కియా ఈవీ6 బ్రోచర్ లీక్.. ఈ ఎలక్ట్రిక్ క్రాసోవర్ గురించి తెలుసుకోవాల్సిన టాప్ 10 డీటేల్స్..!

సోనెట్, సెల్టోస్ మరియు కార్నివాల్ మోడళ్ల విజయంతో భారతదేశంలో టాప్ కార్ కంపెనీలలో ఒకటిగా దూసుకుపోతున్న కొరియన్ కార్ బ్రాండి కియా (Kia), దేశీయ విపణిలో మరో కొత్త కారును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, కియా తమ ఈవీ6 (Kia EV6) ఎలక్ట్రిక్ కారును ఇక్కడి మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఈ నేపథ్యంలో, కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన బ్రోచర్ ఒకటి ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఇందులో ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన 10 ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో చూద్దాం రండి.

కియా ఈవీ6 బ్రోచర్ లీక్.. ఈ ఎలక్ట్రిక్ క్రాసోవర్ గురించి తెలుసుకోవాల్సిన టాప్ 10 డీటేల్స్..!

1. డిజైన్

కియా ఈవీ6 చూడటానికి ఓ క్రాసోవర్ డిజైన్‌ను తలపిస్తుంది. నిజానికి, ఇది హ్యుందాయ్ విక్రయిస్తున్న ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కార్ ప్లాట్‌ఫామ్‌ను పంచుకుంటుంది. సన్నటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, అగ్రెసివ్‌గా కనిపించే ఫ్రంట్ బంపర్, బానెట్‌పై ఉబ్బినట్లుగా ఉండే బాడీ లైన్స్ మరియు సన్నటి ఫ్రంట్ గ్రిల్‌తో ఇది ముందు వైపు నుండి మజిక్యులర్ లుక్‌ని కలిగి ఉంటుంది. సైడ్ డిజైన్ చాలా క్లీన్ గా ఉంటుంది, ఇక్కడ స్పోర్టీ అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కారు వెనుక భాగంలో డ్యూయెల్ టోన్ బంపర్, బూట్ లిప్ స్పాయిలర్ పొడవునా సాగే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ఆకట్టుకుంటాయి.

కియా ఈవీ6 బ్రోచర్ లీక్.. ఈ ఎలక్ట్రిక్ క్రాసోవర్ గురించి తెలుసుకోవాల్సిన టాప్ 10 డీటేల్స్..!

2. ఫీచర్లు

కియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఇతర కార్ల మాదిరిగానే, ఈ ఎలక్ట్రిక్ కారును కూడా ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో అందించనుంది. కొత్త Kia EV6 ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ లో ఆల్-ఎల్ఈడి లైట్స్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, Apple CarPlay మరియు Android Auto తో కూడిన 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచ్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు వంటి మరెన్నో ఫీచర్లు ఉండనున్నాయి.

కియా ఈవీ6 బ్రోచర్ లీక్.. ఈ ఎలక్ట్రిక్ క్రాసోవర్ గురించి తెలుసుకోవాల్సిన టాప్ 10 డీటేల్స్..!

3. వేరియంట్లు

సాధారణంగా, కియా కార్లు విభిన్న పవర్‌ట్రైన్ మరియు ఫీచర్ ఆప్షన్లతో వివిధ రకాల కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా, విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. అయితే, ఆన్‌లైన్ లో లీకైన బ్రోచర్ ప్రకారం, కియా ఈవీ6 ఒకే ఒక వేరియంట్లో మాత్రమే అందించబడుతుందని తెలుస్తోంది. ఇది టాప్-ఎండ్, జిటి లైన్ రూపంలో ఉంటుందని సమాచారం. అయితే, భవిష్యత్తులో కంపెనీ ఇందులో మరిన్ని వేరియంట్‌లను విడుదల చేసే అవకాశం ఉంది.

కియా ఈవీ6 బ్రోచర్ లీక్.. ఈ ఎలక్ట్రిక్ క్రాసోవర్ గురించి తెలుసుకోవాల్సిన టాప్ 10 డీటేల్స్..!

4. పవర్ట్రైన్

లీకైన బ్రోచర్ ప్రకారం, రాబోయే Kia EV6 ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ పెద్ద 77.4 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఈ ఆల్-వీల్ డ్రైవ్ ట్రిమ్ యొక్క లాంగ్ రేంజ్ వెర్షన్ గరిష్టంగా 321 బిహెచ్‌పి శక్తిని మరియు 605 ఎన్ఎమ్ టార్క్‌‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో రెండు యాక్సిల్స్ లో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చబడి ఉంటాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లలో, Kia EV6 కొంచెం తక్కువ సామర్థ్యం 58 kWh బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

కియా ఈవీ6 బ్రోచర్ లీక్.. ఈ ఎలక్ట్రిక్ క్రాసోవర్ గురించి తెలుసుకోవాల్సిన టాప్ 10 డీటేల్స్..!

గ్లోబల్ మార్కెట్లలో, కియా ఈవీ6 రియర్ వీల్ డ్రైవ్ (RWD) రూపంలో కూడా అందుబాటులో ఉంది. కియాయ ఈవీ6 యొక్క ఈ మోడల్ గరిష్టంగా 226 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఈ వేరియంట్లో ఒకే ఒక పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ (PMSM) ఉంటుంది.

