విడుదలకు ముందే Kia Carens అన్ని వివరాలు.. ఇక్కడ చూడండి

దక్షిణ కొరియా కార్ తయారీ సంస్థ అయిన 'కియా మోటార్స్' (Kia Motors) భారతీయ మార్కెట్లో ఇటీవల కియా కారెన్స్ (Kia Carens) అనే కొత్త MPV ఆవిష్కరించింది. అయితే కంపెనీ ఈ MPV కోసం 2022 జనవరి 14 నుంచి బుకింగ్స్ స్వీకరించనున్నట్లు ప్రకటించింది. అయితే కంపెనీ త్వరలో ఈ MPV ని దేశీయ మార్కెట్లో విడుదల చేయనుంది. కానీ అంతకంటే ముందు ఈ కొత్త MPV యొక్క వేరియంట్స్, ఫీచర్లు మరియు ఇంజిన్ వంటి సమాచారం వెలువడింది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Kia Carens: వేరియంట్స్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కియా కారెన్స్ అనేది మొత్తం 5 వేరియంట్లలో అందుబటులో ఉంటుంది. అవి ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ వేరియంట్స్. ఈ MPV 6 మరియు 7 సీట్ల ఆప్సన్స్ తో తీసుకురానుంది. అంతే కాకూండా ఇది గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌పై ఆధారపడి ఉంటుంది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది.

Kia Carens: వేరియంట్స్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

కియా ఇండియా యొక్క కియా కారెన్స్ (Kia Carens) కంపెనీ యొక్క నాల్గవ మోడల్. ఇది అద్భుతమైన డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ MPV యొక్క ముందు భాగంలో టైగర్ నోస్ గ్రిల్‌ ఉంది. అంతే కాకుండా దీని ముందు భాగంలో ఒక సెపరేటింగ్ లైన్ కూడా మీరు చూడవచ్చు. ఇది ముందు భాగంలో ఎగువ మరియు దిగువ ఎయిర్ ఇన్‌టేక్‌లను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది.

Kia Carens: వేరియంట్స్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

ఇది ట్విన్ హెడ్‌లైట్ డిజైన్‌ను కలిగి ఉంది. దీనితో పాటు మెయిన్ హెడ్‌లైట్ సన్నని లైట్ల క్రింద ఉంచబడింది. ఇది LED DRL కూడా పొందుతుంది. ఇందులో పెద్ద వీల్ ఆర్చ్‌లు సైడ్ మరియు బాడీ లైన్‌లలో ముందు నుండి చివరి వరకు కనిపిస్తాయి. ఇదే లైన్ ముందు హెడ్‌లైట్ వద్ద మొదలై ఫ్రంట్ డోర్ వద్ద ముగుస్తుంది.

Kia Carens: వేరియంట్స్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

కియా కారెన్స్ యొక్క ఎల్ఈడీ టైల్‌లైట్‌లు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. ఇది ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఏ కియా మోడల్స్ లో కనిపించదు. అంతే కాకుండా దీనికి రెండు వైపులా టెయిల్ లైట్లను కలిపే లైట్ బార్‌తో పాటు వెనుక డోర్ పైన అనేక లైన్లు ఇవ్వబడ్డాయి. మొత్తానికి ఇది చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది.

Kia Carens: వేరియంట్స్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

కియా కారెన్స్ కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,540 మిమీ, 1,800 మిమీ వెడల్పు, 1,708 మిమీ ఎత్తు మరియు దాని విభాగంలో 2,780 మిమీ పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఇది ఇంపీరియల్ బ్లూ, మాస్ బ్రౌన్, మెరిసే సిల్వర్, ఇంటెన్స్ రెడ్, గ్లేసియర్ వైట్ పెర్ల్, క్లియర్ వైట్, గ్రావిటీ గ్రే మరియు అరోరా బ్లాక్ పెర్ల్ అనే 8 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది.

Kia Carens: వేరియంట్స్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

కొత్త కియా కారెన్స్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. దాని దిగువ వేరియంట్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. దీని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది.

Kia Carens: వేరియంట్స్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

ఇందులోని స్టీరింగ్ వీల్ కంపెనీ యొక్క సెల్టోస్ మాదిరిగా ఉంటుంది. ఈ స్టీరింగ్ కి ఇరువైపులా అనేక కంట్రోల్ బటన్లు ఇవ్వబడ్డాయి. ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. కొత్త కియా కారెన్స్ 6 మరియు 7 సీట్ల ఎంపికలలో తీసుకురాబడింది. కావున ఇందులో మల్టిపుల్ AC వెంట్స్, కప్ హోల్డర్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, మల్టిపుల్ USB పోర్ట్‌లు, పెద్ద సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, బోస్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, లెదర్ సీటు వంటి అనేక ఆధునిక ఫీచర్లు పొందుతుంది. కంపెనీ యొక్క అత్యధిక వీల్ బేస్ కలిగిన మోడల్ ఇదేనని కంపెనీ పేర్కొంది.

Kia Carens: వేరియంట్స్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

ఇక కొత్త కియా కారెన్స్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది దేశంలోని సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మోడల్ యొక్క అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్ వంటివి ఇవ్వబడ్డాయి.

Kia Carens: వేరియంట్స్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

కొత్త కియా కారెన్స్ పెట్రోల్ మరియు డీజిల్ రెండింటితో సహా మల్టిపుల్ ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఎంపికలలో అందించబడుతుంది. దీనితో పాటు, ఎకో, స్పోర్ట్ మరియు నార్మల్ వంటి అనేక డ్రైవ్ మోడ్‌లు ఇవ్వబడతాయి. మ్యాన్యువల్, ఆటోమేటిక్, డిసిటి గేర్‌బాక్స్ ఆప్షన్‌తో పాటు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ మరియు 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఇందులో అందించే అవకాశం ఉంటుంది.

Kia Carens: వేరియంట్స్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

ఇందులోని 1.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 138 బిహెచ్‌పి పవర్ మరియు 1,500-3,200 ఆర్‌పిఎమ్ వద్ద 242 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 స్పీడ్ DCT కలిగి ఉంటుంది.

ఇక 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 113 బిహెచ్‌పి పవర్ మరియు 1,500-2,750 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ ఎమ్ టార్క్ అందిస్తుది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటో మాటిక్ గేర్ బాక్స్ కి జత చేయబడి ఉంటుంది.

Engine Transmission Power Torque
Smartstream G 1.5 Petrol 6MT 113 bhp 6,300 rpm 144 Nm 4,500 rpm
Smartstream G1.4 T-GDi Petrol 6MT / 7DCT 138 bhp 6,000 rpm 242 Nm 1,500-3,200 rpm
1.5L CRDi VGT Diesel 6MT / 6AT 113 bhp 4,000 rpm 250 Nm 1,500-2,750 rpm
Kia Carens: వేరియంట్స్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

కొత్త కియా కారెన్స్ MPV దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత 6/7 సీట్ల MPV విభాగంలో ప్రవేశిస్తుంది. ఈ విభాగానికి దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. కావున కియా యొక్క కొత్త కార్ కూడా మంచి అమ్మకాలను పొందుతుందని ఆశించవచ్చు. ఈ కొత్త MPV భారతీయ మార్కెట్లో విడుదలైన తరువాత టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Kia carens mpv variant features engine details revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X