బాలీవుడ్ స్టార్ 'షారుఖ్ ఖాన్' వద్ద ఉన్న టాప్-5 కార్లు: వివరాలు

షారుఖ్ ఖాన్.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ సినీ పరిశ్రమలో బాగా పాపులర్ అయిన ఈ నటుడు అత్యంత ఖరీదైన కార్లను బైకులను కలిగి ఉన్నారని చాలామందికి తెలుసు. అయితే షారుఖ్ ఖాన్ వద్ద 5 టాప్ కార్లను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్ హెడ్ కూప్:

ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్ల తయారీ సంస్థ అయిన రోల్స్ రాయిస్ యొక్క 'ఫాంటమ్ డ్రాప్ హెడ్ కూప్' షారుఖ్ ఖాన్ గ్యారేజిలో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ కార్ల విక్రయాలు నిలిపివేయబడ్డాయి. ఈ విలాసవంతమైన కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీని ధర విడుదల సమయంలో సుమారు రూ.7 కోట్లు. సెలబ్రిటీలకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేయాలంటే, దాని ధర మరింత పెరుగుతుంది.

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ వద్ద ఉన్న టాప్-5 కార్లు

కావున దీని ధర రూ. 7 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే సెడాన్ లో 6.75 లీటర్, ట్విన్ టర్బో, V12 ఇంజన్ ఉంటుంది. ఇది 462 బిహెచ్‌పి పవర్ మరియు 750 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కి జత చేయబడి ఉంటుంది. ఇది అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.

బెంట్లీ కాంటినెంటల్ జిటి:

ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన మరియు శక్తివంతమైన కార్లను తయారు చేసే కంపెనీలలో బెంట్లీ కూడా ఒకటి. ఈ కంపెనీ యొక్క కాంటినెంటల్ జిటి కారు షారుఖ్ ఖాన్ వద్ద ఉంది. ఈ మోడల్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారిలో షారుఖ్ ఖాన్ కూడా ఒకరు. ఇదొక టూ-డోర్ కూప్ మోడల్. బెంట్లీ కాంటినెంటల్ జిటి 2-డోర్ కూప్ మోడల్ శక్తివంతమైనన 4.0-లీటర్ ట్విన్-టర్బో వి8 పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది.

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ వద్ద ఉన్న టాప్-5 కార్లు

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్:

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయినా బిఎండబ్ల్యు యొక్క 7-సిరీస్ కారు కూడా షారుఖ్ ఖాన్ గ్యారేజిలో ఉంది. ఇది మంచి ఏరోడైనమిక్ డిజైన్ మరియు విలావసవంతమైన ఇంటీరియర్ ఫీచర్లతో రూపొందించబడిన ఒక అద్భుతమైన లగ్జరీ సెడాన్. షారూఖ్ ఖాన్ వద్ద 7-సిరీస్ మోడల్ యొక్క పెట్రోల్ వేరియంట్ అయిన 760 ఎల్ఐ ఉన్నట్లు సమాచారం. ఇది 6.0-లీటర్, ట్విన్-టర్బో, V12 ఇంజన్‌తో 550 బిహెచ్‌పి పవర్ మరియు 750 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

టొయోటా ల్యాండ్ క్రూయిజర్:

టొయోటా కంపెనీ భారతదేశంలో విక్రయించే ల్యాండ్ క్రూయిజర్ కూడా షారుఖ్ ఖాన్ వద్ద ఉంది. ఇది అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ తో చూడగానే ఆకర్షించే విధంగా ఉంది. ఇది 4.5-లీటర్, V8 డీజిల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఇంజిన్ 283 బిహెచ్‌పి మరియు 650 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది చాలా పటిష్టమైన 4WD డ్రైవ్‌ట్రైన్‌తో వస్తుంది, కావున అత్యంత కఠినమైన భూభాగాలలో కూడా హుందాగా దూసుకెళ్తుంది.

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ వద్ద ఉన్న టాప్-5 కార్లు

ఆడి ఏ8 ఎల్:

షారుఖ్ ఖాన్ గ్యారాజ్‌లోని మరో జర్మన్ బ్రాండ్ కారు ఆడి ఏ8 ఎల్. ఇది ఆడి కంపెనీ అందిస్తున్న కార్లలో కెల్లా అత్యంత విశాలమైనది మరియు విలాసవంతమైనది. ఈ కారు ఓ చిన్నసైజు లీమోజైన్ మాదిరిగా అనిపిస్తుంది. ఆడి ఏ8 ఎల్ దేశంలోని అనేక ప్రముఖ సెలబ్రిటీలను ఆకర్షించింది. షారూఖ్ ఖాన్ వద్ద డీజిల్ వెర్షన్ ఆడి ఏ8 ఎల్ మోడల్‌ ఉన్నట్లు సమాచారం. ఇది 4.2 లీటర్ వి8 డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది.

ఆడి ఏ8 ఎల్ 4.2-లీటర్, టర్బోచార్జ్డ్, V8 ఇంజిన్ పొందుతుంది. ఇది 381 బిహెచ్‌పి పవర్ మరియు 850 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. పైన చెప్పిన ఈ కార్లు మాత్రమే కాకుండా షారుఖ్ ఖాన్ వద్ద బిఎమ్‌డబ్ల్యూ ఐ8, బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ కన్వర్టిబల్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్, మిత్సుబిషి పాజెరో మరియు హ్యుందాయ్ క్రెటా వంటివి కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
Top five luxury cars owned by shah rukh khan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X