భారతదేశంలో ప్రత్యక్షమైన కుడిచేతి డ్రైవింగ్ టొయోటా ల్యాండ్ క్రూయిజర్.. మరి లాంచ్ ఎప్పుడో..?

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా భారత మార్కెట్లో మరో ప్రీమియం ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇటీవలై హైరైడర్ (Toyota Hyryder) అనే హైబ్రిడ్ ఎస్‌యూవీని విడుదల చేసిన టొయోటా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన తమ ల్యాండ్ క్రూయిజర్ (Land Cruiser) ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ ఎస్‌యూవీ దాని ప్రారంభానికి ముందే కెమెరాకు చిక్కింది. ఎలాంటి క్యామోఫ్లేజ్ మరియు నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న టొయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్‌సి300 (Toyota Land Cruiser LC300) భారతదేశంలో కనిపించింది.

భారతదేశంలో ప్రత్యక్షమైన కుడిచేతి డ్రైవింగ్ టొయోటా ల్యాండ్ క్రూయిజర్.. మరి లాంచ్ ఎప్పుడో..?

అంతేకాకుండా, కెమెరాకు చిక్కిన ఈ టొయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్‌‌సి300 రైట్-హ్యాండ్-డ్రైవ్ (RHD) రూపంలో సహారా జెడ్ఎక్స్ వేరియంట్ కావడం విశేషం. దీన్నిబట్టి చూస్తుంటే, భారత మార్కెట్లో ఈ లగ్జరీ ఎస్‌యూవీ విడుదల ఎంతో దూరంలో లేదని తెలుస్తోంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న టొయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్‌సి300కి ఎలాంటి నంబర్ ప్లేట్లు లేవు, అంటే దీనర్థం, ఈ ఎస్‌యూవీ ఒక టెస్టింగ్ వాహనం లేదా డెమో వాహనం కాదు. ఇది పూర్తిగా దిగుమతి చేసుకున్న వాహనంగా తెలుస్తోంది.

భారతదేశంలో ప్రత్యక్షమైన కుడిచేతి డ్రైవింగ్ టొయోటా ల్యాండ్ క్రూయిజర్.. మరి లాంచ్ ఎప్పుడో..?

టొయోటా నుండి రాబోయే ఈ ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీ తమిళనాడులోని కోయంబత్తూర్‌లో గుర్తించబడింది. కోయంబత్తూర్ కేవలం ఆతిథ్యానికి మాత్రమే కాకుండా దాని గొప్ప రేసింగ్ వారసత్వానికి కూడా ప్రసిద్ధి చెందిన నగరం. అంతేకాదు, ఈ నగరం భారతదేశపు మొట్టమొదటి ఫార్ములా 1 రేసింగ్ డ్రైవర్ మిస్టర్ నరైన్ కార్తికేయన్‌కు కూడా నిలయం. ఇంతకు ముందు, టొయోటా భారతదేశంలో ల్యాండ్ క్రూయిజర్ ఎల్‌సి 300 ఎస్‌యూవీ కోసం బుకింగ్‌లను తెరిచింది, అయితే, ఈ ఎస్‌యూవీకి వచ్చిన భారీ డిమాండ్ కారణంగా త్వరలో బుకింగ్స్ మూసివేయబడ్డాయి.

భారతదేశంలో ప్రత్యక్షమైన కుడిచేతి డ్రైవింగ్ టొయోటా ల్యాండ్ క్రూయిజర్.. మరి లాంచ్ ఎప్పుడో..?

తాజా నివేదికల ప్రకారం, టొయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్‌సి300 యొక్క మొదటి బ్యాచ్ ఇప్పటికే పూర్తిగా విక్రయించబడింది. టొయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్‌సి300 ఎస్‌యూవీకి ప్రపంచ వ్యాప్తంగా బలమైన డిమాండ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇంత ఎక్కువ డిమాండ్ ఉన్నందున, టొయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్‌సి300 కోసం కొన్ని దేశాల్లో వెయిటింగ్ పీరియడ్ 4 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఈ ఎస్‌యూవీని సొంతం చేసుకునేందుకు ఒత్సాహికులు ఎంత కాలమైనా వేచి ఉండేందుకు సిద్దంగా ఉంటారు.

భారతదేశంలో ప్రత్యక్షమైన కుడిచేతి డ్రైవింగ్ టొయోటా ల్యాండ్ క్రూయిజర్.. మరి లాంచ్ ఎప్పుడో..?