కియా ఈవీ6 బ్రోచర్ లీక్.. ఈ ఎలక్ట్రిక్ క్రాసోవర్ గురించి తెలుసుకోవాల్సిన టాప్ 10 డీటేల్స్..!

5. రేంజ్

కియా ఈవీ6 జిటి లైన్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది కాబట్టి, ఈ మోడల్ యొక్క AWD (ఆల్-వీల్ డ్రైవ్) వెర్షన్ పూర్తి ఛార్జ్‌ పై గరిష్టంగా 424 కిలోమీటర్ల WLTP సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది. అయితే, కియా ఈవీ6 యొక్క లాంగ్ రేంజ్ వెర్షన్ పూర్తిగా ఛార్జ్ పై గరిష్టంగా 528 కిమీలను దూరాన్ని కవర్ చేస్తుందని కంపెనీ పేర్ంది.

కియా ఈవీ6 బ్రోచర్ లీక్.. ఈ ఎలక్ట్రిక్ క్రాసోవర్ గురించి తెలుసుకోవాల్సిన టాప్ 10 డీటేల్స్..!

6. ఛార్జింగ్ టైం

లీకైన బ్రోచర్ ప్రకారం, రాబోయే కియా ఈవీ6 క్రాస్‌ఓవర్ కేవలం 4.5 నిమిషాల్లో 100 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి గల రేంజ్ ను జోడించగలదని ఇది వెల్లడిస్తుంది. అంతేకాకుండా, Kia EV6 క్రాస్‌ఓవర్ 50kW DC ఛార్జర్‌ని ఉపయోగించి 10 శాతం నుండి 80 శాతానికి ఛార్జ్ చేయడానికి 73 నిమిషాలు పడుతుంది. అయితే, ఈ సమయాన్ని 150kW DC ఛార్జర్‌ని ఉపయోగించి కేవలం 18 నిమిషాలకు తగ్గించవచ్చు.

కియా ఈవీ6 బ్రోచర్ లీక్.. ఈ ఎలక్ట్రిక్ క్రాసోవర్ గురించి తెలుసుకోవాల్సిన టాప్ 10 డీటేల్స్..!

7. పెర్ఫార్మెన్స్

కియా ఈవీ6 ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ యొక్క బేస్ వెర్షన్ కేవలం 8 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకోగలదు మరియు గరిష్టంగా గంటకు 185 కిమీ వేగంతో పరుగులు తీయగలదు. అయితే, డ్యూయల్ మోటార్‌లతో కూడిన కియా ఈవీ6 జిటి లైన్ కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకోగలదు మరియు గరిష్టంగా గంటకు 260 కిమీ టాప్ స్పీడ్ తో దూసుకుపోగలదు.

కియా ఈవీ6 బ్రోచర్ లీక్.. ఈ ఎలక్ట్రిక్ క్రాసోవర్ గురించి తెలుసుకోవాల్సిన టాప్ 10 డీటేల్స్..!

8. సేఫ్టీ ఫీచర్లు

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త కియా ఈవీ6 క్రాస్‌ఓవర్ లో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానికి స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ISOFIX చైల్డ్ సీట్లు, హిల్-స్టార్ అసిస్ట్, మల్టీ కొలిజన్ బ్రేక్ అసిస్ట్, ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) మొదలైనవి ఉండనున్నాయి. ఈ అడాస్ ఫీచర్లలో భాగంగా, ఫార్వర్డ్ కొలైజన్ అవైడెన్స్ అసిస్టెన్స్, లేన్ కీపింగ్ అసిస్టెన్స్, బ్లైండ్-స్పాట్ అలర్ట్, రియర్-క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, లేన్ ఫాలో అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి మరెన్నో ఉండనున్నాయి.

కియా ఈవీ6 బ్రోచర్ లీక్.. ఈ ఎలక్ట్రిక్ క్రాసోవర్ గురించి తెలుసుకోవాల్సిన టాప్ 10 డీటేల్స్..!

9. ప్రొడక్షన్ ఎక్కడ?

కియా ఇండియా ఈ కొత్త ఈవీ6 ఎలక్ట్రిక్ కారును తమ ఇతర కార్ల మాదిరిగా భారతదేశంలో తయారు చేయకుండా, పూర్తిగా విదేశాలలో తయారైన మోడల్ ను భారతదేశానికి దిగుమతి చేసుకొని విక్రయించేందుకు ప్లాన్ చేస్తోంది. సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్‌లో ఇక్కడి దిగుమతి కానున్న కియా ఈవీ6 ధర కూడా కాస్తంత అధికంగానే ఉండే అవకాశం ఉంది.

కియా ఈవీ6 బ్రోచర్ లీక్.. ఈ ఎలక్ట్రిక్ క్రాసోవర్ గురించి తెలుసుకోవాల్సిన టాప్ 10 డీటేల్స్..!

10. ధర

కియా ఈవీ6 ఇంపోర్టెడ్ కారుగా ఇండియాకు వస్తున్న నేపథ్యంలో, ప్రస్తుతం భారతదేశంలో దిగుమతి సుంకాలపై విధిస్తున్న అధిక పన్నుల కారణంగా, భారత మార్కెట్లో కొత్త కియా ఈవీ6 కారు ధర సుమారు రూ. 40 లక్షల నుండి రూ. 50 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Kia ev6 electric crossover brochure leaked online top 10 things to know
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X