎక్స్చేంజ్ మీద రూ. 10,000, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ. 7,000, లాయల్టీ బోనస్ కింద రూ. 5,000 మరియు కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 3,000 వరకు తగ్గింపు లభిస్తుంది.

హోండా సిటీ (4 వ జనరేషన్):

4 వ తరం హోండా సిటీ కొనుకొలువైన కస్టమర్లు రూ. 5,000 వరకు మాత్రమే బెనిఫిట్స్ పొందవచ్చు. కంపెనీ అందిస్తున్న డిస్కౌంట్స్ లో ఇదే తక్కువ. కంపెనీ ఈ రూ. 5,000 ని కూడా లాయల్టీ బోనస్ కింద అందిస్తుంది. 2014 నుంచి అమ్మకానికి ఉన్న ఈ సెడాన్ ఈ సంవత్సరం నిలిపివేయబడే అవకాశం ఉంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్ మాత్రమే పొందుతుంది.

కంపెనీ అందిస్తున్న ఆఫర్స్ దేశంలో వివిధ నగరాలను బట్టి వివిధ రకాలుగా ఉంటాయి. కావున ఏ నగరంలో ఎంత వరకు డిస్కౌంట్ లభిస్తుంది అనే ఖచ్చితమైన వివరాలు కోసం సమీపంలో ఉండే డీలర్‌షిప్‌ని సందర్శించి తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడంతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు కొత్త బైకుల గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Honda year end offers on selected models details
Story first published: Tuesday, December 6, 2022, 16:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X