లంబోర్ఘిని యొక్క 'అవెంటడార్ అల్టిమే' ఇండియాకు వచ్చేసింది: వివరాలు

భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ మార్కెట్లో ఎక్కువమంది సెలబ్రెటీలు మరియు ఇతర సంపన్నులు ఎక్కువగా ఇష్టపడే సూపర్ కార్ బ్రాండ్స్ లో ఒకటి 'లంబోర్ఘిని' (Lamborghini). ఈ ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ ఇప్పటికే మార్కెట్లో అద్భుతమైన మరియు అధునాతన వాహనాలను విడుదల చేసి మంచి ఆదరణ పొందుతూ సాగుతోంది. అయితే ఇప్పుడు తన మొదటి 'లంబోర్ఘిని అవెంటడార్ అల్టిమే' (Lamborghini Aventador Ultimae) రోడ్‌స్టర్‌ను భారతదేశంలో మొదటి కస్టమర్ కి డెలివరీ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం రండి.

Lamborghini యొక్క 'Aventador Ultimae' ఇండియాకు వచ్చేసింది: వివరాలు

కంపెనీ ఎట్టకేలకు ఈ రోజు తన 'లంబోర్ఘిని అవెంటడోర్ అల్టిమే' రోడ్‌స్టర్ టాప్‌లెస్ సూపర్‌కారుని డెలివరీ చేసింది. ఇక్కడ కనిపించే ఈ సూపర్ కారు ఎల్లో కలర్ లో చూడచక్కగా ఉంది. అయితే కంపెనీ డెలివరీ చేసే 250 యూనిట్ల కార్లలో ఇది కూడా ఒకటి. కంపెనీ ఈ సూపర్ కారుని డెలివరీ చేసింది, కానీ ధరకు సంబంధించిన వివరాలను అధికారికంగా విడుదల చేయలేదు.

Lamborghini యొక్క 'Aventador Ultimae' ఇండియాకు వచ్చేసింది: వివరాలు

లంబోర్ఘిని కంపెనీ యొక్క ఈ అవెంటడార్ అల్టిమే అనేది కూపే మరియు రోడ్‌స్టర్ గా అందుబాటులో ఉంటుంది. ఈ సూపర్ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా లేటెస్ట్ ఫీచర్స్ కూడా కలిగి ఉంది. అయితే కంపెనీ ఈ సూపర్ కారుని ప్రపంచ వ్యాప్తంగా కేవలం 350 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. ఇందులో కూడా లంబోర్ఘిని అవెంటడోర్ అల్టిమే యొక్క రోడ్‌స్టర్ వెర్షన్ ను ప్రపంచవ్యాప్తంగా కేవలం 250 యూనిట్లు మాత్రమే పరిమితం చేయబడింది. కావున ఈ సూపర్ కారు యజమానులు మొత్తం 250 మంది మాత్రమే.

Lamborghini యొక్క 'Aventador Ultimae' ఇండియాకు వచ్చేసింది: వివరాలు

కంపెనీ ఇప్పుడు డెలివరీ చేసిన ఈ లంబోర్ఘిని అవెంటడార్ అల్టిమే కారు దాని మునుపటి అవెంటడార్స్ మాదిరిగానే అల్యూమినియం ఫ్రంట్ మరియు రియా ఫ్రేమ్‌లతో కార్బన్ ఫైబర్ మోనోకోక్‌ కలిగి ఉంది. అయితే ఇందులో ఇంజిన్ కవర్, రియర్ ఎయిర్ ఇన్‌లెట్స్ మరియు స్పాయిలర్స్ వంటివి కార్బన్ ఫైబర్‌తో ఉన్నాయి. ఇందులో మిగిలిన ఇతర ప్యానెల్స్ అల్యూమినియం మరియు సింథటిక్ మెటీరియల్స్ తో ఉన్నాయి. ఈ లేటెస్ట్ అల్టిమే రోడ్‌స్టర్‌ అద్భుతమైన కార్బన్-ఫైబర్ హార్డ్ టాప్ పొందుతుంది.

Lamborghini యొక్క 'Aventador Ultimae' ఇండియాకు వచ్చేసింది: వివరాలు

ఈ సూపర్ కారు యొక్క వీల్స్ విషయానికి వస్తే, ఈ కారు యొక్క ముందు భాగంలో 20 ఇంచెస్ వీల్స్, వెనుక భాగంలో 21 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి. ఇక టైర్స్ విషయానికి వస్తే ముందు భాగంలో 255/30 జెడ్ఆర్ 20 92వై టైర్స్ మరియు వెనుక భాగంలో 355/25 జెడ్ఆర్ 21 107వై ఇవి రెండూ కూడా పైరెల్లి పి జీరో కోర్సా టైర్లు.

