Top Car News of The Week: మారుతి బాలెనొ, టాటా కజిరంగా ఎడిషన్స్, ఇంకా..
భారతీయ మార్కెట్లో గత వారంలో కొన్ని కొత్త కార్లు విడుదలయ్యాయి. ఇందులో టాటా మోటార్స్ యొక్క కజిరంగా ఎడిషన్స్, 2022 మారుతి బాలెనొ, మారుతి వ్యాగన్ ఆర్ మరియు మినీ కూపర్ ఎస్ఈ ఎలక్ట్రిక్ వంటి కార్లు ఉన్నాయి. ఈ కొత్త కార్లను గీయించి మరింత సమాచార ఈ ఒక్క ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

టాటా కజిరంగా ఎడిషన్స్ (Tata Kaziranga Editions) లాంచ్:
దేశీయ వాహన తయారీ దిగ్గజం అయిన 'టాటా మోటార్స్' (Tata Motors) తన SUV లైనప్‌లో కొత్త కజిరంగా ఎడిషన్‌లను విడుదల చేసింది. ఇందులో టాటా పంచ్ (Tata Punch), టాటా నెక్సాన్ (Tata Nexon), టాటా హారియర్ (Tata Harrier) మరియు టాటా సఫారి (Tata Safari) మోడల్స్ ఉన్నాయి. భారతీయ విఫణిలో విడుదలైన ఈ కొత్త మోడల్ ఆధునిక అప్డేట్స్ పొందుతాయి. వీటి ధరలు రూ.8.58 లక్షల నుంచి రూ.20.99 లక్షల వరకు ఉన్నాయి.

కంపెనీ విడుదల చేసిన నాలుగు SUV లు కజిరంగా నేషనల్ పార్క్ నుంచి ప్రేరణ పొందాయి. ఇవన్నీ కూడా ఈ వాతావరణంలో ఒక భాగంగా కలిసిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా లైట్ బీజ్ కలర్ లో ఉన్నాయి. అయితే ఇందులో రూప్, డోర్ హ్యాండిల్స్ మరియు ఓఆర్విఎమ్ వంటివి బ్లాక్ కలర్ లో ఉన్నాయి. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త మారుతి బాలెనో లాంచ్ (2022 Maruti Baleno) లాంచ్:
భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు మారుతి సుజుకి (Maruti Suzuki) కంపెనీ తన 2022 మారుతి బాలెనో (2022 Maruti Baleno) విడుదల చేసింది. ఈ కొత్త బాలెనో ప్రారంభ ధర రూ. 6.35 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). అయితే ఇందులోని టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 9.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇప్పటికే కంపెనీ ఈ మోడల్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కావున కొనుగోలుదారులు రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

కొత్త మారుతి బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో అప్డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబటులో ఉన్నాయి. 2022 మారుతి బాలెనో సిగ్మా, డెల్టా, డెల్టా (AMT), జీటా, జీటా (AMT), ఆల్ఫా, మరియు ఆల్ఫా (AMT) అనే వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

'మినీ కూపర్ ఎస్ఇ' (MINI Cooper SE) ఎలక్ట్రిక్ లాంచ్:
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మినీ ఇండియా (MINI India) దేశీయ మార్కెట్లో 'మినీ కూపర్ ఎస్ఇ' (MINI Cooper SE) ఎలక్ట్రిక్ కారుని విడుదల చేసింది. 'మినీ కూపర్ ఎస్ఇ' అనేది కంపెనీ భారతీయ మార్కెట్లో విడుదల చేసిన మొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర రూ. 47.20 లక్షలు.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'మినీ కూపర్ ఎస్ఇ' (MINI Cooper SE) బుకింగ్స్ కూడా కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది. కావున డెలివరీలు త్వరలోనే ప్రారంభిస్తుంది. త్వరలో కంపెనీ కొత్త బ్యాచ్ యొక్క బుకింగ్‌లను కూడా ప్రారంభించే అవకాశం ఉంటుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క మొదటి బ్యాచ్‌లో కేవలం 30 యూనిట్లను మాత్రమే చేర్చింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి రూ. 1 లక్ష అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. మొదటి బ్యాచ్‌లోని మొత్తం 30 యూనిట్లు కేవలం 2 గంటల్లోనే బుక్ అయ్యాయి. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR) లాంచ్:
మారుతి సుజుకి (Maruti Suzuki) కంపెనీ భారతీయ మార్కెట్లో తన కొత్త 2022 వ్యాగన్ఆర్ (WagonR) హ్యాచ్‌బ్యాక్ విడుదల చేసింది. 'మారుతి సుజుకి వ్యాగన్ఆర్' (Maruti Suzuki WagonR) బేస్ వేరియంట్ అయిన 'ఎల్‌ఎక్స్‌ఐ' ధర రూ. 5.39 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). అయితే ఇందులోని టాప్-ఎండ్ మోడల్ 'జెడ్‌ఎక్స్‌ఐ+' వేరియంట్ ధర రూ. 7.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'మారుతి సుజుకి వ్యాగన్ఆర్' (Maruti Suzuki WagonR) ఇప్పుడు మరింత అద్భుతమైన మరియు సమర్థవంతమైన 1.0-లీటర్ మరియు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లను పొందుతుంది. అంతే కాకూండా ఇందులోని CNG అనేక రకాల వేరియంట్‌లలో అందించబడుతుంది, ఆటోమేటిక్స్ అదనపు భద్రతా ఫీచర్‌లను కూడా పొందుతాయి. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) డీటైల్స్:
చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా (Skoda) తమ ప్రస్తుత వెంటో (Vento) సెడాన్ స్థానాన్ని రీప్లేస్ చేస్తూ, వర్త్యుస్ (Virtus) అనే కొత్త సెడాన్ ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కంపెనీ ఈ టీజర్ ను కూడా విడుదల చేసింది. ఈ టీజర్ ప్రకారం, కొత్త ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) ను కంపెనీ మార్చి 8, 2022 వ తేదీన అధికారికంగా ఆవిష్కరించనుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








