ఎమ్‌జి మోటార్ ఈ బుజ్జి ఎలక్ట్రిక్ కారును భారత్‌కు తీసుకురాబోతోంది..!

చైనీస్ యాజమాన్యంలో ఉన్న బ్రిటీష్ కార్ బ్రాండ్ ఎమ్‌జి, భారత మార్కెట్లోకి ప్రవేశించిన అతికొద్ది కాలంలోనే అత్యంత ప్రజాదరణ దక్కించుకున్న సంగతి మనందరికీ తెలిసినదే. అత్యాధునిక ఫీచర్లతో కూడిన కార్లను కంపెనీ అత్యంత సరసమైన ధరలకే భారత మార్కెట్లో విక్రయిస్తుండటమే దాని విజయానికి ప్రధాన కారణం. భారత ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో కూడా ఎమ్‌జి మోటార్ బాగా రాణిస్తోంది. కంపెనీ ఇప్పుడు తమ ఈవీ ప్రోడక్ట్ లైనప్ ను విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది.

ఎమ్‌జి మోటార్ ఈ బుజ్జి ఎలక్ట్రిక్ కారును భారత్‌కు తీసుకురాబోతోంది..!

ఎమ్‌జి మోటార్ భారత మార్కెట్ లో అతి త్వరలో ఒక చిన్న మరియు అత్యంత సరసమైన ఓ ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ఎమ్‌జి మోటార్ యొక్క చైనీస్ అనుబంధ కార్‌మేకర్ వులింగ్ (Wuling) పలు అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న ఎయిర్ ఈవీ (Wuling Air EV) డిజైన్ ఆధారంగా ఓ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును ఎమ్‌జి మోటార్ భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. వులింగ్ తమ చిన్న ఎలక్ట్రిక్ కార్లను చైనా మార్కెట్‌తో సహా పలు ఆగ్నేయాసియాలోని అనేక దేశాలలో విక్రయిస్తోంది.

ఎమ్‌జి మోటార్ ఈ బుజ్జి ఎలక్ట్రిక్ కారును భారత్‌కు తీసుకురాబోతోంది..!

ఇటీవలే ఇండోనేషియాలో ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు ప్రవేశపెట్టబడింది, దీనిని E230 అనే కోడ్ నేమ్ తో పిలుస్తారు. ఓ నివేదిక ప్రకారం, ఎమ్‌జి మోటార్ ఈ కారు డిజైన్‌లో కొన్ని చిన్నపాటి మార్పులు చేర్పు చేసి, అదే ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారు చేసిన ఓ ఈవీ మోడల్‌ను భారతదేశంలో ప్రారంభించవచ్చని సమాచారం. ఇ230 అనేది కంపెనీ యొక్క గ్లోబల్ స్మాల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (GSEV) ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించబడిన లేటెస్ట్ మోడల్.

ఎమ్‌జి మోటార్ ఈ బుజ్జి ఎలక్ట్రిక్ కారును భారత్‌కు తీసుకురాబోతోంది..!

ఈ డిజైన్ ప్లాట్‌ఫారమ్‌లో తయారు చేసిన మోడల్‌లు ఇప్పటికే పలు మార్కెట్లలో విక్రయించబడుతున్నాయి. అయితే, కంపెనీ భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇ230 మోడల్ ని సవరించి, కస్టమైజ్ చేస్తుంది. ముఖ్యంగా దీని బ్యాటరీ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పటిష్టం కానుంది. అలాగే, భారతదేశంలోని ఎయిర్ ఈవీకి MG బ్రాండ్ లోగోను చేర్చడంతో పాటుగా కొత్త పేరుతో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఎమ్‌జి మోటార్ ఈ బుజ్జి ఎలక్ట్రిక్ కారును భారత్‌కు తీసుకురాబోతోంది..!

పరిమాణంలో ఆల్టో కంటే చిన్నదిగా ఉంటుంది

ఎమ్‌జి మోటార్ నుండి రాబోయే ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు రూపకల్పన భవిష్యత్తుకు అనుగుణంగా ఉంటుంది. ఇది ఒక కాంపాక్ట్ మినీ ఎలక్ట్రిక్ కారు, దీని పరిమాణం మనదేశంలో అత్యధికంగా విక్రయించబడే మారుతి సుజుకి ఆల్టో కారు కంటే చిన్నదిగా ఉంటుంది. దీని పరిమాణం దాదాపు టాటా నానో మాదిరిగా ఉంటుంది. ఇదొక 2 సీటర్ ఎలక్ట్రిక్ కారు, అంటే ఇందులో ఇద్దరు వ్యక్తులకు మాత్రమే చోటు ఉంటుంది.

