BYD సీనియర్ వైస్ ప్రెసిడెంట్ 'సంజయ్ గోపాలకృష్ణన్' ప్రత్యేక ఇంటర్వ్యూ

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని చైనా వాహన తయారీ సంస్థ BYD (బిల్డ్ యువర్ డ్రీమ్స్) దేశీయ విఫణిలో తన ఉనికిని చాటుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ Atto 3 ఎలక్ట్రిక్ SUV లాంచ్ చేసింది.

BYDగా ప్రసిద్ధి చెందిన బిల్డ్ యువర్ డ్రీమ్స్ చాలా కాలం నుంచే భారతీయ మార్కెట్లో ఉంది. ఇది 2007 లో భారతీయ విఫణిలో అరంగేట్రం చేసింది. చెన్నైకి సమీపంలో ఉన్న దాని సౌకర్యం వద్ద నోకియా వంటి వాటితో సహా మొబైల్ ఫోన్‌ల కోసం విడిభాగాల తయారీదారుగా తన ప్రయాణం ప్రారంభమైంది. ఆ తరువాత 2013 లో K9 ఎలక్ట్రిక్ బస్సును భారతదేశంలోకి దిగుమతి చేసుకుని దాదాపు నాలుగు సంవత్సరాలు సుదీర్ఘంగా పరీక్షించింది.

BYD సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రత్యేక ఇంటర్వ్యూ

సుదీర్థ పరీక్షలకు గురైన ఈ K9 ఎలక్ట్రిక్ బస్సు అధికారికంగా భారతీయ ఎలక్ట్రిక్ బస్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఆ తరువాత గత సంవత్సరం చివర్లో, BYD e6 తో కార్ మార్కెట్‌లోకి కూడా అడుగు పెట్టింది. క్రమంగా ఈ ఎలక్ట్రిక్ కారు ప్రైవేట్ కొనుగోలుదారుల కోసం కూడా అందుబాటులో తీసుకువచ్చింది. ఈ విధంగా BYD నిరంతరం ముందుకు సాగుతూనే ఉంది. రానున్న రోజుల్లో కంపెనీ మరిన్ని ఉత్పత్తులను తీసుకురావడానికి సిద్దమవుతోంది.

ఇటీవల మేము BYD యొక్క Atto 3 రివ్యూ డ్రైవ్‌లో భాగంగా, BYD ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, PV బిజినెస్ 'సంజయ్ గోపాలకృష్ణన్' తో బ్రాండ్ యొక్క విస్తరణ ప్రణాళికలను గురించి దీనిపైన ఆతని ఆలోచనలను గురించి చర్చించాము. 2022 జనవరి నెలలో BYD ఇండియా కార్యకలాపాలలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్స్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరిన గోపాలకృష్ణన్ భారతదేశంలో కంపెనీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలను విస్తరించారు.

BYD ఇండియా 2023 లో భారతదేశంలో 15,000 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాలని ఆలోచిస్తోంది. ఇందులో ఎక్కువ భాగం భాగం కొత్త అటో 3 ఉండే అవకాశం ఉందని గోపాలకృష్ణన్ తెలిపారు. BYD కంపెనీ తన Atto 3 ఎలక్ట్రిక్ SUV యొక్క డెలివరీలను వచ్చే నెలలో ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ SUV కోసం 1,500 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇప్పటికే దేశీయ మార్కెట్లో విక్రయించినబడిన BYD e6 తో కస్టమర్లు మంచి అనుభూతిని పొందుతున్నారు. కావున ఇటీవల విడుదలైన Atto 3 కూడా మంచి ఆదరణ పొందుతుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కంపెనీ తక్కువ కాలంలోనే మంచి సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించగలిగింది. కంపెనీ ఇప్పటికే దేశీయ విఫణిలో 600 కంటే ఎక్కువ e6 కార్లను విజయవంతంగా విక్రయించగలిగారు. అంతే కాకుండా కస్టమర్ల సౌకర్యార్థం కంపెనీ అన్ని విధాలా ముందడుగు వేస్తోంది.

ఇందులో భాగంగానే కంపెనీ వివిధ టచ్‌పాయింట్‌లు, సర్వీస్ సెంటర్‌లు మరియు డీలర్‌షిప్‌లలో తన స్వంత ఫాస్ట్ ఛార్జర్ నెట్‌వర్క్‌ను నిర్మిస్తోందని. అంతే కాకుండా ఇతర ప్రదేశాలలో కూడా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతోంది. కావున రానున్న రోజుల్లో కంపెనీ ఛార్జింగ్ పాయింట్లు కూడా ఎక్కువ సంఖ్యలో అందుబాటులో రానున్నట్లు దీని ద్వారా తెలుస్తోంది. కంపెనీ కూడా దీనికోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

గోపాలకృష్ణన్ భారతీయ మార్కెట్ కోసం BYD యొక్క విస్తరణ ప్రణాళికలను కూడా చర్చించారు. 2024 నాటికి కంపెనీ దేశీయ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తప్పకుండా మరిన్ని కొత్త ఉత్పత్తులను తీసుకువస్తుందని వెల్లడించారు. అదే సమయంలో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఉత్పత్తి సౌకర్యాల ఏర్పాటును కూడా అన్వేషిస్తుందని ఆయన వెల్లడించారు. మొత్తం మీద BYD తప్పకుండా వాహన వినియోగదారుల కోసం ఉత్తమ ఉత్పత్తులను తీసురావడానికి కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Most Read Articles

Read more on: #బివైడి #byd
English summary
Interview sanjay gopalakrishnan byd india svp details
Story first published: Saturday, December 17, 2022, 8:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X