జగమంతా CNG మయం.. నిన్న గ్లాంజా CNG, త్వరలో హైరైడర్ CNG.. అప్పుడే బుకింగ్స్ కూడా స్టార్ట్

దేశీయ విఫణిలో CNG కార్లకు పెరుగుతున్న ఆదరణ కారణంగా చాలా వాహన తయారీ సంస్థలు దీని వైపే అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే మారుతి సుజుకి మరియు టొయోట వంటి కంపెనీ CNG కార్లను విడుదల చేయడానికి మరింత ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగానే మారుతి సుజుకి బాలెనొ CNG ని, టయోట కంపెనీ గ్లాంజా CNG ని విడుదల చేశాయి.

కాగా ఇప్పుడు టయోటా మరో SUV ని CNG వెర్షన్ లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ CNG వెర్షన్ కోసం కంపెనీ అప్పుడే బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

CNG వెర్షన్‌లో విడుదల కానున్న టయోటా హైరైడర్.. ఇప్పుడే బుకింగ్స్ స్టార్ట్: మరిన్ని వివరాలు

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, తన కొత్త అర్బన్ క్రూయిజర్ హైరైడర్ SUV ని CNG వెర్షన్ లో విడుదల చేయనుంది. అయితే కంపెనీ ఈ CNG వెర్షన్ కోసం రూ. 25,000 చెల్లించి ఆన్‌లైన్‌లో లేదా అధీకృత డీలర్‌షిప్‌లో బుక్ చేసుకోవచ్చని తెలిపింది. కాగా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ CNG మిడ్ సైజ్ SUV విభాగంలో మొదటి CNG బేస్డ్ మోడల్ అవుతుంది.

CNG వెర్షన్‌లో విడుదల కానున్న టయోటా హైరైడర్.. ఇప్పుడే బుకింగ్స్ స్టార్ట్: మరిన్ని వివరాలు

మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 1.5 లీ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ మరియు CNG వెర్షన్‌తో కూడిన 1.5 లీటర్ పెట్రోల్‌తో సహా 3 పవర్‌ట్రెయిన్ ఆప్సన్లతో అందించబడే సెగ్మెంట్‌లోని మొదటి మోడల్ ఇదే అవుతుంది. హైరిడర్ CNG వెర్షన్ లో 1.5 లీటర్ K15C, 4-సిలిండర్ ఇంజన్‌తో అందించబడే అవకాశం ఉంటుంది.

CNG వెర్షన్‌లో విడుదల కానున్న టయోటా హైరైడర్.. ఇప్పుడే బుకింగ్స్ స్టార్ట్: మరిన్ని వివరాలు

కంపెనీ ఇంకా Hyryder CNG యొక్క పవర్ మరియు టార్క్ గణాంకాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ CNG మోడ్‌లో 88 బిహెచ్‌పి పవర్ మరియు 121.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే పెట్రోల్ మోడ్‌లో ఇది 101 బిహెచ్‌పి పవర్ మరియు 137 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 26.10 కిమీ/కేజీ మైలేజ్ అందించే అవకాశం ఉంది.

CNG వెర్షన్‌లో విడుదల కానున్న టయోటా హైరైడర్.. ఇప్పుడే బుకింగ్స్ స్టార్ట్: మరిన్ని వివరాలు

టొయోట హైరిడర్ CNG రెండు ట్రిమ్స్ లో అందుబాటులోకి రానుంది. అవి S మరియు G ట్రిమ్స్. ఇందులో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో కనెక్టెడ్ కార్ టెక్, యాంబియంట్ ఇంటీరియర్ లైటింగ్ వంటివి ఉన్నాయి.

CNG వెర్షన్‌లో విడుదల కానున్న టయోటా హైరైడర్.. ఇప్పుడే బుకింగ్స్ స్టార్ట్: మరిన్ని వివరాలు

ఇక ఇప్పటికే మార్కెట్లో ఉన్న కొత్త హైరైడర్ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ SUV ప్రారంభ ధరలు రూ. 15.11 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కాగా, టాప్ వేరియంట్ ధర రూ 18.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది.

CNG వెర్షన్‌లో విడుదల కానున్న టయోటా హైరైడర్.. ఇప్పుడే బుకింగ్స్ స్టార్ట్: మరిన్ని వివరాలు

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీని పొందిన మొదటి మిడ్-సైజ్ SUV. ఇది టొయోటా యొక్క 1.5-లీటర్ TNGA అట్కిన్సన్ సైకిల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 92 హెచ్‌పి పవర్ మరియు 122 న్యూటన్ మీటర్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఇందులో 79 హెచ్‌పి పవర్ మరియు 141 న్యూటన్ మీటర్ టార్క్‌ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడి ఉంటుంది.

CNG వెర్షన్‌లో విడుదల కానున్న టయోటా హైరైడర్.. ఇప్పుడే బుకింగ్స్ స్టార్ట్: మరిన్ని వివరాలు

హైరైడర్ మారుతి సుజుకి నుండి మైల్డ్-హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ను కూడా పొందుతుంది. కావున ఇందులో 1.5-లీటర్ K15C ఇంజిన్‌ కూడా ఉంటుంది. ఇది 103 హెచ్‌పి పవర్ మరియు 137 న్యూటన్ మీటర్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

CNG వెర్షన్‌లో విడుదల కానున్న టయోటా హైరైడర్.. ఇప్పుడే బుకింగ్స్ స్టార్ట్: మరిన్ని వివరాలు

టయోట గ్లాంజా సిఎన్‌జి:

ఇదిలా ఉండగా టయోటా దేశీయ మార్కెట్లో కొత్త గ్లాంజా సిఎన్‌జి విడుదల చేసింది. ఈ కొత్త CNG వెర్షన్ వెర్షన్ రెండు ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి S మరియు G ట్రిమ్స్. వీటి ధరలు వరుసగా రూ. 8.43 లక్షలు మరియు రూ. 9.46 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

CNG వెర్షన్‌లో విడుదల కానున్న టయోటా హైరైడర్.. ఇప్పుడే బుకింగ్స్ స్టార్ట్: మరిన్ని వివరాలు

టొయోట గ్లాంజా CNG అదే 1.2 లీటర్, ఫోర్ సిలిండర్ ఇంజన్‌తో అందించబడుతోంది. మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న చాలా CNG మోడల్స్ మాదిరిగానే ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. అయితే పెట్రోల్ మోడ్‌లో గ్లాంజా 90 హెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే CNG మోడ్‌లో పవర్ అవుట్‌పుట్ 77 హెచ్‌పి మరియు 98.5 ఎన్ఎమ్ వరకు ఉంటుంది. అయితే ఇది ఒక కేజీ CNG కి 30.61 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

Most Read Articles

English summary
Toyota urban cruiser hyryder cng will launch soon in india bookings open details
Story first published: Thursday, November 10, 2022, 17:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X