అత్యంత ఖరీదైన జర్మన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసిన 'జెనీలియా & రితీష్' జంట: ధర అక్షరాలా..

"అంతేనా.. ఇంకేమ్ కావాలి, వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ" ఈ డైలాగ్ దాదాపు తెలుగు ప్రేక్షలకులకు అందరికి గుర్తుంటుంది. ఎందుకంటే బొమ్మరిల్లి సినిమాలో హాసినిగా.. జెనీలియా అందరి మనసులు దోచేసింది. కాబట్టి జెనీలియా గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

రితీష్ దేశ్‌ముఖ్ తో వివాహం జరిగిన తరువాత తెలుగులో సినిమాలు చేయడం దాదాపు తగ్గించేసింది. అయితే ఇప్పుడు జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసి అత్యంత ఖరీదైన కారు కొనుగోలు చేసిన బాలీవుడ్ కపుల్స్ లో ఒకరుగా వార్తల్లో నిలిచారు. ఇంతకీ వారు కొనుగోలు చేసిన ఆ కొత్త కారు ఏది, దాని వివరాలు ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

'జెనీలియా & రితీష్' జంట కొన్న మైండ్ బ్లోయింగ్ ఎలక్ట్రిక్ కార్.. ఇదే

బాలీవుడ్ స్టార్ కపుల్ 'రితీష్ దేశ్‌ముఖ్ & జెనీలియా డిసౌజా' ఇటీవల వినాయక చవితి సందర్భంగా బిఎండబ్ల్యు బ్రాండ్ యొక్క ఎలక్ట్రిక్ కారుని కొనుగోలు చేశారు. ఈ బిఎండబ్ల్యు ఎలక్ట్రిక్ కారు ధర రూ. 1.4 కోట్లు. ఇది అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన లగ్జరీ కారు.

'జెనీలియా & రితీష్' జంట కొన్న మైండ్ బ్లోయింగ్ ఎలక్ట్రిక్ కార్.. ఇదే

జెనీలియా దంపతులు మాత్రమే కాకుండా వారి ఇద్దరు పిల్లలతో కలిసి అదే కారులో బాలీవుడ్ కండల వీరుడు సల్లూభాయ్ (సల్మాన్ ఖాన్) సోదరి అర్పితా ఖాన్ ఇంటికి గణపతి పూజ కోసం వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

'జెనీలియా & రితీష్' జంట కొన్న మైండ్ బ్లోయింగ్ ఎలక్ట్రిక్ కార్.. ఇదే

అర్పితా ఖాన్ ఇంట్లో గణపతి వేడుకలకు సంబంధించిన వీడియోలను సల్మాన్ ఖాన్ నేరుగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసాడు. ఈ వీడియోలో తన సోదరి, బావమరిది ఆయుష్ శర్మ, రితేష్ దేశ్ముఖ్ మొదలైన వారు వినాయకుడికి హారతి ఇవ్వడం కూడా గమనించవచ్చు.

'జెనీలియా & రితీష్' జంట కొన్న మైండ్ బ్లోయింగ్ ఎలక్ట్రిక్ కార్.. ఇదే

ఇప్పుడు జెనీలియా దంపతులు కొనుగోలుచేసి బిఎండబ్ల్యు ఎలక్ట్రిక్ కారు విషయానికి వస్తే, ఇది 'ఐఎక్స్' (BMW iX) ఎలక్ట్రిక్ కారు. దేశీయ మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.15 కోట్లు. భారతీయ మార్కెట్ కి ఈ కారు కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా దిగుమతి చేయబడుతుంది.

'జెనీలియా & రితీష్' జంట కొన్న మైండ్ బ్లోయింగ్ ఎలక్ట్రిక్ కార్.. ఇదే

బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ముందు భాగంలో సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్‌ ఉంటుంది మరియు ఇది ఫ్రంట్ డిజైన్ లో ఎక్కువ ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇంకా ఇందులో సన్నటి సొగసైన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, దీర్ఘచతురస్రాకారపు వీల్ ఆర్చ్‌లు, 21 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌, ఫ్రేమ్‌లెస్ విండోస్, ఈ ఎలక్ట్రిక్ కారును హైలైట్ చేసే బ్లూ డీటేలింగ్స్ మరియు సొగసైన సింగిల్-పీస్ టెయిల్‌లైట్‌లు వంటివి ఉన్నాయి.

