రెనో డస్టర్ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు రెనో అర్కానా (Renault Arkana) వస్తోంది.. ఇవిగో మొదటి ఫొటోలు..

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో (Renault) భారతదేశంలో ఓ కొత్త క్రాసోవర్ మోడల్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. రెనో అర్కానా (Renault Arkana) పేరుతో రానున్న ఈ సరికొత్త కూప్ టైప్ క్రాసోవర్ మోడల్ ను కంపెనీ ఇప్పటికే భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ఇటీవలే ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా రోడ్లపై టెస్టింగ్ చేయబడుతున్న రెనో అర్కానా కెమెరాకు చిక్కింది. దీన్నిబట్టి చూస్తుంటే, త్వరలోనే ఇది దేశీయ విపణిలో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

రెనో డస్టర్ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు రెనో అర్కానా (Renault Arkana) వస్తోంది.. ఇవిగో మొదటి ఫొటోలు..

గతంలో కంపెనీ ఆవిష్కరించిన రెనో అర్కానా టీజర్ ప్రకారం, కంపెనీ దీనిని ఈ నవంబర్ 2022 నెలలో భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. రెనో అర్కానా కారును కంపెనీ యొక్క పాపులర్ CMF-B (కామన్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్-బి) అనే ప్లాట్‌ఫామ్‌ పై నిర్మించబడుతుంది. ఇదే ప్లాట్‌ఫామ్ ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న క్విడ్, కైగర్ మోడళ్లు కూడా తయారవుతున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్ హైబ్రిడ్ టెక్నాలజీ మరియు ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ ను కూడా సపోర్ట్ చేస్తుంది.

రెనో డస్టర్ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు రెనో అర్కానా (Renault Arkana) వస్తోంది.. ఇవిగో మొదటి ఫొటోలు..

ప్రస్తుతం, రెనో ఇండియా ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో మూడు మోడళ్లు (క్విడ్, ట్రైబర్, కైగర్) మాత్రమే ఉన్నాయి. కంపెనీ ఇటీవలే తమ పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ డస్టర్ ను కూడా డిస్‌కంటిన్యూ చేసింది. ఈ నేపథ్యంలో, రెనో ఇండియా దేశీయ మార్కెట్లో బలంగా నిలబడాలంటే అంతే బలమైన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని కలిగి ఉండటం చాలా అవసరం. ఈ నేపథ్యంలో, రెనో తమ అర్కానా క్రాసోవర్ మోడల్ ను ఈ ఏడాది మార్కెట్లోకి తీసుకువచ్చి, తన ఉనికిని చాటుకోవాలని చూస్తోంది.

రెనో డస్టర్ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు రెనో అర్కానా (Renault Arkana) వస్తోంది.. ఇవిగో మొదటి ఫొటోలు..

రెనో ఆర్కానా గురించి కంపెనీ ఇంకా స్పష్టంగా ఏమీ చెప్పలేదు, అలాగని ఆ కారును తీసుకురావడాన్ని కూడా కంపెనీ తోసిపుచ్చలేదు. అటువంటి పరిస్థితిలో, కంపెనీ తన ప్లాట్‌ఫారమ్‌ను భారతీయ డ్రైవింగ్ పరిస్థితులకు అనుగుణంగా పరీక్షిస్తోందని, తద్వారా ఈ మోడల్ ను భారతీయ రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా సిద్ధం చేయగలదని భావిస్తున్నారు. అర్కానా కారును రెనో భారతదేశానికి తీసుకువచ్చినప్పటికీ, ప్రారంభంలో దానిని CBU (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) మోడల్ గా విక్రయించే అవకాశం ఉంది.

రెనో డస్టర్ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు రెనో అర్కానా (Renault Arkana) వస్తోంది.. ఇవిగో మొదటి ఫొటోలు..

