ఇప్పుడే చూడండి: 2022 లో Nissan Magnite & Kicks కొత్త ధరలు వచ్చేశాయ్..

దేశీయ మార్కెట్లో దాదాపు అన్ని ప్రముఖ వాహన తయారీ సంస్థలు ఈ కొత్త సంవత్సరం 2022 లో తమ ఉత్పత్తుల ధరలను పెంచాయి భాగంగానే ఇప్పుడు నిస్సాన్ (Nissan) కంపెనీ తన నిస్సాన్ మాగ్నైట్ మరియు నిస్సాన్ కిక్స్ ధరలను కూడా పెంచినట్లు అధికారికంగా తెలిపింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఇప్పుడే చూడండి: 2022 లో Nissan Magnite & Kicks కొత్త ధరలు వచ్చేశాయ్..

నివేదికల ప్రకారం నిస్సాన్ ఇండియా తన నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) ధరను ఇప్పుడు గరిష్టంగా రూ. 9,500 పెంచగా, నిస్సాన్ కిక్స్ (Nissan Kicks) ధరలను ఇప్పుడు ఏకంగా రూ. 25,000 వరకు పెంచింది. ధరల పెరుగుదల తరువాత నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) ధర రూ. 5,76,500 చేరింది, అదే సమయంలో కంపెనీ యొక్క టాప్ వేరియంట్ ధర రూ. 9,98,000 వరకు ఉంది. నిస్సాన్ కంపెనీ ప్రస్తుతం ఈ రెండు మోడళ్లతో పాటు GT-R ని కూడా విక్రయిస్తోంది.

ఇప్పుడే చూడండి: 2022 లో Nissan Magnite & Kicks కొత్త ధరలు వచ్చేశాయ్..

నిస్సాన్ మాగ్నైట్ ప్రస్తుతం మొత్తం 10 వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులోని ఎక్స్ఈ, ఎక్స్ఎల్, ఎక్స్ఎల్ టర్బో, ఎక్స్ఎల్ టర్బో సివిటి వంటి వాటి ధరను రూ. 5,500 వరకు పెంచింది. కాగా అదే సమయంలో ఇందులోని XV, XV ప్రీమియం, XV టర్బో, XV ప్రీమియం టర్బో, XV టర్బో CVT మరియు XV ప్రీమియం టర్బో CVT ధర రూ. 9,000 వరకు పెంచింది.

ఇప్పుడే చూడండి: 2022 లో Nissan Magnite & Kicks కొత్త ధరలు వచ్చేశాయ్..

ఇక నిస్సాన్ కిక్స్ విషయానికి వస్తే, ఇందులోని బేస్ ఎక్స్ఎల్ 1.5 మరియు XV 1.5 వేరియంట్‌ల ధరలో ఎటువంటి మార్పు లేదు. ఇది మొత్తం 8 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. కానీ ఇందులోని టాప్-ఎండ్ 1.3 సివిటి వేరియంట్ ధర రూ. 25,000 పెరిగింది. ఈ కారణంగా దీని ధర రూ. 14,90,000 చేరింది. మొత్తానికి ధరల పెరుగుదల కంపెనీ యొక్క అమ్మకాలపైనే ఏమైనా ప్రభావం చూపుతుందా లేదా అనే విషయాలు త్వరలో తెలుస్తాయి.

ఇప్పుడే చూడండి: 2022 లో Nissan Magnite & Kicks కొత్త ధరలు వచ్చేశాయ్..

ఇదిలా ఉండగా నిస్సాన్ ఇండియా ఇటీవల తన 2021 డిసెంబర్ నెల అమ్మకాల నివేదికను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం నిస్సాన్ ఇండియా డిసెంబరు 2021 లో నిస్సాన్ మరియు డాట్సన్ బ్రాండ్‌ల మొత్తం 3,010 వాహనాల దేశీయ మార్కెట్లో విక్రయించినట్లు తెలిపింది. ఇందులో నిస్సాన్ యొక్క మాగ్నైట్ విజయవంతమైన మోడల్ గా నిలిచింది.

ఇప్పుడే చూడండి: 2022 లో Nissan Magnite & Kicks కొత్త ధరలు వచ్చేశాయ్..

ఇక కంపెనీ యొక్క ఎగుమతుల విషయానికి వస్తే, భారతీయ తీరాల నుండి 2021 సంవత్సరంలో మొత్తం 28,582 వాహనాలను ఎగుమతి చేసినట్లు నివేదికల ప్రకారం తెలుస్తోంది. అయితే, గత ఏడాది 2020 లో కంపెనీ మొత్తం 17,785 వాహనాలను ఎగుమతి చేసింది. ఎగుమతుల్లో కూడా కంపెనీ 61 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఇప్పుడే చూడండి: 2022 లో Nissan Magnite & Kicks కొత్త ధరలు వచ్చేశాయ్..

నిస్సాన్ మాగ్నైట్ యొక్క బుకింగ్‌లు ఇప్పటికి 75,567 యూనిట్లను దాటాయి. అంతే కాకుండా ఇప్పటికి కంపెనీ దాదాపు 30,000 యూనిట్లను డెలివరీ చేసింది. నిస్సాన్ మాగ్నైట్ కారణంగా కంపెనీ యొక్క అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఈ కారణంగా కంపెనీ అమ్మకాల వాటా కూడా పెరిగింది.

ఇప్పుడే చూడండి: 2022 లో Nissan Magnite & Kicks కొత్త ధరలు వచ్చేశాయ్..

ప్రస్తుతం భారత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ XE (బేస్), XL (మిడ్), XV (హై) మరియు XV (ప్రీమియం) అనే వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులోని ప్రతి వేరియంట్ కూడా న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. కాకపోతే, ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ మాత్రం అందుబాటులో లేదు. మాగ్నైట్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్‌ గేర్‌బాక్స్ తో లభిస్తుండగా, 1.0 టర్బో పెట్రోల్ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. నిస్సాన్ మాగ్నైట్‌ దేశీయ మార్కెట్లో 2020 డిసెంబర్ 02 న రూ. 4.99 లక్షల వద్ద విడుదలైంది.

ఇప్పుడే చూడండి: 2022 లో Nissan Magnite & Kicks కొత్త ధరలు వచ్చేశాయ్..

నిస్సాన్ మాగ్నైట్ 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ గరిష్టంగా 98.63 బిహెచ్‌పి పవర్‌ను మరియు 152 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీని మరియు ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 17.7 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అలాగే, 1.0 లీట్ న్యాచురల్ ఇంజన్ 72 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ లీటరుకు 18.75 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది.

ఇప్పుడే చూడండి: 2022 లో Nissan Magnite & Kicks కొత్త ధరలు వచ్చేశాయ్..

నిస్సాన్ నుండి వచ్చిన ఈ కాంపాక్ట్ SUV ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో లభిస్తున్న అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉంది. ఈ కారు కోసం ఇటీవల ASEAN NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో, నిస్సాన్ మాగ్నైట్ కు 5 స్టార్లకు గానూ 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఈ సేఫ్టీ రేటింగ్ కూడా నిస్సాన్ మాగ్నైట్ అమ్మకాల పెరుగుదలకు మరొక కారణంగా చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Nissan magnite kicks price hike upto rs 25000 details
Story first published: Wednesday, January 12, 2022, 12:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X