ఎమ్‌జి మోటార్ ఈ బుజ్జి ఎలక్ట్రిక్ కారును భారత్‌కు తీసుకురాబోతోంది..!

ఓ నివేదిక ప్రకారం, ఇ230 ఎలక్ట్రిక్ కారు పొడవు 2.9 మీటర్లుగా ఉంటుంది, ఇది ఆల్టో కంటే 400 మిమీ చిన్నది. ఎమ్‌జి ఈ కారును ప్రత్యేకంగా సిటీ మరియు షార్ట్ డిస్టెన్స్ రైడ్‌ల కోసం తయారు చేస్తోంది. రద్గాదీ ప్రాంతాలు మరియు నగరాల ట్రాఫిక్‌లో ఈ కారును నడపడం చాలా సులభం అవుతుంది. పరిమాణంలో చిన్నది కావడంతో దీని పార్కింగ్ కోసం చాలా తక్కువ స్థలం అవసరం అవుతుంది.

ఎమ్‌జి మోటార్ ఈ బుజ్జి ఎలక్ట్రిక్ కారును భారత్‌కు తీసుకురాబోతోంది..!

పూర్తి చార్జ్ పై 150 కిలోమీటర్ల రేంజ్

ఈ కారు 20kWh నుండి 25kWh వరకు బ్యాటరీ ప్యాక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మరియు ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 150 కిలోమీటర్ల రియల్ డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది. కాబట్టి, ఇది అర్బన్ మొబిలిటీకి చాలా చక్కటి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ పవర్ అవుట్‌పుట్ 40 హెచ్‌పిగా ఉంటుంది. ఎమ్‌జి మోటార్ ఇండియా టాటా ఆటోకాంప్ నుండి బ్యాటరీ ప్యాక్‌ను స్థానికంగా సోర్స్ చేస్తుంది. కాబట్టి, ఇ230 టాటా నెక్సాన్ ఈవీ మాదిరిగానే లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ (LFP) సెల్‌ను ఉపయోగిస్తుంది.

ఎమ్‌జి మోటార్ ఈ బుజ్జి ఎలక్ట్రిక్ కారును భారత్‌కు తీసుకురాబోతోంది..!

ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే ఈ బ్యాటరీ సెల్స్ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి మరియు భారతీయ పరిస్థితులకు బాగా సరిపోతాయి మరియు ఎంతో నమ్మదగినవి. నివేదికల ప్రకారం, MG E230లో ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), ఇంటర్నెట్ ఆఫ్ వెహికల్ (IOV), ఆటోమేటిక్ పార్కింగ్, వాయిస్ కమాండ్‌లు మరియు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లను కూడా కలిగి ఉండే అవకాశం ఉంది.

ఎమ్‌జి మోటార్ ఈ బుజ్జి ఎలక్ట్రిక్ కారును భారత్‌కు తీసుకురాబోతోంది..!

ధర రూ.10 లక్షల లోపే ఉంటుంది

ప్రస్తుతం, భారత మార్కెట్లో లభిస్తున్న ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారు ధరలు రూ.10 లక్షలకు పైగానే ఉన్నాయి. అయితే, ఎమ్‌జి మోటార్ ఈ చిన్న కారును సుమారు రూ.10 లక్షల కంటే తక్కువ ధరకే ఇక్కడి మార్కెట్లో విడుదల చేసినట్లయితే, దీని అగ్రెసివ్ ధర కారణంగా ఇది మార్కెట్లో మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉంది. సమాచారం ప్రకారం, కంపెనీ ఇ230ని రూ.7-10 లక్షల ధరతో విడుదల చేయవచ్చని అంచనా.

ఎమ్‌జి మోటార్ ఈ బుజ్జి ఎలక్ట్రిక్ కారును భారత్‌కు తీసుకురాబోతోంది..!

ఇదే గనుక నిజమైతే, ఇది ఈ ధర వద్ద భారతదేశంలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా నిలుస్తుంది. ప్రస్తుతం, భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు టాటా టిగోర్ ఈవీ. మార్కెట్లో టిగోర్ ఈవీ ధరలు రూ. 12 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. ఇ230 మినీ ఎలక్ట్రిక్ కారు కేవలం 5 సెకన్లలోనే గంటకు 0 నుండి 60 కిమీ వేగాన్ని అందుకోగలదు. కంపెనీ దీనిని ఎగుమతి చేయడంతోపాటు భారత్‌లో కూడా విక్రయించాలని ప్లాన్ చేస్తోంది.

Most Read Articles

English summary
Mg motor to bring e230 mini electric car to india soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X