ఇక టొయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్‌సి300 విషయానికి వస్తే, ఈ మోడల్ ఇప్పుడు దాని ఆరవ తరంలో ఉంది. గడచిన ఐదు తరాలుగా వచ్చిన ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీలు కూడా దాని కస్టమర్ల గుండెల్లో చెరగని ముద్రను వేశాయి. ఈ కొత్త తరం మోడల్ 2,850 మిమీ వీల్‌బేస్‌తో దాని మునుపటి తరం మోడల్‌తో సమానంగా ఉంటుంది. పరిమాణంలో రెండూ ఒకేలా ఉన్నప్పటికీ, వాటి డిజైన్, ఫీచర్లు మరియు టెక్నాలజీలో ఈ ఆరవ తరం మోడల్ ఎంతో అధునాతనంగా ఉంటుంది. అయితే, ల్యాండ్ క్రూయిజర్ ఎల్‌సి300 ల్యాండ్ క్రూయిజర్ ఎల్‌సి200 కంటే 10 మిమీ తక్కువ వెడల్పు మరియు 5 మిమీ తక్కువ పొడవును కలిగి ఉంటుంది.

భారతదేశంలో ప్రత్యక్షమైన కుడిచేతి డ్రైవింగ్ టొయోటా ల్యాండ్ క్రూయిజర్.. మరి లాంచ్ ఎప్పుడో..?

కొత్త టొయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్‌సి300 దాని మునుపటి తరం మోడళ్ల కాస్తంత పెద్దగా ఉండటంతో పాటుగా, ఈ కొత్త మోడల్ అనేక ఎలక్ట్రానిక్స్ మరియు సేఫ్టీ అసిస్టెన్స్ ఫీచర్లతో ప్యాక్ చేయబడింది. ఈ లగ్జరీ ఎస్‌యూవీని కొత్త GA-F ప్లాట్‌ఫారమ్‌ పై తయారు చేశారు. అంతేకాకుండా, ఈ కొత్త ప్లాట్‌ఫారమ్‌ ని ఉపయోగించడం ద్వారా, టొయోటా దాని ముందున్న మోడల్ తో పోలిస్తే కొత్త ల్యాండ్ క్రూయిజర్ ఎల్‌సి300 యొక్క బరువును భారీగా తగ్గించి, మొత్తం బరువు పంపిణీని బాగా మెరుగుపరచగలిగింది.

భారతదేశంలో ప్రత్యక్షమైన కుడిచేతి డ్రైవింగ్ టొయోటా ల్యాండ్ క్రూయిజర్.. మరి లాంచ్ ఎప్పుడో..?

పవర్‌ట్రెయిన్ ఆప్షన్ల పరంగా కూడా ఇది అప్‌గ్రేడ్ అయింది. టొయోటా ఈ ఎస్‌యూవీలో ఇదివరకు అందించిన పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్లను తొలగించింది మరియు వాటి స్థానంలో ఇప్పుడు రెండు కొత్త V6 ఇంజన్ లను పరిచయం చేసింది. ఇందులో కొత్త 3.5-లీటర్, టర్బోచార్జ్డ్ వి6 పెట్రోల్ ఇంజన్ 409.32 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 650 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, 3.3-లీటర్ టర్బోచార్జ్డ్ వి6 డీజిల్ ఇంజన్ 305 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 700 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్ ఆప్షన్లు కూడా స్టాండర్డ్ 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ తో జతచేయబడి ఉంటాయి. వీటిలో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉండదు.

భారతదేశంలో ప్రత్యక్షమైన కుడిచేతి డ్రైవింగ్ టొయోటా ల్యాండ్ క్రూయిజర్.. మరి లాంచ్ ఎప్పుడో..?

ఇక ఫీచర్ల విషయానికొస్తే, టొయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్‌సి300 ఎస్‌యూవీలో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన పెద్ద 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మూన్‌రూఫ్, హీటెడ్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఛార్జింగ్, హీటెడ్ మరియు వెంటిలేటెడ్ సీట్లు, 4-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టిపుల్ USB ఛార్జింగ్ పోర్ట్‌లు, 14-స్పీకర్లతో కూడిన JBL ప్రీమియం ఆడియో సిస్టమ్ తో మరెన్నో అధునాతన కంఫర్ట్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. మరిన్ని లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Toyota land cruiser lc300 landed in india launch expected soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X