రెనో అర్కానా డిజైన్ పరిశీలిస్తే, ఇది ఎక్కువ భాగం రెనో కాప్చప్ మోడల్ నుండి ప్రేరణ పొందినట్లుగా కనిపిస్తుంది. ఇందులోని C-ఆకారపు ఎల్ఈడి హెడ్‌లైట్ ఇప్పుడు అన్ని కొత్త రెనో మోడళ్లలో మాదిరిగానే కనిపిస్తుంది. ఈ కారులో వాలుగా ఉండే రూఫ్‌లైన్‌ ఉంటుంది, మొదటి చూపులో ఇది సెడాన్ అని భ్రమపడే అవకాశం ఉంటుంది. అయితే, ఈ కారులో ఎక్కువ బూట్ స్పేస్ ఉండదు, ఈ వాలుగా ఉండే రూఫ్ లైన్ వెనుక చక్రాన్ని దాటిన వెంటనే బూట్ తో కలుస్తున్నట్లుగా ఉంటుంది.

రెనో డస్టర్ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు రెనో అర్కానా (Renault Arkana) వస్తోంది.. ఇవిగో మొదటి ఫొటోలు..

ఇప్పటి వరకూ రెనో ఇండియా విక్రయించిన మోడళ్ల కన్నా రెనో అర్కానా పూర్తిగా భిన్నమైన డిజైన్ ను కలిగి ఉంటుంది. కంపెనీ ఈ కారుకు ఎస్‌యూవీ కూప్ లాంటి డిజైన్ ను అందించింది. వాస్తవానికి, రెనో అర్కానా ఇప్పటికే గ్లో మార్కెట్లలో విక్రయించబడుతోంది. రెనో ఆర్కానాలో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. దీని ఎంట్రీ లెవల్ మోడల్ 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో ఉంటుంది. ఇకపోతే, రెండవ ఇంజన్ 1.6-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్, ఇది ఇ-టెక్ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు మరియు ప్రత్యేకమైన మల్టీ-మోడ్ క్లచ్‌లెస్ గేర్‌బాక్స్ కూడా ఉంటుంది.

రెనో డస్టర్ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు రెనో అర్కానా (Renault Arkana) వస్తోంది.. ఇవిగో మొదటి ఫొటోలు..

రెనో అర్కానా కొలతలను గమనిస్తే, (అంతర్జాతీయ మోడల్ ప్రకారం) ఇది 4,545 మిమీ పొడవు, 1,820 మిమీ వెడల్పు, 1,565 మిమీ ఎత్తు మరియు 2,721 మిమీ వీల్‌బేస్‌ ను కలిగి ఉంటుంది. అలాగే, దీని గ్రౌండ్ క్లియరెన్స్ 208 మిమీ గా ఉంటుంది. ఈ కొలతల పరంగా చూస్తే, భారత మార్కెట్లో రెనో ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలోని డస్టర్ ఎస్‌యూవీ కంటే అర్కానా పెద్దదిగా ఉంటుంది.

రెనో డస్టర్ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు రెనో అర్కానా (Renault Arkana) వస్తోంది.. ఇవిగో మొదటి ఫొటోలు..

రెనో అర్కానా క్రాసోవర్ లోపలి భాగం చూడటానికి కొత్త తరం రెనో డస్టర్ ఎస్‌యూవీ మాదిరిగా కనిపిస్తుంది. ఇందులో Apple CarPlay మరియు Android Auto కనెక్టివిటీతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, ఈ కారులో పాటు, 9.3 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బోస్ ఆడియో సిస్టమ్ మరియు యాంబియంట్ కలర్ లైటింగ్‌ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

రెనో డస్టర్ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు రెనో అర్కానా (Renault Arkana) వస్తోంది.. ఇవిగో మొదటి ఫొటోలు..

సేఫ్టీ విషయానికి వస్తే, బహుళ ఎయిర్‌బ్యాగ్ లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, యాక్టివ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ వార్నింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ మరియు లేన్ గార్డ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా మొదలైనవి చాలానే ఉన్నాయి. గ్లోబల్ వెర్షన్ రెనో అర్కానా కారు ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ కూడా అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్లో అర్కానా క్రాసోవర్ రెనో డస్టర్ ఎస్‌యూవీని భర్తీ చేయగలదని భావిస్తున్నారు. భారత మార్కెట్లో ఈ కొత్త రెనో కారుకి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

చిత్ర సౌజన్యం: Ponsam Charles / Rushlane Spylane

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault arkana spotted testing in india without camouflage details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X