'జెనీలియా & రితీష్' జంట కొన్న మైండ్ బ్లోయింగ్ ఎలక్ట్రిక్ కార్.. ఇదే

ఇంటీరియర్ విషయానికి వస్తే, దీని డ్యాష్‌బోర్డ్ లో ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంటుంది, ఇది వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో హెక్సాగోనల్ స్టీరింగ్ వీల్, మౌంటెడ్ కంట్రోల్స్, మసాజ్ ఫంక్షన్‌తో కూడిన మల్టీ-ఫంక్షన్ సీట్లు, 18-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, సరౌండ్-వ్యూ కెమెరా మరియు 500 లీటర్స్ బూట్ స్పేస్ లభిస్తుంది.

'జెనీలియా & రితీష్' జంట కొన్న మైండ్ బ్లోయింగ్ ఎలక్ట్రిక్ కార్.. ఇదే

భారత మార్కెట్లో BMW iX ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ xDrive40 అనే ఒక వేరియంట్లో మాత్రమే విడుదల చేయబడింది. ఇది 76.6kWh సామర్థ్యంతో కూడిన ట్విన్ బ్యాటరీ ప్యాక్ సెటప్ పొందుతుంది. ఇది రెండు యాక్సిల్స్ లో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్లకు శక్తిని పంపిణీ చేస్తుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిపి గరిష్టంగా 322 బిహెచ్‌పి పవర్ మరియు 630 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇందులోని సింగిల్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు బిఎమ్‌డబ్ల్యూ యొక్క ఎక్స్‌డ్రైవ్ (xDrive) ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్ల నుండి వచ్చే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేయబడుతుంది.

'జెనీలియా & రితీష్' జంట కొన్న మైండ్ బ్లోయింగ్ ఎలక్ట్రిక్ కార్.. ఇదే

బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ ఎక్స్‌డ్రైవ్40 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం 6.1 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు. ఇది ఒక ఫుల్ చార్జిపై గరిష్టంగా 425 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. కావున వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది.

'జెనీలియా & రితీష్' జంట కొన్న మైండ్ బ్లోయింగ్ ఎలక్ట్రిక్ కార్.. ఇదే

చార్జింగ్ విషయానికి వస్తే, స్టాండర్డ్ వాల్ ప్లగ్‌ల కోసం 2.3kW సింగిల్-ఫేజ్ ఛార్జర్‌ ను అందిస్తుండగా, ఫాస్ట్ చార్జింగ్ కోరుకునే వారి కోసం 11kW AC వాల్ బాక్స్ ఛార్జర్‌ ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారుని 2.3kW సింగిల్-ఫేజ్ ఛార్జర్‌ ద్వారా ఛార్జ్ చేయడానికి 36 గంటల సమయం పడుతుంది. అదే 11kW AC ఫాస్ట్ ఛార్జర్ సాయంతో అయితే కేవలం 7 గంటల వ్యవధిలోనే బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు. 50kW DC ఫాస్ట్ ఛార్జర్‌ సాయంతో చార్జ్ చేస్తే, కేవలం ఒక గంట 13 నిమిషాల్లోనే దాని బ్యాటరీని 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

'జెనీలియా & రితీష్' జంట కొన్న మైండ్ బ్లోయింగ్ ఎలక్ట్రిక్ కార్.. ఇదే

బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబిఎస్, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు స్టెబిలిటీ కంట్రోల్ వంటి అనేక సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

'జెనీలియా & రితీష్' జంట కొన్న మైండ్ బ్లోయింగ్ ఎలక్ట్రిక్ కార్.. ఇదే

ఇదిలా ఉండగా జెనీలియా ఈ సంవత్సరం ప్రారంభంలో, తన భర్త రితీష్‌కు పుట్టినరోజు గిఫ్ట్ గా 55 లక్షల విలువైన టెస్లా మోడల్ X ఆల్-ఎలక్ట్రిక్ SUV ని ఇచ్చింది. అయితే ఇప్పుడు వారు మరో లేటెస్ట్ ఎలక్ట్రిక్ SUV కొనుగోలు చేశారు. మొత్తమ్ మీద ఖరీదైన కార్లు కలిగిన జంటలో వీరు కూడా ఒకరుగా ఉన్నారు.

Most Read Articles

English summary
Riteish deshmukh genelia buys bmw ix electric car details
Story first published: Saturday, September 3, 2022, 15:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X