Maserati Levante హైబ్రిడ్ ఎస్‌యూవీని లాంచ్‌కి ముహుర్తం ఖరారు.. బుకింగ్స్ ఓపెన్!

ఇటాలియన్ లగ్జరీ కార్ బ్రాండ్ మాసేరటి (Maserati) అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న తమ లేటెస్ట్ హైబ్రిడ్ స్పోర్ట్స్ ఎస్‌యూవీ 'మాసేరటి లెవాంటే' (Maserati Levante Hybrid) ఇకపై భారత మార్కెట్లో కూడా లభ్యం కానుంది. ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో ఈ కారును భారతదేశంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో, కంపెనీ తమ పాపులర్ మాసెరటి లెవాంటే హైబ్రిడ్ ధరలను కూడా ప్రకటించింది మరియు బుకింగ్ లను స్వీకరించడం కూడా ప్రారంభించింది.

Maserati Levante హైబ్రిడ్ ఎస్‌యూవీని లాంచ్‌కి ముహుర్తం ఖరారు.. బుకింగ్స్ ఓపెన్!

కంపెనీ పేర్కొన్న ప్రకారం, ఈ లేటెస్ట్ స్పోర్ట్స్ హైబ్రిడ్ ఎస్‌యూవీ భారతదేశంలో రూ. 1.45 కోట్ల నుండి రూ. 1.60 కోట్ల మధ్య అందుబాటులో ఉంటుంది. మాసేరటి లెవాంటే హైబ్రిడ్ బ్లూ కలర్ డిటైలింగ్‌ను కలిగి ఉంటుంది మరియు ఈ బ్లూ కలర్ డీటేలింగ్ దీనిని బ్యాటరీతో నడిచే హైబ్రిడ్ వాహనంగా సూచిస్తుంది. ఇందులో మరింత శక్తివంతమైన వేరియంట్ కోరుకునే వారి కోసం కంపెనీ ఇందులో GT హైబ్రిడ్ వేరియంట్‌ను కూడా అందిస్తోంది.

Maserati Levante హైబ్రిడ్ ఎస్‌యూవీని లాంచ్‌కి ముహుర్తం ఖరారు.. బుకింగ్స్ ఓపెన్!

ఈ స్పోర్టీ వెర్షన్ మాసేరటి లెవాంటే జిటి హైబ్రిడ్ ఎస్‌యూవీలో దాని ముందు వైపు ఫెండర్‌లపై మూడు పెద్ద ఎయిర్ డక్ట్‌లు ఉంటాయి మరియు ఇవి కారుకు సరైన డౌన్‌ఫోర్స్ అందించడంలో సహకరిస్తాయి. ఈ కారు చుట్టూ కూడా బ్లూ కలర్ డీటేలింగ్స్ ఉంటాయి. సి-పిల్లర్ మరియు బ్రేక్ కాలిపర్‌లు మరియు ట్రైడెంట్ లోగో పై బ్లూ అవుట్‌లైన్ కనిపిస్తుంది. అదనంగా, మాసెరటి ఈ కారును ప్రత్యేకమైన ట్రిపుల్ కోట్ అజ్జురో ఆస్ట్రో మెటాలిక్ అనే పెయింట్‌ స్కీమ్ తో అందిస్తుంది, ఇది మసెరటి ఫ్యూరీసిరీస్ ద్వారా లభిస్తుంది.

Maserati Levante హైబ్రిడ్ ఎస్‌యూవీని లాంచ్‌కి ముహుర్తం ఖరారు.. బుకింగ్స్ ఓపెన్!

లెవాంటే మాసేరటి బ్రాండ్ యొక్క మొట్టమొదటి హైబ్రిడ్ ఎస్‌యూవీ మరియు ఇది ఈ బ్రాండ్ నుండి లభిస్తున్న రెండవ హైబ్రిడ్ కారు. ఈ లైనప్‌లో మొదటిది మాసేరటి ఘిబ్లి హైబ్రిడ్. మాసేరటి లెవాంటే దాని విలక్షణమైన ఇటాలియన్ డిజైన్‌తో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చూడటానికి ఈ ఎస్‌యూవీ కొద్దిగా కాంపాక్ట్‌గా కనిపించినప్పటికీ, కారు లోపల చాలా విశాలమైన క్యాబిన్ మరియు బూట్ స్పేస్ ఉంటుంది. మొదటి చూపులోనే ఇది కస్టమర్లను ఆకట్టుకునే డిజైన్ ను కలిగి ఉంది.

