జైలు శిక్ష పడేలా చేసిన మోడిఫైడ్ మహీంద్రా థార్.. పూర్తి వివరాలు

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ హల్ చల్ చేస్తూనే ఉంది. అయితే ఇప్పడు కాశ్మీర్ కోర్టు ఒక 'మహీంద్రా థార్' ఓనర్ కి 6 నెలలు జైలు శిక్ష విధించింది.

ఇంతకీ మహీంద్రా థార్ ఓనర్ కి కోర్టు ఎందుకు ఈ శిక్ష విడించించింది, దాని వెనుక ఉన్న అసలు నిజాలు ఏమి అనే పూర్తి వివరాలను మనం ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.. రండి.

జైలు శిక్ష పడేలా చేసిన మోడిఫైడ్ మహీంద్రా థార్

గమనిక: ఇక్కడ ఉపయోగించిన ఫోటో కేవలం అవగాహన కోసం మాత్రమే

నివేదికల ప్రకారం, జమ్మూ & కాశ్మీర్ కోర్టు 'థార్' SUV ని మాడిఫైడ్ చేసినందుకు గానూ ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మహీంద్రా థార్ ఓనర్ తన SUV లో సైరన్‌తో పాటు, హార్డ్ టాప్, పెద్ద చక్రాలు, రెట్రోఫిట్ చేయబడిన LED లైట్లు మరియు హై కార్ సైర్డ్ వంటివాటితో పాటు కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ కూడా చేసినట్లు తెలిసింది.

మహీంద్రా థార్ SUV లో చేసిన ఈ మోడిఫికేషన్స్ అన్నీ కూడా మోటారు వాహనాల చట్టం 1988 సెక్షన్ 52 ప్రకారం చట్ట విరుద్ధం. ఈ కారణంగానే ఈ థార్ ఓనర్ కి ఏకంగా ఆరు నెలలు జైలు శిక్ష విధించారు. నిజానికి భారతదేశంలో వెహికల్ మోడిఫికేషన్ చట్ట విరుద్ధం, కావున మోడిఫైడ్ వాహనాల మీద అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు.

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అక్కడక్కడా మోడిఫైడ్ వాహనాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే కొన్ని మార్పులు ఆర్టివో తెలిపిన నియమాలకు లోబడి ఉంటాయి. అలా కాకుండా వాహనంలో భారీ మార్పులు జరిగినట్లయితే సంబంధిత అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాహనంలో మోడిఫికేషన్స్ చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ ఈ మోడిఫికేషన్స్ వల్ల భద్రతలో లోపాలు తలెత్తే అవకాశం ఉంటుంది.

మహీంద్రా థార్ యజమాని ఆదిల్ ఫరూక్ భట్‌ అని తెలిసింది. ఇతడు తన కారుని మోడిఫైడ్ చేయడం రెండు సంవత్సరాల పాటు శాంతి భద్రతలు మరియు మంచి ప్రవర్తన కోసం రూ. 2 లక్షల బాండ్ అమలు చేయాలని థార్ యజమానిని కోర్టు ఆదేశించింది. దీనిని వ్యతిరేకించిన పక్షంలో నిందితునికి తప్పకుండా జైలు శిక్ష విధించబడుతుంది.

గతంలోనే విడుదలైన కొన్ని నివేదికల ప్రకారం 'మోటారు వాహన చట్టానికి' వ్యక్తిరేకంగా మోడిఫైడ్ చేసిన వాహనాలు గాని వాహనదారులు గానీ శిక్షార్హులు. అయితే ఇప్పుడు మోడిఫైడ్ చేయబడిన మహీంద్రా థార్ మోటారు వాహన చట్టానికి వ్యక్తిరేఖంగా ఉంది. కావున మోడిఫైడ్ చేయబడిన అన్ని పరికరాలను తొలగించి మునుపటి మాదిరిగా ఉండేలా చేయాలనీ కూడా కోర్టు ఆదేశించింది.

మహీంద్రా థార్ మోడిఫికేషన్ మీద డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

గతంలో మనం తెలుసుకున్న సమాచారం ప్రకారం, భారతదేశంలో వెహికల్ మోడిఫికేషన్ చట్టవిరుద్ధం. కావున వాహన వినియోగదారులు తమ వాహనాలను మోడిఫైడ్ చేసుకోవడం తప్పకుండా మానుకోవాలి. అలా కాకుండా ఇలాంటి చర్యలకు పాల్పడితే తప్పకుండా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతోపాటు, కొత్త బైకులు, కార్లను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Mahindra thar modification owner jailed for six months details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X