పెరుగుతున్న డిమాండ్.. తిరుగులేని అమ్మకాలు: 2022 ఆగష్టు నెలలో భారీగా పెరిగిన టాటా మోటార్స్ అమ్మకాలు

భారతీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) 2022 ఆగష్టు నెల అమ్మకాల నివేదికలను ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ నివేదికల గణాంకాల ప్రకారం, కంపెనీ మార్కెట్లో 78,843 యూనిట్లను విక్రయించి అమ్మకాలతో మంచి వృద్ధిని నమోదు చేసినట్లు తెలిసింది.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

టాటా మోటార్స్ యొక్క గత నెల అమ్మకాల గురించి మరియు మునుపటి ఏడాది ఇదే నెలకంటే ఎంత ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

2022 ఆగష్టు అమ్మకాల్లో Tata Motors హవా.. ఇక తగ్గేదెలే

2022 ఆగష్టు నెలలో టాటా మోటార్స్ యొక్క ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 47,166 యూనిట్లు కాగా, టాటా ICE విక్రయాలు 43,321 యూనిట్ల వరకు ఉన్నాయి. అదే సమయంలో ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ 3,845 యూనిట్లు.

2022 ఆగష్టు అమ్మకాల్లో Tata Motors హవా.. ఇక తగ్గేదెలే

అమ్మకాల పరంగా టాటా మోటార్స్ 2021 ఆగష్టు కంటే కూడా 36 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇందులో టాటా ICE ప్యాసింజర్ వాహనాల అమ్మకాల వృద్ధి 60 శాతం కాగా, ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 276 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

Domestic Sales Performance
Category August 2022 August 2021 Growth (Y-o-Y)
Total Sales 76,479 54,190 41%
2022 ఆగష్టు అమ్మకాల్లో Tata Motors హవా.. ఇక తగ్గేదెలే

కంపెనీ దేశీయ మార్కెట్లో ప్యాసింజర్ వెహికల్స్ మరియు కమర్షియల్ వెహికల్స్ విభాగంలో 76,479 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఈ అమ్మకాలు కూడా 2021 ఆగస్టు నెలకంటే 41 శాతం పెరుగుదలను నమోదు చేశాయి.

Domestic Commercial Vehicles
Category August 2022 August 2021 Growth (Y-o-Y)
M&HCV 8,727 5,840 49%
I&LCV 4,106 4,627 -11%
Passenger Carriers 2,299 850 170%
SCV cargo and pickup 14,181 14,855 -5%
Total CV Domestic 29,313 26,172 12%
CV Exports 2,179 3,609 -40%
Total CV 31,492 29,781 6%
2022 ఆగష్టు అమ్మకాల్లో Tata Motors హవా.. ఇక తగ్గేదెలే

ఇక కమర్షియల్ వెహికల్ అమ్మకాల విషయానికి వస్తే, 2022 ఆగష్టు నెలలో 31,492 యూనిట్లు విక్రయించగా, 2021 ఆగష్టు నెలలో 29,781 యూనిట్లను విక్రయించగలిగింది. 2021 ఆగష్టు అమ్మకాల కంటే 2022 ఆగష్టు అమ్మకాలు 6 శాతంపెరిగాయి. అయితే ఇందులో 29,313 యూనిట్లు దేశీయ మార్కెట్లో విక్రయించగా, 2,179 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. మొత్తం మీద ఈ అమ్మకాలు మునుపటికంటే వృద్ధి చెందాయి.

Domestic Passenger Vehicles
Category June 2022 June 2021 Growth (Y-o-Y)
PV ICE 43,321 26,996 60%
PV EV 3,845 1,022 276%
Total PV Domestic 47,166 28,018 68%
2022 ఆగష్టు అమ్మకాల్లో Tata Motors హవా.. ఇక తగ్గేదెలే

టాటా ICE అమ్మకాలు 43,321 యూనిట్లకు చేరాయి. ఇది 2021 ఆగష్టు నెలలో 26,996 యూనిట్ల అమ్మకాలను పొందింది. వృద్ధిపరంగా గత ఏడాదికంటే కూడా 60 శాతం పెరుగుదల ఉంది. మొత్తం మీద టాటా మోటార్స్ యొక్క అమ్మకాలు గత కొన్ని నెలలుగా మంచి వృద్ధిని పొందుతున్నాయి.

2022 ఆగష్టు అమ్మకాల్లో Tata Motors హవా.. ఇక తగ్గేదెలే

అదే సమయంలో 3845 యూనిట్ల ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలు విక్రయించబడ్డాయి, ఇది గత 2021 ఆగస్టులో విక్రయించబడిన 1022 యూనిట్లతో పోలిస్తే 276% వృద్ధిని నమోదు చేసింది. 2022 ఆగష్టు నెలలో కంపెనీ యొక్క టాటా నెక్సాన్ మంచి అమ్మకాలు పొందింది. టాటా నెక్సాన్ కేవలం ఆగష్టు నెలలో మాత్రమే కాకూండా గత కొన్ని నెలలుగా మంచి అమ్మకాలు పొందుతున్న ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. రానున్న రోజుల్లో కూడా ఇది తప్పకుండా మరింత మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంది.

2022 ఆగష్టు అమ్మకాల్లో Tata Motors హవా.. ఇక తగ్గేదెలే

ఇదిలా ఉండగా టాటా మోటార్స్ భారత మార్కెట్లో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన పట్టును బలోపేతం చేసుకోవడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఎప్పటికప్పుడు దేశీయ మార్కెట్లో కొత్త కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూనే ఉంది. ఇటీవల కంపెనీ టాటా నెక్సాన్, సఫారీ మరియు హారియార్ లో జెట్ ఎడిషన్స్ విడుదల చేసింది. ఇవన్నీ కూడా ఆధునిక డిజైన్ కలిగి కొత్త కలర్ ఆప్సన్స్ తో చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా కంపెనీ యొక్క అమ్మకాలు మరింత దోహదపడతాయి.

2022 ఆగష్టు అమ్మకాల్లో Tata Motors హవా.. ఇక తగ్గేదెలే

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

గత కొంతకాలంగా దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ యొక్క అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం టాటా నెక్సాన్ మరియు టాటా పంచ్ యొక్క అమ్మకాలు. అయితే కంపెనీ రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను తీసుకురానుంది, ఇవన్నీ కంపెనీ యొక్క అమ్మకాలను పెంచడంలో దోహదపడతాయి.

Most Read Articles

English summary
Tata motors car sales august 2022 nexon punch details
Story first published: Thursday, September 1, 2022, 18:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X