ఆగస్ట్ 2022 నెలలో తగ్గిన ఎమ్‌జి కార్ల అమ్మకాలు.. కొత్తగా రానున్న చవక ఎలక్ట్రిక్ కారు, హెక్టర్ ఫేస్‌లిఫ్ట్!

చైనీస్ యాజమాన్యంలో ఉన్న బ్రిటీష్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ ఇండియా (MG Motor India), భారతదేశంలో ఓ స్థిరమైన బ్రాండ్‌గా కొనసాగుతోంది. గడచిన ఆగస్ట్ 2022 నెలలో ఈ కంపెనీ మొత్తం 3,823 యూనిట్ల వాహనాలను దేశీయ మార్కెట్లో విక్రయించింది.

Recommended Video

భారతీయ మార్కెట్లో 2022 Hyundai Tucson లాంచ్ | ఎప్పుడంటే?

ఇది జూలై 2022లో విక్రయించిన 4,013 యూనిట్లతో పోలిస్తే నెలవారీ అమ్మకాల ప్రాతిపదికన 4.74 శాతం తక్కువ.

ఆగస్ట్ 2022 నెలలో తగ్గిన ఎమ్‌జి కార్ల అమ్మకాలు.. కొత్తగా రానున్న చవక ఎలక్ట్రిక్ కారు, హెక్టర్ ఫేస్‌లిఫ్ట్!

ఎమ్‌జి మోటార్ ఇండియా అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణంగా సరఫరా గొలుసులలో నెలకొన్న అస్థిరత పరిస్థితులేనని, దీని ఫలితంగా తమ వాహనాల ఉత్పత్తి ప్రభావితం అయిందని, అయితే వచ్చే నెల నుండి మార్కెట్ పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని భావిస్తున్నామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఎమ్‌జి కార్ల నెలవారీ అమ్మకాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఈ బ్రాండ్ వాహనాలకు మాత్రం డిమాండ్ అధిక సంఖ్యలోనే ఉంటోంది.

ఆగస్ట్ 2022 నెలలో తగ్గిన ఎమ్‌జి కార్ల అమ్మకాలు.. కొత్తగా రానున్న చవక ఎలక్ట్రిక్ కారు, హెక్టర్ ఫేస్‌లిఫ్ట్!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఎమ్‌జి (మోరిస్ గ్యారేజెస్) తమ ఎలక్ట్రిక్ వెహికల్ పోర్ట్‌ఫోలియోను కూడా విస్తరించాలని చూస్తోంది. ప్రస్తుతం, ఈ కంపెనీ విక్రయిస్తున్నఎమ్‌జి జెడ్ఎస్ ఈవీకి దిగువన కొత్త మరియు సరసమైన ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త ఎమ్‌జి ఎలక్ట్రిక్ కారు 2022 చివరి భాగంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్ ధర రూ. 10-15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండొచ్చని అంచనా. ఈ ఏడాది చివరి నాటికి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ను కూడా విడుదల చేయాలని కంపెనీ చూస్తోంది.

ఆగస్ట్ 2022 నెలలో తగ్గిన ఎమ్‌జి కార్ల అమ్మకాలు.. కొత్తగా రానున్న చవక ఎలక్ట్రిక్ కారు, హెక్టర్ ఫేస్‌లిఫ్ట్!

కస్టమర్ల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి మరియు రాబోయే పండుగ నెలల దృష్ట్యా, కంపెనీ వివిధ కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. ఇందులో ఉత్పత్తుల స్థానికీకరణ మరియు కొత్త వేరియంట్‌ల పరిచయం మొదలైనవి ఉన్నాయి. ఎమ్‌జి మోటార్ ఇండియా ఇప్పటికే తమ కొత్త 2022 మోడల్ గ్లోస్టర్ (2022 MG Gloster) ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ కొత్త ప్రీమియం ఎస్‌యూవీ అప్‌డేటెడ్ ఫీచర్లు, డిజైన్ మరియు అధునాతన టెక్నాలజీతో పరిచయం చేయబడింది.

ఆగస్ట్ 2022 నెలలో తగ్గిన ఎమ్‌జి కార్ల అమ్మకాలు.. కొత్తగా రానున్న చవక ఎలక్ట్రిక్ కారు, హెక్టర్ ఫేస్‌లిఫ్ట్!

మార్కెట్లో కొత్త ఎమ్‌జి గ్లోస్టర్ ప్రారంభ ధర రూ. 31.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది మరియు ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 40.77 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కొత్త 2022 గ్లోస్టర్ ఎస్‌యూవీలో ఎక్ట్సీరియర్‌లో చేసిన మార్పులు స్వల్పంగానే ఉంటాయి. అయితే, ఇందులోని ప్రధాన మార్పులన్నీ కూడా దాని ఇంటీరియర్ లో చేయబడ్డాయి. ఎమ్‌జి గ్లోస్టర్ 6 సీట్లు మరియు 7 సీట్ల కాన్ఫిగరేషన్‌లో అందించబడుతుంది.

