'సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌' ఇప్పుడు భారతీయ మార్కెట్లో విడుదలైంది.. ధర ఎంతో తెలుసా?

ఇప్పటికే భారతీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ 'సిట్రోయెన్' (Citroen) దేశీయ మార్కెట్లో తన కొత్త 'సి5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌' (C5 Aircross Facelift) విడుదల చేసింది. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్‌ ధర రూ. 36.67 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా). కంపెనీ యొక్క కొత్త కారుకి కొనుగోలు చేయాలనుకే కస్టమర్లు కంపెనీ యొక్క వెబ్‌సైట్ లో లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

Recommended Video

భార‌త్‌లో విడుదలైన Citroen C3 | ధర & వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త 'సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌ డిజైన్ మరియు ఇతర వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

'సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌' ఇప్పుడు భారతీయ మార్కెట్లో విడుదలైంది.. ధర ఎంతో తెలుసా?

భారతీయ మార్కెట్లో 'సి5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌' ఇప్పుడు కేవలం ఒకే వేరియంట్ లో మాత్రమే విడుదలైంది. అది సి5 ఎయిర్‌క్రాస్ షైన్‌ వేరియంట్. అయితే సాధారణ 'సి5 ఎయిర్‌క్రాస్' మాత్రం ఫీల్ మరియు షైన్ అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.

'సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌' ఇప్పుడు భారతీయ మార్కెట్లో విడుదలైంది.. ధర ఎంతో తెలుసా?

కొత్త C5 ఎయిర్‌క్రాస్ మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి పెర్ల్ వైట్, పెర్ల్ నెరా బ్లాక్, క్యుములస్ గ్రే మరియు ఎక్లిప్స్ బ్లూ. ఇందులో ఎక్లిప్స్ బ్లూ అనేది కొత్త కలర్ అప్సన్. ఇవన్నీ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి.

'సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌' ఇప్పుడు భారతీయ మార్కెట్లో విడుదలైంది.. ధర ఎంతో తెలుసా?

కంపెనీ విడుదల చేసిన కొత్త సి5 ఫేస్‌లిఫ్ట్‌ ఆకర్షణీయమైన డిజైన్ కలిగి అప్డేటెడ్ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇది డ్యూయెల్ టోన్ లో అందుబాటులో ఉంది. దీని ముందు భాగంలో బ్రాండ్ లోగో, ర్యాప్-అరౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ డిఆర్ఎల్ వంటివి ఉన్నాయి. ఈ కారు యొక్క బ్లాక్ గ్రిల్‌ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ లో 18 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌, వెనుక భాగంలో ఎల్ఈడీ లైట్ వున్నాయి. మొత్తం మీద ఈ కొత్త అప్డేటెడ్ మోడల్ అద్భుతమైన డిజైన్ పొందుతుంది.

'సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌' ఇప్పుడు భారతీయ మార్కెట్లో విడుదలైంది.. ధర ఎంతో తెలుసా?

సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌ యొక్క ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 12.3 ఇంచెస్ డిజిటల్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌కి ఆనుకుని క్యూబ్-ఆకారంలో ఉన్న AC వెంట్‌లు ఉన్నాయి. అంతే కాకూండా స్టాండర్డ్ గేర్ లివర్ స్థానంలో కొత్త టోగుల్ స్విచ్‌తో సెంటర్ కన్సోల్ కూడా కొంత అప్డేట్ చేయబడి ఉంది.

'సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌' ఇప్పుడు భారతీయ మార్కెట్లో విడుదలైంది.. ధర ఎంతో తెలుసా?

మునుపటి మోడల్ లో మాదిరిగానే ఈ అప్డేటెడ్ మోడల్ కూడా రెండవ వరుస ప్రయాణికుల కోసం ఇండియూజువల్ స్లైడింగ్, రిక్లైనింగ్ మరియు ముడుచుకునే సీట్లు ఉన్నాయి. సీట్లు, ఆర్మ్‌రెస్ట్‌లు మరియు సెంటర్ కన్సోల్‌ మొత్తమ్ కొత్త అపోల్స్ట్రే పొందుతాయి. వీటితోపాటు పవర్డ్ డ్రైవర్ సీట్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటివి కూడా ఉన్నాయి.

'సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌' ఇప్పుడు భారతీయ మార్కెట్లో విడుదలైంది.. ధర ఎంతో తెలుసా?

సిట్రోయెన్ సి5 ఫేస్‌లిఫ్టెడ్ 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌ పొందుతుంది. కావున ఇది 177 హెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. ఇది ఒక లీటరుకు 17.5 కిమీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.

'సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌' ఇప్పుడు భారతీయ మార్కెట్లో విడుదలైంది.. ధర ఎంతో తెలుసా?

సిట్రోయెన్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా మెల్లగా తన డీజిల్ ఇంజిన్ తొలగిస్తుంది. దీని స్థానంలో 1.5-లీటర్ డీజిల్ లేదా పెట్రోల్ లేదా పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్ ఎంపికలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే రానున్న రోజుల్లో భారతీయ మార్కెట్లో 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కంటిన్యూ చేసే అవకాశం ఉంది.

'సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌' ఇప్పుడు భారతీయ మార్కెట్లో విడుదలైంది.. ధర ఎంతో తెలుసా?

ఇక వారంటీ విషయానికి వస్తే, సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ కి 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిమీ వారంటీ లభిస్తుంది. అదే సమయంలో 24/7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌తో పాటు ఎక్స్టెన్షన్ వారంటీ కూడా అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ వాహన కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

'సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌' ఇప్పుడు భారతీయ మార్కెట్లో విడుదలైంది.. ధర ఎంతో తెలుసా?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో ఇప్పటికే సిట్రోయెన్ సి5 మరియు సి3 మైక్రో SUV అనే రెండు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు సిట్రోయెన్ సి5 ఫేస్‌లిఫ్ట్‌ మూడవ మోడల్ గా విడుదలైంది. ఇది తప్పకుండా మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము. అయితే ఇది దేశీయ మార్కెట్లో జీప్ కంపాస్, హ్యుందాయ్ టక్సన్ మరియు వోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
New citroen c5 aircross launched in india price features engine update details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X