Just In
- 1 hr ago
సిట్రోయెన్ సి3 హ్యాచ్‌బ్యాక్‌లో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, త్వరలోనే విడుదల!
- 2 hrs ago
కైనెటిక్ స్కూటర్లు తిరిగొస్తున్నాయ్.. అయితే ఈసారి ఎలక్ట్రిక్ రూపంలో వస్తున్నాయ్..!
- 2 hrs ago
స్వాతంత్య్ర దినోత్సవం రోజున 5 ఎలక్ట్రిక్ కార్లు ఆవిష్కరించిన మహీంద్రా.. లాంచ్ మరియు ఇతర వివరాలు
- 15 hrs ago
దేశీయ మార్కెట్లో ఓలా విడుదల చేసిన ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరిపోలా..!!
Don't Miss
- News
కమ్మ కోటల్లో బీసీలకు టికెట్లు: సంప్రదాయానికి భిన్నంగా టీడీపీ
- Movies
Karthikeya 2 day 3 collections.. హిందీలో అరాచకంగా కలెక్షన్లు.. అమీర్, అక్షయ్‌ను మించి రికార్డు కలెక్షన్లు
- Finance
NO Debt Stock: మల్టీబ్యాగర్ రాబడులిచ్చిన హైదరాబాద్ ఫార్మా స్టాక్.. పైగా అస్సలు అప్పు లేని కంపెనీ..
- Technology
భారత్‌లో అత్యంత ఖరీదైన Xiaomi మొబైల్ ఇదే.. ధర తెలిస్తే షాకే!
- Lifestyle
గర్భంతో ఉండి కూల్ డ్రింకులు తాగేస్తున్నారా! వామ్మో.. ఇది చదవాల్సిందే!
- Sports
సూర్య ఏబీడీ లాంటోడు.. నేనైతే ఓపెనర్‌గా ఆడించను: రికీ పాంటింగ్
- Travel
ఫ్లయింగ్ రెస్టారెంట్లో రుచులు ఆస్వాదించాలని ఎవరికుండదు చెప్పండి!
టొయోటా గ్లాంజా ధరల పెంపు.. ఏయే వేరియంట్ పై ఎంత ధర పెరిగిందంటే..
జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా (Toyota) ఈ ఏడాది మార్చ్ నెలలో తమ ఫేస్‌లిఫ్టెడ్ 2022 గ్లాంజా (2022 Glanza) హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. ఆ సమయంలో కంపెనీ ఈ కారును రూ.6.39 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేసింది. అయితే, విడుదల సమయంలో ధరలతో పోలిస్తే, ఇప్పుడు టొయోటా గ్లాంజా ధరలు వేరియంట్ ను బట్టి రూ.20,000 నుండి రూ.29,000 వరకూ పెరిగాయి. తాజా ధరల పెరుగుదల తర్వాత కొత్త 2022 టొయోటా గ్లాంజా ధరలు రూ.6.59 లక్షల నుండి రూ.9.98 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్)లో ఉన్నాయి.
వేరియంట్ల వారీగా కొత్త టొయోటా గ్లాంజా ధరలు ఇలా ఉన్నాయి:
* 2022 టొయోటా గ్లాంజా ఇ (మ్యాన్యువల్) - రూ. 6.59 లక్షలు
* 2022 టొయోటా గ్లాంజా ఎస్ (మ్యాన్యువల్) - రూ. 7.48 లక్షలు
* 2022 టొయోటా గ్లాంజా ఎస్ (ఆటోమేటిక్) - రూ. 7.98 లక్షలు
* 2022 టొయోటా గ్లాంజా జి (మ్యాన్యువల్) - రూ. 8.51 లక్షలు
* 2022 టొయోటా గ్లాంజా జి (ఆటోమేటిక్) - రూ. 9.01 లక్షలు
* 2022 టొయోటా గ్లాంజా వి (మ్యాన్యువల్) - రూ. 9.51 లక్షలు
* 2022 టొయోటా గ్లాంజా వి (ఆటోమేటిక్) - రూ. 9.98 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్. ఆగస్ట్ 8, 2022 నాటికి)

ధరల పెంపు మినహా కంపెనీ ఈ కొత్త మోడల్ గ్లాంజాలో ఎలాంటి మార్పులు చేయలేదు. మరియు ధరల పెరుగుదలకు గల కారణాన్ని కూడా కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కొత్త 2022 మోడల్ ఇయర్ టొయోటా గ్లాంజా E, S, G, V అనే నాలుగు ట్రిమ్‌లలో మొత్తం ఏడు వేరియంట్లలో విడుదల చేయబడింది. ఈ నాలుగు ట్రిమ్‌లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో లభిస్తాయి. అలాగే, E ట్రిమ్ మినహా మిగిలిన S, G, V ట్రిమ్‌లు మూడు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి.