ఆగస్ట్ 2022 నెలలో తగ్గిన ఎమ్‌జి కార్ల అమ్మకాలు.. కొత్తగా రానున్న చవక ఎలక్ట్రిక్ కారు, హెక్టర్ ఫేస్‌లిఫ్ట్!

కొత్త 2022 ఎమ్‌జి గ్లోస్టర్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో సూపర్, షార్ప్ మరియు శావీ వేరియంట్లు ఉన్నాయి. ఈ కొత్త మోడల్ ఇప్పుడు i-SMART టెక్నాలజీని కలిగి ఉంటుంది, ఇది 75కి పైగా కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్లను అందిస్తుంది. కొత్త ఐ-స్మార్ట్ ఇంటెలిజెంట్ సిస్టమ్ సాయంతో వాహన యజమానులు తమ వాహనానికి సంబంధించిన వివిధ రకాల ఫీచర్లను మరియు దాని గణాంకాలను మరింత సులభంగా పర్యవేక్షించడానికి వారి హ్యాండ్‌హెల్డ్ పరికరాల ద్వారా (స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు మొదలైనవి) కారుకి రిమోట్ గా కనెక్ట్ కావడానికి మరియు వివిధ ఫీచర్లను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.

ఆగస్ట్ 2022 నెలలో తగ్గిన ఎమ్‌జి కార్ల అమ్మకాలు.. కొత్తగా రానున్న చవక ఎలక్ట్రిక్ కారు, హెక్టర్ ఫేస్‌లిఫ్ట్!

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ప్రస్తుతం 2.0L టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌తో రెండు రకాల ట్యూన్‌లలో అందుబాటులో ఉంది. గ్లోస్టర్ దాని విభాగంలోనే అత్యంత శక్తివంతమైన ఎస్‌యూవీలలో ఒకటి. ఇందులోని టూ-వీల్ డ్రైవ్ వేరియంట్ 160 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 375 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.0-లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. కాగా, ఫోర్-వీల్ డ్రైవ్ వేరియంట్ మరింత శక్తివంతమైన 2.0-లీటర్ ట్విన్-టర్బో ఇంజన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 215 బిహెచ్‌పి శక్తిని మరియు 2400 ఆర్‌పిఎమ్ వద్ద 480 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఆగస్ట్ 2022 నెలలో తగ్గిన ఎమ్‌జి కార్ల అమ్మకాలు.. కొత్తగా రానున్న చవక ఎలక్ట్రిక్ కారు, హెక్టర్ ఫేస్‌లిఫ్ట్!

ఈ ఇంజన్లు స్టాండర్డ్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. ఫోర్‌వీల్ డ్రైవ్ వేరియంట్ లో ఈ గేర్‌బాక్స్ ఇంజన్ నుండి వెలువడే శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది. కఠినమైన భూభాగాలపై సైతం సులువైన డ్రైవింగ్ కోసం ఇందులో ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్ కూడా ఉంటుంది. ఇంకా ఇందులో 4x4 (ఆల్-వీల్) డ్రైవింగ్, ఎకో, ఆటో, స్పోర్ట్ అనే డ్రైవ్ మోడ్స్ మరియు స్నో, మడ్, శాండ్, రాక్ అనే టెర్రైన్ మోడ్స్ కూడా ఉంటాయి.

ఆగస్ట్ 2022 నెలలో తగ్గిన ఎమ్‌జి కార్ల అమ్మకాలు.. కొత్తగా రానున్న చవక ఎలక్ట్రిక్ కారు, హెక్టర్ ఫేస్‌లిఫ్ట్!

ఈ ఎస్‌యూవీలోని ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఎమ్‌జి గ్లోస్టర్ ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లతో వస్తుంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ACC), ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB) మరియు ఆటోమేటిక్ పార్కింగ్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలైషన్ వార్నింగ్ (FCW), లేన్ డిపార్చర్ వార్నింగ్ (LDW) మరియు బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ (BSD) మొదలైనవి ఉన్నాయి.

ఆగస్ట్ 2022 నెలలో తగ్గిన ఎమ్‌జి కార్ల అమ్మకాలు.. కొత్తగా రానున్న చవక ఎలక్ట్రిక్ కారు, హెక్టర్ ఫేస్‌లిఫ్ట్!

ఇంకా ఇందులో పెద్ద 12.3 ఇంచ్ హెచ్‌డి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, సెగ్మెంట్-ఫస్ట్ కెప్టెన్ సీట్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, 360-డిగ్రీల సరౌండ్-వ్యూ కెమెరా సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, మసాజింగ్ సీట్లు, కూల్డ్ సీట్లు, PM2.5 ఎయిర్ ఫిల్టర్, ఆటో హెడ్‌లైట్లు, పవర్డ్ సీట్లు, ఆటో-డిమ్మింగ్ IRVM, హీటెడ్ ORVMలు మరియు పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Most Read Articles

English summary
Mg motor india sold 3823 units in august 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X