Lamborghini యొక్క 'Aventador Ultimae' ఇండియాకు వచ్చేసింది: వివరాలు

బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ సూపర్ కారు యొక్క ముందు భాగంలో సిక్స్-పిస్టన్ ఫిక్స్‌డ్ మోనోబ్లాక్ అల్యూమినియం కాలిపర్‌తో కూడిన 400 మిమీ కార్బన్ సిరామిక్ డిస్క్‌లు మరియు వెనుక భాగంలో అల్యూమినియం ఫోర్-పిస్టన్ స్థిర మోనోబ్లాక్ కాలిపర్‌లతో కూడిన 380 మిమీ కార్బన్ సిరామిక్ డిస్క్‌లు ఉన్నాయి. ఇవి చాలా షార్ప్ గా పనిచేస్తాయి. సస్పెన్షన్ కూడా అనుకూలంగా ఉంటుంది.

Lamborghini యొక్క 'Aventador Ultimae' ఇండియాకు వచ్చేసింది: వివరాలు

సాధారణంగా లంబోర్ఘిని అవెంటడోర్ అల్టిమే రోడ్‌స్టర్‌ యొక్క లోపల కార్బన్-ఫైబర్ ఉంటుంది. ఇది ఇందులో చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవాలి. ఎందుకంటే కంపెనీ యొక్క 250 యూనిట్లు ప్రపంచంలోనే ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇది ఈ సూపర్ కార్ల యొక్క ప్రత్యేకత. మొత్తం మీద ఇది మంచి డిజైన్ పొందుతుంది.

Lamborghini యొక్క 'Aventador Ultimae' ఇండియాకు వచ్చేసింది: వివరాలు

'లంబోర్ఘిని అవెంటడార్ అల్టిమే' (Lamborghini Aventador Ultimae) యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి12 ఇంజిన్‌ ఉంటుంది. ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 770 బిహెచ్‌పి పవర్ మరియు 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 720 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.

Lamborghini యొక్క 'Aventador Ultimae' ఇండియాకు వచ్చేసింది: వివరాలు

లంబోర్ఘిని అవెంటడోర్ అల్టిమే సూపర్ కారు కేవలం 2.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో ఇది 0 నుంచి 200 కిమీ/గం వరకు వేగవంతం కావడానికి పట్టే సమయం కేవలం 8.7 సెకన్లు మాత్రమే. దీని గరిష్ట వేగం (టాప్ స్పీడ్) గంటకు 355 కిలోమీటర్లు. అంటే ఇది మెరుపువేగంతో దూసుకెళ్తుంది.

Lamborghini యొక్క 'Aventador Ultimae' ఇండియాకు వచ్చేసింది: వివరాలు

లంబోర్ఘిని అవెంటడోర్ అల్టిమేలోని 6.5-లీటర్ వి12 ఇంజన్ 1-12-4-9-2-11-6-7-3-10-5-8 ఫైరింగ్ ఆర్డర్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా ఇందులోని ఫోర్ వీల్ స్టీరింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. కావున దీని సాయంతో తక్కువ వేగంలో కూడా చురుకుదనాన్ని మరింత పెంచడంలో తోడ్పడుతుంది. అంతే కాకుండా అధిక వేగంలో కూడా కంట్రోల్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద లంబోర్ఘిని యొక్క ఈ అవెంటడోర్ అల్టిమే అద్భుతంగా ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

Lamborghini యొక్క 'Aventador Ultimae' ఇండియాకు వచ్చేసింది: వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

లంబోర్ఘిని కంపెనీ భారతదేశంలో తన మొదటి యూనిట్ డెలివరీ చేసింది. అయితే ఈ సూపర్ కారుకి సంబంధించిన ధర మాత్రం వెల్లడించలేదు. అయితే మేము లంబోర్ఘిని కంపెనీ కూడా తమ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా విడుదల చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాము. ఎప్పటికప్పుడు కొత్త కార్లు మరియు కొత్త బైకులు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

Most Read Articles

English summary
Lamborghini aventador ultimae roadster delivered start in india
Story first published: Wednesday, June 15, 2022, 17:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X