టొయోటా గ్లాంజా హ్యాచ్‌బ్యాకు మారుతి సుజుకి బాలెనో యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్ అని మనందరికీ తెలిసినదే. మారుతి సుజుకి ఈ ఏడాది ఆరంభంలో తమ కొత్త 2022 బాలెనో కారుని విడుదల చేసిన కొద్ది రోజులకే టొయోటా కూడా కొత్త 2022 గ్లాంజా కారును విడుదల చేసింది. కొత్త 2022 బాలెనో మాదిరిగానే ఈ కొత్త 2022 గ్లాంజా కూడా కాస్మెటిక్ అప్‌డేట్స్‌తో పాటుగా కొన్ని ఫీచర్ అప్‌డేట్‌లను కూడా కలిగి ఉంది.

ముందుగా దీని ఎక్స్టీరియర్‌లో చేసిన మార్పులను గమనిస్తే, టొయోటా గ్లాంజా కారులో క్రోమ్ బార్‌తో గార్నిష్ చేసిన సన్నటి ఫ్రంట్, కొత్త బంపర్, రివైజ్డ్ ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, సి-ఆకారపు క్రోమ్ ఇన్‌సర్ట్‌లతో కప్పబడిన ఫాగ్ ల్యాంప్‌లు మొదలైన మార్పులు ఉన్నాయి. ముందు వైపు చేసిన ఈ కాస్మెటిక్ మార్పులతో కొత్త గ్లాంజ్ ఇప్పుడు మునుపటి కన్నా మరింత అందంగా మరియు కొత్తగా కనిపిస్తుంది. ఇందులో కొత్త హెడ్‌ల్యాంప్ యూనిట్ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో పాటుగా ప్రొజెక్టర్ హెడ్‌లైట్లను కలిగి ఉంటుంది.

ఇంకా ఇందులో కొత్త 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, వెనుక వైపు కొత్త బంపర్ డిజైన్ మరియు వ్రాప్అరౌండ్ ఎల్ఈడి టెయిల్ లైట్స్ ఉన్నాయి. ఈ టెయిల్ లైట్స్ చూడటానికి కొత్త 2022 బాలెనో కారులో కనిపించినట్లుగానే ఉంటాయి. ఇంటీరియర్ అప్‌గ్రేడ్స్ విషయానికి వస్తే, ఇందులో హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఫ్లోటింగ్ 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, వాయిస్ అసిస్టెంట్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లెథర్ వ్రాప్డ్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు 45 కనెక్టెడ్ ఫీచర్లు మొదలైనవి ఉన్నాయి.

టొయోటా గ్లాంజా కొత్త మోడల్ లో కంపెనీ కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ మినగా ఎలాంటి మెకానికల్ అప్‌గ్రేడ్స్ చేయలేదు. ఇది మారుతి సుజుకి బాలెనో కారులో ఉపయోగించే అదే పెట్రోల్ ఇంజన్ మరియు గేర్‌బాక్స్ లను కలిగి ఉంటుంది. ఇందులోని 1.2 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 89 bhp శక్తిని మరియు 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 5 స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

మైలేజ్ విషయానికి వస్తే, కొత్త 2022 టొయోటా గ్లాంజా మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 22.35 కిలోమీటర్ల మైలేజీని మరియు ఏఎమ్‌టి వెర్షన్ లీటరుకు 22.94 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని సర్టిఫై చేయబడింది. కంపెనీ 2022 గ్లాంజాపై 5 సంవత్సరాల లేదా 2.2 లక్షల కిమీ పొడిగించిన వారంటీని కూడా అందిస్తోంది. టొయోటా గ్లాంజా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో హ్యుందాయ్ ఐ20, హోండా జాజ్, ఫోక్స్‌వ్యాగన్ పోలో, టాటా ఆల్ట్రోజ్ మరియు మారుతి సుజుకి బాలెనో వంటి కార్లకు పోటీగా నిలుస్తుంది.