Astor కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన MG Motors.. అదేంటో తెలుసా..?

ఎంజి మోటార్ (MG Motor) కంపెనీ గత సంవత్సరం భారతీయ విఫణిలో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల డెలివరీలో కొంత ఆలస్యం జరిగింది. కానీ కంపెనీ ఇటీవల ఒక ప్రకటన చేసింది. దీని ప్రకారం ఈ కారుని బుక్ చేసుకున్న మొదటి 5000 మంది కస్టమర్లకు త్వరలో డెలివరీ చేయనుంది.

Astor కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన MG Motors.. అదేంటో తెలుసా..?

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. మొదటి బుక్ చేసుకున్న కస్టమర్లకు దీనిని త్వరగా డెలివరీ చేయడానికి ఉత్పత్తికి వేగవంతం చేయడం జరిగిందని తెలుస్తుంది. అదే సమయంలో డెలివరీ కూడా వేగవంతం కానుంది. అయితే ఇక్కడ కస్టమర్లు గుర్తుంచుకోవలసిన అంశం ఏమిటంటే మొదటి బుక్ చేసుకున్న కస్టమర్లకు పాత ధరకే విక్రయించబడుతుంది.

Astor కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన MG Motors.. అదేంటో తెలుసా..?

కంపెనీ ఇప్పటికే అందించిన సమాచారం దృష్ట్యా 2021 చివరి నాటికి 5,000 ఆస్టర్‌లను డెలివరీ చేయాల్సి ఉంది. కానీ ఇది విజయవంతం కాలేదు. కంపెనీ బుకింగ్స్ ప్రారంభించిన సమయంలో మొదటి బ్యాచ్ కేవలం 5,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. అయితే ఈ 5,000 యూనిట్లు కేవలం 24 గంటల్లో బుక్ చేయబడ్డాయి.

Astor కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన MG Motors.. అదేంటో తెలుసా..?

ఆ తరువాత 2021 నవంబర్ నెలలో ఈ కొత్త లారు యొక్క డెలివరీ ఆలస్యం అవుతాయని తెలపడానికి ఒక వీడియోని కంపెనీ విడుదల చేసింది. అయితే డెలివరీ ఆలస్యం అయినప్పటికీ ధరల పెరుగుదల మాత్రం వీటికి వర్తించదని తెలిపింది. ఇప్పటికే కొంతమంది కాస్తమర్లకు ఈ SUV డెలివరీ చేయబడింది. అయితే త్వరలో మిగిలినవారికి డెలివరీ చేయబడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమలు సెమీకండక్టర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ కారణంగానే డెలివరీ ఆలస్యమవుతున్నాయి. కావున దీనికి కస్టమర్లు కూడా తమవంతు కొంత తప్పకుండా సహకారం అందించాలని కోరారు. కంపెనీ త్వరగానే డెలివరీలను ప్రారంభించడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

Astor కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన MG Motors.. అదేంటో తెలుసా..?

ఎంజి మోటార్స్ తాజాగా తన ఆస్టర్ SUV ధరలను పెంచింది. కంపెనీ 2021 అక్టోబర్ 2021 లో రూ. 9.78 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ప్రారంభించబడింది. దీని తరువాత కంపెనీ దీని ధరను రూ. 35,000 వరకు పెంచింది. ఇప్పుడు ఆస్టర్ ప్రారంభ ధర ఇప్పుడు రూ.9.98 లక్షల నుండి రూ.17.73 లక్షల వరకు ఉంటుంది.

Astor కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన MG Motors.. అదేంటో తెలుసా..?

కొత్త MG Astor అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. దీని ముందు భాగంలో గ్రిల్ మరియు ఎల్ఈడీ హెడ్‌లైట్, దాని క్రింద ఫాగ్ లైట్స్ ఉన్నాయి, దీనితో పాటు బంపర్‌పై లైన్‌లు కూడా ఇవ్వబడ్డాయి, కావున ఇది మంచి దూకుడు రూపాన్ని అందుకుంటుంది. సైడ్ ప్రొఫైల్ 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది, అంతే కాకుండా ఇండికేటర్‌తో పాటు ORVM లో చూడవచ్చు. ఈ కారు యొక్క గ్రిల్ భాగంలో 360 డిగ్రీ కెమెరా మరియు పార్కింగ్ కెమెరా వంటి వాటిని పొందుతుంది.

Astor కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన MG Motors.. అదేంటో తెలుసా..?

MG Astor మూడు ఇంటీరియర్ కలర్ ఆప్సన్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులోని డ్రైవర్ సీటు ఆరు రకాలుగా అడ్జస్ట్ చేయవచ్చు. ఇందులో మూడు పవర్ స్టీరింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి స్టాండర్డ్, అర్బన్ మరియు డైనమిక్ మోడ్స్. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ SUV లో 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, 7 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ పొందుతుంది.

Astor కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన MG Motors.. అదేంటో తెలుసా..?

MG Astor ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్‌ లతో అందుబాటులోకి రానుంది. వీటిలో మొదటిది 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. రెండవది 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్.

ఇందులోని 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 138 బిహెచ్‌పి వర్ ను మరియు 220 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో జత చేయబడి ఉంటుంది. ఇక 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 108 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ మరియు 8-స్పీడ్ సివిటి గేర్‌బాక్స్‌తో వస్తుంది.

Astor కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన MG Motors.. అదేంటో తెలుసా..?

కొత్త MG Astor మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, రియర్ డ్రైవ్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి 27 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది.

Astor కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన MG Motors.. అదేంటో తెలుసా..?

ఈ కొత్త SUV లో అటానమస్ లెవల్-2 సిస్టమ్‌ ఉంటుంది. కావున ఇది వినియోగాదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ SUV రిలయన్స్ జియో రియల్ టైమ్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు టెలిమాటిక్స్ కోసం భాగస్వామిగా ఉంది. దీని కోసం ఈ-సిమ్ మరియు లాట్ టెక్నాలజీ ఇవ్వబడుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోసం రోబోట్ స్క్రీన్ కూడా ఉంటుంది. ఇది వాహనదారుల ఆదేశాలను పాటిస్తుంది. ఇది మొత్తానికి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Mg astor delivery delay company assure customers details
Story first published: Friday, February 4, 2022, 11:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X