మళ్ళీ ప్రారంభమైన 'స్కోడా కొడియాక్' బుకింగ్స్.. పెరిగిన ధరలు

'స్కోడా' (Skoda) కంపెనీ యొక్క 'కొడియాక్' (Kodiaq) ఈ సంవత్సరం ప్రారంభంలో దేశీయ మార్కెట్లో విడుదలైన సంగతి తెలిసిందే. మార్కెట్లో విడుదలైన ఈ ప్రీమియం SUV కేవలం 24 గంటల్లో అమ్ముడైపోయి కొత్త రికార్డ్ సృష్టించింది. అయితే కంపెనీ అప్పట్లో బుకింగ్స్ స్వీకరించడం నిలిపివేసింది, కానీ ఇప్పుడు మళ్ళీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో చూద్దామ్.. రండి.

మళ్ళీ ప్రారంభమైన 'స్కోడా కొడియాక్' బుకింగ్స్.. ఇప్పుడు ప్రారభం ధర ఎంతంటే?

స్కోడా కంపెనీ ఈ SUV కోసం ఇప్పుడు మళ్ళీ బుకింగ్స్ ప్రారభించింది, కానీ ఇప్పుడు దీని ప్రారంభ ధర రూ. 37.49 లక్షలకు చేరింది. విడుదల సమయంలో దీని ప్రారంభ ధర రూ. 34.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ SUV ఇప్పుడు బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 50,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

మళ్ళీ ప్రారంభమైన 'స్కోడా కొడియాక్' బుకింగ్స్.. ఇప్పుడు ప్రారభం ధర ఎంతంటే?

స్కోడా కొడియాక్ కోడియాక్ మొత్తం మూడు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి స్టైల్, స్పోర్ట్‌లైన్ మరియు L&K వేరియంట్స్. ఇప్పుడు ఇందులోని స్పోర్ట్‌లైన్ వేరియంట్ ధర రూ. 38.49 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధర రూ. 39.99 లక్షలు.

మళ్ళీ ప్రారంభమైన 'స్కోడా కొడియాక్' బుకింగ్స్.. ఇప్పుడు ప్రారభం ధర ఎంతంటే?

కంపెనీ బుకింగ్స్ గురించి స్కోడా సీఈఓ 'జాక్ హోలిస్' మాట్లాడుతూ.. స్కోడా కొడియాక్ విలాసవంతమైన 4x4 మరియు ఫ్లాగ్‌షిప్ మోడల్. ఈ SUV భారతీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి ఆదరణ పొందింది. కావున అతి తక్కువ కాలంలోనే అన్నీ విక్రయించబడ్డాయి. అయితే ఇప్పుడు కూడా మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందుతుందని ఆశిస్తున్నామన్నారు.

మళ్ళీ ప్రారంభమైన 'స్కోడా కొడియాక్' బుకింగ్స్.. ఇప్పుడు ప్రారభం ధర ఎంతంటే?

స్కోడా కొడియాక్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో నిటారుగా ఉన్న గ్రిల్, ఎలివేటెడ్ బానెట్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్, రివైజ్ చేయబడిన హెడ్‌లైట్లు మరియు ట్వీక్ చేయబడిన ఫ్రంట్ బంపర్ వంటివి ఉన్నాయి. ఇది కొత్త అల్లాయ్ వీల్ డిజైన్ పొందుతుంది, అదే సమయంలో రియర్ ప్రొఫైల్ కొద్దిగా అప్‌డేట్ చేయబడి ఉంటుంది.

మళ్ళీ ప్రారంభమైన 'స్కోడా కొడియాక్' బుకింగ్స్.. ఇప్పుడు ప్రారభం ధర ఎంతంటే?

2022 స్కోడా కొడియాక్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,697 మిమీ, వెడల్పు 1,882 మిమీ మరియు ఎత్తు 1,665 మిమీ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

మళ్ళీ ప్రారంభమైన 'స్కోడా కొడియాక్' బుకింగ్స్.. ఇప్పుడు ప్రారభం ధర ఎంతంటే?

2022 స్కోడా కొడియాక్ యొక్క డ్యాష్‌బోర్డ్ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను పోలి ఉంటుంది. ఇది కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌ పొందుతుంది. ఇందులో 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటివి కూడా ఉన్నాయి.

మళ్ళీ ప్రారంభమైన 'స్కోడా కొడియాక్' బుకింగ్స్.. ఇప్పుడు ప్రారభం ధర ఎంతంటే?

2022 స్కోడా కోడియాక్ 2.0-లీటర్, ఫోర్-సిలిండర్ల టిఎస్ఐ టర్బో-పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 190 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ కొత్త SUV యొక్క అన్ని వేరియంట్లు కూడా స్టాండర్డ్‌గా ఆల్-వీల్ డ్రైవ్‌ను పొందుతాయి. ఈ కారు కేవలం 7.8 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది.

మళ్ళీ ప్రారంభమైన 'స్కోడా కొడియాక్' బుకింగ్స్.. ఇప్పుడు ప్రారభం ధర ఎంతంటే?

సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో హ్యాండ్స్-ఫ్రీ పార్కింగ్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్‌లు మరియు తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు వంటి మరిన్ని అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్దారిస్తాయి.

మళ్ళీ ప్రారంభమైన 'స్కోడా కొడియాక్' బుకింగ్స్.. ఇప్పుడు ప్రారభం ధర ఎంతంటే?

స్కోడా కంపెనీ ఎప్పటికప్పుడు దేశీయ మార్కెట్లో కొత్త వాహనాలను విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా మార్కెట్లో విడుదలైన స్కోడా సెలవియే కూడా కంపెనీకి మంచి అమ్మకాలను తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించింది. అంతే కాకుండా కంపెనీ ఇటీవల భారతీయ మార్కెట్లో 'స్కొడా కుషాక్ ఎన్ఎస్ఆర్' ని రూ.15.09 లక్షల వద్ద లాంచ్ చేసింది.ఇది కూడా కంపెనీ తప్పకుండా మంచి అమ్మకాలను తీసుకువస్తుందని ఆశిస్తున్నాము. ఎందుకంటే స్కోడా కుషాక్ కంపెనీ యొక్క అత్యధిక పాపులర్ బ్రాండ్.. కావున.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

స్కోడా కొడియాక్ మునుపటి మాదిరిగా ఇప్పుడు కూడా మంచి బుకింగ్స్ పొందుతుందని ఆశిస్తున్నాము. అయితే ఇప్పుడు దాని ప్రత్యర్థులైన జీప్ మెరిడియన్ మరియు సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ వంటి వాటికి గట్టీ పోటీ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ చూస్తూ ఉండండి.

Most Read Articles
https://telugu.drivespark.com/four-wheelers/2022/2022-hyundai-tucson-launched-in-india-price-features-engine-details-020677.html

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda kodiaq booking reopens new price features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X