MG ఎలక్ట్రిక్ కారుకు పెరుగుతున్న డిమాండ్.. ఇంతకీ ఈ కారు స్పెషల్ ఏంటో తెలుసా..?

ఎమ్‌జి మోటార్ ఇండియా (MG Motor India) దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ కారు జెడ్ఎస్ ఈవీ (MG ZS EV) కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దేశంలో ప్రజలు పెట్రోల్ వాహనాల నుండి ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో, జెడ్ఎస్ ఈవీని కొనుగోలు చేసే కస్టమర్లు అధికమయ్యారు. ఎమ్‌జి మోటార్ ఇండియా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, కంపెనీ గత ఏడాది (2021) ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో 145 శాతం వృద్ధిని కనబరిచింది.

MG ఎలక్ట్రిక్ కారుకు పెరుగుతున్న డిమాండ్.. ఇంతకీ ఈ కారు స్పెషల్ ఏంటో తెలుసా..?

ఎమ్‌జి మోటార్ ఇండియా గడచిన 2020 సంవత్సరంలో విక్రయించిన 1,142 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే, 2021లో మొత్తం 2,798 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. ఈ సమయంలో ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ అమ్మకాలు ఏకంగా 145 శాతం పెరిగాయి. ఎమ్‌జి మోటార్ కంపెనీ తమ జెడ్ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ కారును తొలిసారిగా 2020 జనవరి నెలలో మార్కెట్లో విడుదల చేసింది. అలాగే, గతేడాది ఆరంభంలో కంపెనీ ఇందులో ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను కూడా ప్రవేశపెట్టింది.

MG ఎలక్ట్రిక్ కారుకు పెరుగుతున్న డిమాండ్.. ఇంతకీ ఈ కారు స్పెషల్ ఏంటో తెలుసా..?

మార్కెట్లో ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్ అనే రెండు వేరియంట్లలో అమ్మకానికి ఉంది. దీని ధర రూ. 21.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుంది. ఎమ్‌జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 44.5 కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తి చార్జ్‌పై 419 కిమీ రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే, వాస్తవ ప్రపంచంలో దీని మైలేజ్ పూర్తి చార్జ్ పై 350 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. ఇది ఈ విభాగంలో టాటా నెక్సాన్ ఈవీ కన్నా ఎక్కువ మరియు హ్యుందాయ్ కోన (452 ​​కిమీ/చార్జ్) కన్నా తక్కువగా ఉంటుంది.

MG ఎలక్ట్రిక్ కారుకు పెరుగుతున్న డిమాండ్.. ఇంతకీ ఈ కారు స్పెషల్ ఏంటో తెలుసా..?

ఎమ్‌జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 142.76 బిహెచ్‌పి శక్తిని మరియు 353 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ను ఇంట్లో ఉండే ఏసి ఛార్జర్ సాయంతో పూర్తిగా చార్జ్ చేయడానికి సుమారు 6 నుండి 8 గంటల సమయం పడుతుంది. అదే 50 కిలోవాట్ల డిసి ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే, ఈ ఎస్‌యూవీని కేవలం 50 నిమిషాల్లోనే 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది కేవలం 8.3 సెకన్లలోనే గంటకు 0 - 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది.

MG ఎలక్ట్రిక్ కారుకు పెరుగుతున్న డిమాండ్.. ఇంతకీ ఈ కారు స్పెషల్ ఏంటో తెలుసా..?

ఈ కారులో మూడు డ్రైవింగ్ మోడ్‌లు మరియు త్రీ-లెవల్ బ్రేకింగ్ రీజనరేషన్ టెక్నాలజీ కూడా ఉంది, ఇది డ్రైవర్ బ్రేక్ నొక్కినప్పుడు బ్యాటరీలను ఛార్జ్ చేస్తుంది, ఫలితంగా డ్రైవింగ్ రేంజ్ పెరుగుతుంది. ఈ కారులోని బ్యాటరీ ప్యాక్ కంపెనీ ఎనిమిది సంవత్సరాల వారంటీని అందిస్తుంది. ఇంకా ఇందులో స్టార్-రైడర్ గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, హీటెడ్ రియర్ వ్యూ మిర్రర్స్, రూఫ్ ట్రాక్స్, ఎల్‌ఈడి టెయిల్ లాంప్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

MG ఎలక్ట్రిక్ కారుకు పెరుగుతున్న డిమాండ్.. ఇంతకీ ఈ కారు స్పెషల్ ఏంటో తెలుసా..?

ఇంటీరియర్స్‌లో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు బ్రాండ్ యొక్క 'ఐ-స్మార్ట్' కనెక్టింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేసే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. అంతేకాకుండా, ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 2.5 పిఎమ్ ఎయిర్-ఫిల్టర్, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ మరియు స్మార్ట్‌ఫోన్ ద్వారా లేదా ఏఐ సహాయంతో మీ కారును కంట్రోల్ చేయటానికి 60కి పైగా కమాండ్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

MG ఎలక్ట్రిక్ కారుకు పెరుగుతున్న డిమాండ్.. ఇంతకీ ఈ కారు స్పెషల్ ఏంటో తెలుసా..?

ఎమ్‌జి మోటార్ ఇండియా తమ జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారు కోసం ఓ ప్రత్యేకమైన సబ్‌స్క్రిప్షన్ ను కూడా అందిస్తోంది. ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా కస్టమర్లు ప్రతినెలా రూ. 49,999 చందా చెల్లించి ఈ కారును కొంత కాలం పాటు లీజుకు తీసుకోవచ్చు లేదా కావాలనుకుంటే కొనుగోలు కూడా చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్స్ అధికంగానే ఉన్నప్పటికీ, కంపెనీ దీని తయారీ విషయలో ఎలక్ట్రానిక్ చిప్స్ కొరతను ఎదుర్కుంటున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ మోడల్ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

MG ఎలక్ట్రిక్ కారుకు పెరుగుతున్న డిమాండ్.. ఇంతకీ ఈ కారు స్పెషల్ ఏంటో తెలుసా..?

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ మోడల్ మాదిరిగానే కనిపించే ఓ పెట్రోల్ పవర్డ్ కారును కూడా కంపెనీ గతేడాది మార్కెట్లో విడుదల చేసింది. ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్ ప్రారంభ ధర రూ.9.78 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండేది. అయితే, కంపెనీ కంపెనీ కొత్త సంవత్సరం నుండి Aster SUV ధరను పెంచింది. ప్రారంభ ధర ఆఫర్ గడువు ముగిసిన తర్వాత, దీని ధర రూ.35,000 వరకూ పెరిగింది. ఇప్పుడు ఎమ్‌జి ఆస్టర్ కొత్త ధర రూ.9.98 లక్షల నుండి రూ.17.73 లక్షల మధ్యలో ఉంది.

MG ఎలక్ట్రిక్ కారుకు పెరుగుతున్న డిమాండ్.. ఇంతకీ ఈ కారు స్పెషల్ ఏంటో తెలుసా..?

ఎమ్‌జి మోటార్ ఇండియా కేవలం ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లోనే కాకుండా సాంప్రదాయ పెట్రోల్/డీజిల్ వాహనాల విభాగంలో కూడా గతేడాది సానుకూల వృద్ధిని నమోదు చేసింది. గత సంవత్సరం, కంపెనీ మొత్తం 40,273 యూనిట్ల కార్లను విక్రయించింది. ఇవి కంపెనీ 2020 సంవత్సరం విక్రయించిన దాని కంటే 43 శాతం ఎక్కువ.

Most Read Articles

English summary
Mg motor india sold 2798 zs electric suvs in 2021 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X