'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్‌' డెలివరీల జాతర: ఒకే రోజు 150 యూనిట్లు & అరుదైన రికార్డ్ కైవసం

జర్మన్ వాహన తయారీ సంస్థ 'ఫోక్స్‌వ్యాగన్' (Volkswagen) కంపెనీ భారతీయ మార్కెట్లో ఈ మధ్య కాలంలో కొత్త 'వర్టస్' (Virtus) అనే మిడ్-సైజ్ సెడాన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కంపెనీ ఈ సెడాన్ కోసం విడుదలకు ముందే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కావున మంచి సంఖ్యలో అతి తక్కువకాలంలోనే బుకింగ్స్ పొందగలిగింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు డెలివరీలను ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్‌' డెలివరీల జాతర: ఒకే రోజు 150 యూనిట్లు & అరుదైన రికార్డ్ కైవసం

'ఫోక్స్‌వ్యాగన్' కంపెనీ ఒకటి.. రెండూ కాదు ఏకంగా 150 యూనిట్ల ఫోక్స్‌వ్యాగన్ వర్టస్‌ల డెలివరీలను ఒకే రోజులో డెలివరీ చేసి ఒక కొత్త రికార్డ్ సృష్టించగలిగింది. ఇది నిజంగానే కంపెనీ యొక్క మెగా డెలివరీ ప్రోగ్రామ్ అనే చెప్పాలి. ఈ డెలివెరీ జాతర కేరళలోని కొచ్చిన్‌లో జరిగింది. డెలివరీలు చేసిన ఈ డీలర్‌షిప్ పేరు 'EVM వోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్'. ఇక్కడ నిర్వహించిన మెగా డెలివరీ ఈవెంట్‌లో అందరికి ఈ సెడాన్ ను డెలివరీ చేయడం జరిగింది.

'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్‌' డెలివరీల జాతర: ఒకే రోజు 150 యూనిట్లు & అరుదైన రికార్డ్ కైవసం

ఈ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇందులో చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే ఈ మెగా డెలివరీ ఈవెంట్ కి 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్' అధికారులు కూడా హాజరయ్యారు. వారే స్వయంగా డెలివరీ చేయబడిన కార్ల సంఖ్యను కూడా ధ్రువీకరించారు. ఒకేసారి 150 యూనిట్లు డెలివరీ చేయడం వల్ల డీలర్‌షిప్‌కు రికార్డు సర్టిఫికేట్ కూడా అందించారు.

'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్‌' డెలివరీల జాతర: ఒకే రోజు 150 యూనిట్లు & అరుదైన రికార్డ్ కైవసం

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్‌ గురించి..

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్‌ విషయానికి వస్తే, ఈ సెడాన్ మార్కెట్లో ఈ నెల ప్రారంభంలో విడుదలైంది. దేశీయ మార్కెట్లో ఈ కొత్త ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ప్రారంభ ధర రూ. 11,21,900 (ఎక్స్-షోరూమ్), కాగా టాప్ మోడల్ ధర రూ. 17,91,900 (ఎక్స్-షో రూమ్). ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఒకటి డైనమిక్ లైన్ కాగా, మరొకటి పర్ఫార్మెన్స్ లైన్. ఇవి 1.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ మరియు 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.

'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్‌' డెలివరీల జాతర: ఒకే రోజు 150 యూనిట్లు & అరుదైన రికార్డ్ కైవసం

వర్టస్‌ యొక్క డైనమిక్ లైన్‌ వేరియంట్స్ బేజ్ మరియు బ్లాక్ కలర్ ఇంటీరియర్స్ ఉన్నాయి. అయితే పర్ఫార్మెన్స్ లైన్ వేరియంట్స్ లోని సీట్లు రెడ్ కలర్ స్టిచ్చింగ్, అల్యూమినియం పెడల్స్ మరియు డ్యాష్‌బోర్డ్‌పై రెడ్ కలర్ వంటివి పొందుతుంది. ఇవి రెండూ కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్‌' డెలివరీల జాతర: ఒకే రోజు 150 యూనిట్లు & అరుదైన రికార్డ్ కైవసం

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ యొక్క ముందు భాగంలో డ్యూయల్-స్లాట్ గ్రిల్‌, ఎల్ఈడి డిఆర్ఎల్ లతో కూడిన రెండు ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, పెద్ద ఎయిర్ డ్యామ్, సైడ్ ప్రొఫైల్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, వెనుక వైపు షార్క్ ఫిన్ యాంటెన్నా, క్రోమ్ ఇన్సర్ట్‌లతో కూడిన డోర్ హ్యాండిల్స్, బ్లాక్ సైడ్ మిర్రర్స్ మరియు ఎల్ఈడి టెయిల్ లైట్ వంటి వాటితో పాటు వెనుక వైపు వర్టస్ అనే బ్యాడ్జ్ కూడా పొందుతుంది.

'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్‌' డెలివరీల జాతర: ఒకే రోజు 150 యూనిట్లు & అరుదైన రికార్డ్ కైవసం

ఈ కొత్త సెడాన్ 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 8 ఇంచెస్ ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఏసి, రియర్ ఏసి వెంట్స్ అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కీలెస్ ఎంట్రీ, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు మరియు 8-స్పీకర్లతో కూడిన సౌండ్ సిస్టమ్‌ కూడా ఉన్నాయి. ఇక బూట్ స్పేస్ 521 లీటర్ల వరకు ఉంటుంది. దీనితో పాటు 60:40 స్ప్లిట్ రియర్-సీట్ ఆప్సన్ కూడా పొందుతుంది.

'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్‌' డెలివరీల జాతర: ఒకే రోజు 150 యూనిట్లు & అరుదైన రికార్డ్ కైవసం

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.0-లీటర్ టిఎస్ఐ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ 115 హెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జత చేయబడి ఉంటుంది.

'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్‌' డెలివరీల జాతర: ఒకే రోజు 150 యూనిట్లు & అరుదైన రికార్డ్ కైవసం

ఇక 1.5-లీటర్ టిఎస్ఐ ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ విషయానికి వస్తే, ఇది 150 హెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇంజన్ ఇంధనాన్ని ఆదా చేయడానికి సిలిండర్ డియాక్టివేషన్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.

'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్‌' డెలివరీల జాతర: ఒకే రోజు 150 యూనిట్లు & అరుదైన రికార్డ్ కైవసం

ఈ కొత్త మిడ్ సైజ్ సెడాన్ లో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ సిస్టమ్, మల్టీ-కొలైజన్ బ్రేక్స్, రియర్ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఏబిఎస్ విత్ ఈబిడి, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి ఉన్నాయి.

'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్‌' డెలివరీల జాతర: ఒకే రోజు 150 యూనిట్లు & అరుదైన రికార్డ్ కైవసం

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ ఒకేరోజు ఒకే డీలర్ షిప్ ద్వారా 150 యూనిట్ల కార్లను డెలివరీ చేయడం బహుశా ఇదే మొదటిసారి. ఈ కారణంగానే 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్' సర్టిఫికెట్ కూడా పొందగలిగింది. అయితే మరిన్ని డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

Image Courtesy: EVM Volkswagen

Most Read Articles

English summary
Kerala volkswagen dealer delivered 150 units of virtus in single day
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X