కొత్త 2023 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. ఈ ఎస్‌యూవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే..?

చైనీస్ యాజమాన్యంలో ఉన్న బ్రిటీష్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న హెక్టర్ ఎస్‌యూవీలో ఓ కొత్త 2023 మోడల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ కొత్త మోడల్ మరిన్ని కొత్త ఫీచర్లు మరియు ఆకర్షణీయమైన డిజైన్‌తో రాబోతోంది. కంపెనీ ఇప్పటికే ఈ కొత్త మోడల్‌కు సంబంధించిన అనేక వివరాలను వెల్లడి చేసింది. తాజాగా, కొత్త హెక్టర్ ఫీచర్ల వివరాలు కూడా వెల్లడయ్యాయి.

కొత్త 2023 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. ఈ ఎస్‌యూవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే..?

ఎమ్‌జి మోటార్ కంపెనీ తొలిసారిగా తమ హెక్టర్ ఎస్‌యూవీతో భారతదేశంలోకి ప్రవేశించింది. అప్పటి నుండి ఈ మోడల్ అత్యధికంగా అమ్ముడవుతోంది. ఈ 5-సీటర్ ఎస్‌యూవీ విజయం తర్వాత కంపెనీ ఇందులో పెద్ద 7-సీటర్ వెర్షన్‌ను హెక్టర్ ప్లస్ పేరుతో పరిచయం చేసింది. హెక్టర్ బ్రాండ్ విజయం భారతదేశంలో ఎమ్‌జి బ్రాండ్‌కు గట్టి పునాదులు వేసింది. మార్కెట్లో పెరుగుతున్న పోటీ మరియు ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎమ్‌జి మోటార్ ఇండియా కూడా తమ హెక్టర్‌ను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించుకుంది.

కొత్త 2023 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. ఈ ఎస్‌యూవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే..?

గడచిన సంవత్సరం ఎమ్‌జి మోటార్ ఇండియా తమ హెక్టర్ ఎస్‌యూవీని అప్‌గ్రేడ్ చేసినప్పటికీ, అందులో అప్‌డేట్స్ చాలా స్వల్పంగానే ఉన్నాయి. ఈ తేలికపాటి అప్‌డేట్‌లు కొనుగోలుదారులను ఎక్కువగా ఆకర్షించలేకపోయాయి. ఆ నేపథ్యంలో, కొత్తగా రాబోయే 2023 ఎమ్‌జి హెక్టర్ (2023 MG Hector) విషయంలో కంపెనీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. కొత్త ఫీచర్లు మరియు సరికొత్త డిజైన్ ట్వీక్స్‌తో కంపెనీ ఈ ఎస్‌యూవీని తీసుకురాబోతోంది. మరి ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ హెక్టర్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఏంటో చూద్దాం రండి.

కొత్త 2023 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. ఈ ఎస్‌యూవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే..?

2023 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ - ఎక్స్టీరియర్

కొత్త 2023 మోడల్ ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ డైమండ్-టైప్ మెష్ ప్యాటర్న్‌తో కూడిన పెద్ద గంభీరమైన ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉండి ఎక్కువ ప్రీమియం లుక్‌ని కలిగి ఉంటుంది. ఇది మునుపటి మోడల్ కన్నా విభిన్నంగా కనిపించేలా చేస్తుంది. ఇంకా ఇందులో రీపొజిషన్ చేయబడిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు, అప్‌డేట్ చేయబడిన టెయిల్ లైట్లు మొదలైన మార్పులు ఉన్నాయి. అయితే, హెక్టర్ ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మాత్రం అవుట్‌గోయింగ్ మోడల్‌తో సమానంగా ఉంటుంది.

కొత్త 2023 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. ఈ ఎస్‌యూవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే..?

2023 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ - ఇంటీరియర్

ఎమ్‌జి మోటార్ ఇండియా ఇప్పటికే కొత్త హెక్టర్ యొక్క అప్‌డేటెడ్ ఇంటీరియర్ చిత్రాలను వెల్లడి చేసింది. ఈ చిత్రాలను చూస్తే, కొత్త 2023 ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీ లోపలి భాగం అవుట్‌గోయింగ్ మోడల్ కంటే చాలా ఎక్కువ ప్రీమియం మరియు అధునాతనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్ డబుల్ లేయర్డ్ డిజైన్‌ను కలిగి ఉండి కొత్త D-ఆకారపు క్షితిజ సమాంతర ఏసి వెంట్‌లు క్యాబిన్ వెడల్పు మొత్తం కనిపిస్తాయి. ఇందులో కొత్త పోర్ట్రెయిట్-స్టైల్ (నిలువుగా అమర్చిన) 14 ఇంచ్ హెచ్‌డి ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ప్రత్యేకంగా నిలుస్తుంది. డ్యాష్‌బోర్డుపై తక్కువ బటన్లు, పూర్తి-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ మరియు యాంబియంట్ లైటింగ్ స్ట్రిప్స్‌తో పాత మోడల్ కన్నా చాలా అందంగా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది.

కొత్త 2023 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. ఈ ఎస్‌యూవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే..?

2023 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ - ADAS ఫీచర్లు

ఎమ్‌జి ఆస్టర్ మాదిరిగానే కొత్త ఎమ్‌జి హెక్టర్ కూడా అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ అడాస్ ఫీచర్లలో భాగంగా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, పార్కింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ మరియు రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్ వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

కొత్త 2023 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. ఈ ఎస్‌యూవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే..?

2023 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ - ఇతర ఫీచర్లు

ఫీచర్ల పరంగా, కొత్త 2023 ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీ భారతదేశంలో అత్యంత టెక్-లోడెడ్ కార్లలో ఒకటిగా ఉండనుంది. ఇందులో 360-డిగ్రీల సరౌండ్-వ్యూ కెమెరా, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, పవర్డ్ డ్రైవర్ సీట్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, మెరుగైన మ్యూజిక్ సిస్టమ్, టిల్ట్ మరియు టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, పానోరమిక్ సన్‌రూఫ్, మరిన్ని కలర్ ఆప్షన్‌లతో కూడిన యాంబియంట్ లైటింగ్, మెరుగైన అప్‌హోలెస్ట్రీ మరియు అధునాతన ఏఐ అసిస్టెంట్‌ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

కొత్త 2023 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. ఈ ఎస్‌యూవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే..?

2023 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ - ఇంజన్

కొత్త 2023 హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌లో కేవలం కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లు మాత్రమే ఉండనున్నాయి. ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం. ఇది మునుపటి మాదిరిగానే పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ వేరియంట్లలోని 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 141 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. కాగా, డీజిల్ వెర్షన్ లో శక్తివంతమైన 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 167.75 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది స్టాండర్డ్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

Most Read Articles

English summary
All you need to know about the new 2023 mg hector facelift suv launch expected soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X