కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ ఇంటీరియర్స్ వెల్లడి.. పెద్ద 14 ఇంచ్ టచ్‌స్క్రీన్, మూడ్ లైటింగ్ మరెన్నో..

చైనీస్ యాజమాన్యంలో బ్రిటీష్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ (MG Motor), తమ కొత్త 2022 హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీకి సంబంధించి తాజాగా మరో టీజర్‌ను విడుదల చేసింది.

Recommended Video

భారత్‌లో విడుదలైన Tata Nexon EV Max: పూర్తి వివరాలు

ఈ సారి కొత్త ఎమ్‌జి హెక్టర్ (2022 MG Hector Facelift) యొక్క ఇంటీరియర్ వివరాలను కంపెనీ వెల్లడి చేసింది.

కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ ఇంటీరియర్స్ వెల్లడి.. పెద్ద 14 ఇంచ్ టచ్‌స్క్రీన్, మూడ్ లైటింగ్ మరెన్నో..

మరికొద్ది రోజుల్లోనే విడుదల కానున్న కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ మునుపటి కన్నా మరింత ప్రీమియం లుకింగ్ క్యాబిన్ లేఅవుట్‌ని కలిగి ఉంటుందని ఈ లేటెస్ట్ ఇంటీరియర్ టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. డ్యాష్‌బోర్డ్ మధ్యలో నిలువుగా అమర్చిన పెద్ద టాబ్లెట్ పిసి లాంటి 14 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ప్రయాణీకుల మూడ్‌ని బట్టి మార్చుకునే యాంబియెంట్ లైటింగ్, డ్రైవర్ తన చేతులను స్టీరింగ్‌పై నుంచి తీయాల్సిన అవసరం లేకుండానే అనేక ఫీచర్లను కంట్రోల్ చేసేలా డిజైన్ చేసిన మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, వాయిస్ కమాండ్స్ కోసం డెడికేటెడ్ బటన్, అమేజాన్ అలెక్సా లేదా గూగుల్ వాయిస్ సపోర్ట్ వంటి అనేక అధునాతన ఫీచర్లు ఈ కొత్త హెక్టర్‌లో ఉండనున్నాయి.

కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ ఇంటీరియర్స్ వెల్లడి.. పెద్ద 14 ఇంచ్ టచ్‌స్క్రీన్, మూడ్ లైటింగ్ మరెన్నో..

సెంటర్ కన్సోల్‌లో ఉండే గేర్‌బాక్స్ మరియు దానికి ఇరువైపులా చక్కగా అమర్చిన స్విచ్ కంట్రోల్స్, గేర్‌బాక్స్ వెనుక భాగంలో కీఫాబ్ హోల్డర్ మరియు డీప్ పాకెట్ స్టోరేజ్ క్యూబీ హోల్, డ్యాష్‌బోర్డులో విశాలమైన గ్లవ్ బాక్స్, ప్రీమియం లుక్ కోసం కోసం డోర్ ట్రిమ్స్ మరియు డ్యాష్‌బోర్డుపై సిల్వర్ యాక్సెంట్స్, డ్యాష్‌బోర్డ్ అంతటా మద్యలో నిలువుగా ఉండే యాంబియెంట్ లైటింగ్ లైన్ మరియు స్టీరింగ్ వెనుక భాగంలో డ్రైవర్ సమాచారం కోసం పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఈ కొత్త 2022 హెక్టర్‌లో ఉన్నాయి. ఈ టీజర్‌లోని చిత్రాలను గమనిస్తుంటే, కొత్త హెక్టర్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లను కలిగి ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది.

కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ ఇంటీరియర్స్ వెల్లడి.. పెద్ద 14 ఇంచ్ టచ్‌స్క్రీన్, మూడ్ లైటింగ్ మరెన్నో..

కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్‌ లోపల అతిపెద్ద మార్పు పెద్ద 14 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే రూపంలో ఉంటుంది. ఈ కొత్త టచ్‌స్క్రీన్ యూనిట్ సెగ్మెంట్‌లోనే అతిపెద్దది మరియు నిలువుగా పేర్చబడి ఎస్‌యూవీ యొక్క డాష్‌బోర్డ్ మధ్యలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే టెక్నాలజీతో పాటుగా ఎమ్‌జి మోటార్ యొక్క స్వంత i-Smart కనెక్టింగ్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్-జెన్ హెక్టర్‌గా పిలువబడే ఈ ఎస్‌యూవీలో డ్యూయల్ టోన్ ఓక్ వైట్ అండ్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్‌ ఉంది.

కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ ఇంటీరియర్స్ వెల్లడి.. పెద్ద 14 ఇంచ్ టచ్‌స్క్రీన్, మూడ్ లైటింగ్ మరెన్నో..

ఇదివరకు ఎమ్‌జి మోటార్ ఇండియా విడుదల చేసిన హెక్టర్ టీజర్‌లో కంపెనీ దాని ఎక్స్టీరియర్ ప్రొఫైల్ చేసిన మార్పులను హైలైట్ చేసింది. ఈ టీజర్ లో కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీలో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ఫాసియా వివరాలను వెల్లడించింది. ఇందులో కొత్త గ్రిల్‌ కనిపిస్తుంది. కంపెనీ ఈ కొత్త గ్రిల్ డిజైన్ ను "ఆర్గైల్-ప్రేరేపిత డైమండ్ మెష్ గ్రిల్"గా ప్రచారం చేస్తోంది, ఇది ప్రస్తుతం హెక్టర్ మోడల్ లో అందిస్తున్న గ్రిల్ కంటే కొద్దిగా భిన్నంగా ఉంటుంది. కొత్త ఎక్స్టీరియర్ మార్పులతో రానున్న 2022 హెక్టర్ మునుపటి కన్నా మరింత గంభీరమైన రోడ్ ప్రజెన్స్ ని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ ఇంటీరియర్స్ వెల్లడి.. పెద్ద 14 ఇంచ్ టచ్‌స్క్రీన్, మూడ్ లైటింగ్ మరెన్నో..

అంతేకాకుండా, రాబోయే 2022 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, కొల్లైజన్ అలెర్ట్, లేన్-కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్లు కూడా ఉండనున్నాయి. కంపెనీ ఇప్పటికే ఈ తరహా ఫీచర్లను తమ గ్లోస్టర్ ప్రీమియం ఎస్‌యూవీ మరియు ఆస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలలో అందిస్తోంది. కాగా, ఇప్పుడు కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ ఈ బ్రాండ్ నుండి అడాస్ ఫీచర్లతో వస్తున్న మూడవ మోడల్ అవుతుంది.

కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ ఇంటీరియర్స్ వెల్లడి.. పెద్ద 14 ఇంచ్ టచ్‌స్క్రీన్, మూడ్ లైటింగ్ మరెన్నో..

కొత్త 2022 హెక్టర్ ఇతర ఫీచర్లలో 360-డిగ్రీ కెమెరా, పానోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రికల్ గా సర్దుబాటు చేయగల కో-డ్రైవర్ సీటు, 6-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, కీలెస్ ఎంట్రీ మరియు ఎనిమిది-స్పీకర్లతో కూడిన ప్రీమియం ఆడియో సిస్టమ్‌ మొదలైన ఫీచర్లు కూడా లభించనున్నాయి. కాగా, ఇంజన్ పరంగా ఇందులో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుత మోడళ్లలో ఉపయోగిస్తున్న అవే ఇంజన్ ఆప్షన్లను కంపెనీ ఈ కొత్త 2022 మోడల్ లో కూడా ఉపయోగించే అవకాశం ఉంది.

కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ ఇంటీరియర్స్ వెల్లడి.. పెద్ద 14 ఇంచ్ టచ్‌స్క్రీన్, మూడ్ లైటింగ్ మరెన్నో..

ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న ఎమ్‌జి హెక్టర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్లలో 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 143 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. కాగా, డీజిల్ వెర్షన్ లో శక్తివంతమైన 2.0-లీటర్ డీజిల్ యూనిట్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 170 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది స్టాండర్డ్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

Most Read Articles

English summary
Mg motor india teases new 2022 hector facelift interiors sports massive 14 inch touchscreen unit
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X