Maserati Levante హైబ్రిడ్ ఎస్‌యూవీని లాంచ్‌కి ముహుర్తం ఖరారు.. బుకింగ్స్ ఓపెన్!

మరీ ముఖ్యంగా, లెవాంటే హైబ్రిడ్ లో రీడిజైన్ చేయబడిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్‌ల్యాంప్‌లు, కొత్త ఫ్రంట్ గ్రిల్, 21 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌తో చాలా అందంగా కనిపిస్తుంది. ఇంటీరియర్స్ విషయానికి వస్తే, క్యాబిన్ బయట ఉన్న అదే బ్లూ డిటైలింగ్‌ లోపలి భాగంలో కూడా కనిపిస్తుంది. కారు లోపల సీట్లు బ్లూ కలర్ స్టిచింగ్ ను కలిగి ఉంటాయి. అలాగే, ఇంటీరియర్స్ లో అక్కడక్కడా బ్లూ కలర్ యాక్సెంట్స్ కనిపిస్తాయి.

Maserati Levante హైబ్రిడ్ ఎస్‌యూవీని లాంచ్‌కి ముహుర్తం ఖరారు.. బుకింగ్స్ ఓపెన్!

ఈ కారులో పెద్ద 8.4 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది మరియు ఇది వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ మరియు మాసెరటి యాప్ ద్వారా స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీని అందించే లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. డ్రైవర్ సమాచారం కోసం ఈ కారులో 7 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చేర్చబడింది. ఇక ఇంజన్ విషయానికి వస్తే, మాసేరటి లెవాంటే హైబ్రిడ్ కారులో2.0-లీటర్ టర్బోచార్జ్డ్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 48-వోల్ట్ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో జత చేయబడి ఉంటుంది.

Maserati Levante హైబ్రిడ్ ఎస్‌యూవీని లాంచ్‌కి ముహుర్తం ఖరారు.. బుకింగ్స్ ఓపెన్!

ఈ కారు పూర్తిగా పెట్రోల్ మరియు పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్ తో పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ కోసం ఈ కారులోని బూట్‌ స్పేస్ లో అమర్చబడిన ఒక చిన్న బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది లెవాంటే హైబ్రిడ్ యొక్క పవర్ టు వెయిట్ రేషియోని నిర్వహించడానికి మాసెరటికి సహాయపడింది. అదనంగా, ఈ పవర్‌ట్రెయిన్ కారును వి6 మోడల్ కంటే వేగంగా, తేలికగా మరియు మరింత ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉండేలా చేస్తుంది.

Maserati Levante హైబ్రిడ్ ఎస్‌యూవీని లాంచ్‌కి ముహుర్తం ఖరారు.. బుకింగ్స్ ఓపెన్!

ఈ శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 330 బిహెచ్‌పి శక్తిని మరియు 450 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని కొత్త హైబ్రిడ్ పవర్‌ట్రైన్ మాసేరటి లెవాంటే హైబ్రిడ్‌ను మరింత శక్తివంతంగా మరియు మరింత సమర్థవంతంగా మారుస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ హైబ్రిడ్ ఎస్‌యూవీ కేవలం ఆరు సెకన్లలోపే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 240 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

Maserati Levante హైబ్రిడ్ ఎస్‌యూవీని లాంచ్‌కి ముహుర్తం ఖరారు.. బుకింగ్స్ ఓపెన్!

భారతదేశంలో, ఇది టాప్-ఆఫ్-ది-రేంజ్ జిటి వేరియంట్‌లో అందుబాటులోకి వస్తుందని సమాచారం. మాసేరటి లెవాంటే హైబ్రిడ్ ఎస్‌యూవీ ఈ విభాగంలో పోర్ష్ కయూన్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఈ, రేంజ్ రోవర్ స్పోర్ట్ మరియు ఆడి క్యూ7 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Maserati Levante హైబ్రిడ్ ఎస్‌యూవీని లాంచ్‌కి ముహుర్తం ఖరారు.. బుకింగ్స్ ఓపెన్!

ఇదిలా ఉంటే, మాసేరటి తమ సరికొత్త ఎమ్‌సి20 సూపర్ స్పోర్ట్స్ కారును కూడా భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మిడ్-ఇంజన్ స్పీడ్‌స్టర్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్‌లను స్వీకరించడం కూడా ప్రారంభించింది. - ఈ కారుకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Maserati levante hybrid suv india launch expected soon bookings open details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X