భారతీయ విఫణిలో మరో 15 రోజుల్లో విడుదలయ్యే కొత్త కార్లు.. వాటి వివరాలు

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమకు రానున్న 15 రోజులు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే విజయదశమి మరియు దీపావళి వంటి పండుగలు వెంట వెంటనే వచ్చేస్తున్నాయి. విజయదశమి సందర్భంగా చాలామంది కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి, టాటా మోటార్స్, బివైడి, ఎంజి మోటార్ మరియు టయోటా కిర్లోస్కర్ మోటార్ వంటి కంపెనీలు కొత్త కార్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి.

దేశీయ మార్కెట్లో ఈ కంపెనీలు విడుదల చేయనున్న కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. రండి.

భారతీయ విఫణిలో మరో 15 రోజుల్లో విడుదలయ్యే కొత్త కార్లు.. వాటి వివరాలు

బీవైడీ (అటో 3):

చైనాకి చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ బివైడి తన కొత్త 'అటో 3' ఎలక్ట్రిక్ SUV ని 2022 అక్టోబర్ 11 న విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం, ఈ బ్రాండ్ దేశీయ మార్కెట్లో బివైడి ఇ6 (BYD e6) అనే ఎలక్ట్రిక్ కారును విక్రయిస్తోంది.

భారతీయ విఫణిలో మరో 15 రోజుల్లో విడుదలయ్యే కొత్త కార్లు.. వాటి వివరాలు

భారత మార్కెట్లో బివైడి ఇ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి యొక్క ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 29.15 లక్షలుగా ఉంది. అయితే కంపెనీ త్వరలోనే అటో 3 తో తన పరిధిని మరియు ఉనికిని మరింత పెంచుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన సమాచారం త్వరలోనే వెల్లడవుతుంది.

భారతీయ విఫణిలో మరో 15 రోజుల్లో విడుదలయ్యే కొత్త కార్లు.. వాటి వివరాలు

మారుతి సుజుకి (గ్రాండ్ విటారా):

ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి తన గ్రాండ్ విటారాను ఇప్పటికే అధికారికంగా ఆవిష్కరించింది. అయితే ఇంకా ధరలను వెల్లడించలేదు. కావున త్వరలోనే కంపెనీ ఈ SUV ని విడుదల చేస్తుంది. ఆ సమయంలోనే ధరలు కూడా అధికారికంగా వెల్లడిస్తుంది.

భారతీయ విఫణిలో మరో 15 రోజుల్లో విడుదలయ్యే కొత్త కార్లు.. వాటి వివరాలు

మారుతి సుజుకి ఇంకా గ్రాండ్ విటారా ధరలను వెల్లడించనప్పటికీ.. బేస్ వేరియంట్ ధర రూ. 9.5 లక్షలు మరియు టాప్ వేరియంట్ ధర రూ. 19.5 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఈ SUV కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది, ఇప్పటికే దాదాపు 53,000 కంటే ఎక్కువ బుకింగ్స్ కూడా పొందింది. ఇది ఈ పండుగ సీజన్ లో తప్పకుండా విడుదలవుతుంది.

భారతీయ విఫణిలో మరో 15 రోజుల్లో విడుదలయ్యే కొత్త కార్లు.. వాటి వివరాలు

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. అవి మైల్డ్ హైబ్రిడ్ మరియు స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్లు. ఇందులోని మైల్డ్ హైబ్రిడ్ 1.5 లీటర్ 4 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇవి రెండూ కూడా మంచి పనితీరుని అందిస్తాయి.

భారతీయ విఫణిలో మరో 15 రోజుల్లో విడుదలయ్యే కొత్త కార్లు.. వాటి వివరాలు

ఎంజి మోటార్ (హెక్టర్ ఫేస్‌లిఫ్ట్):

భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీగా అవతరించిన ఎంజి మోటార్ ఇండియా, త్వరలో తన హెక్టర్ లో ఫేస్లిఫ్టెడ్ వెర్షన్ ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికీ దీనికి సంబంధించిన చాలా టీజర్ లో విడుదలయ్యాయి, అంతే కాకూండా టెస్టింగ్ సమయంలో కూడా చాలా సార్లు గుర్తించబడింది. కావున ఇది త్వరలోనే మార్కెట్లో విడుదలవుతుంది.

భారతీయ విఫణిలో మరో 15 రోజుల్లో విడుదలయ్యే కొత్త కార్లు.. వాటి వివరాలు

ఎంజి హెక్టర్ ఫేస్లిఫ్టెడ్ వెర్షన్ ఆధునిక డిజైన్ కలిగి కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. కావున ఇందులో 14 ఇంచెస్ పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫో టైన్మెంట్ సిస్టమ్ వంటి వాటితోపాటు కొత్త టెక్నాలజీలను కూడా పొందనుంది. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవవుతాయి.

భారతీయ విఫణిలో మరో 15 రోజుల్లో విడుదలయ్యే కొత్త కార్లు.. వాటి వివరాలు

టాటా మోటార్స్ (టియాగో ఈవి):

భారతీయ ఎలక్ట్రిక్ వాహనావిభాగంలో ముందువరుసలో ఉన్న టాటా మోటార్స్ ఇప్పుడు 'టియాగో' ను కూడా ఎలక్ట్రిక్ విభాగంలో విడుదల చేయడానికి సిద్ధమైంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుని 2022 సెప్టెంబర్ 28 న మార్కెట్లో ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇది కంపెనీ యొక్క అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ వాహనం కానుంది.

భారతీయ విఫణిలో మరో 15 రోజుల్లో విడుదలయ్యే కొత్త కార్లు.. వాటి వివరాలు

టాటా టియాగో అనేది కంపెనీ యొక్క టిగోర్ కంటే కూడా మంచి పనితీరుని అందించే విధంగా రూపొందించే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త ఎలక్ట్రిక్ కారులో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్ మొదలైన వాటిని గురించి కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు. ఇవన్నీ కంపెనీ త్వరలోనే వెల్లడిస్తుంది.

భారతీయ విఫణిలో మరో 15 రోజుల్లో విడుదలయ్యే కొత్త కార్లు.. వాటి వివరాలు

టయోటా (అర్బన్ క్రూయిజర్ హైరైడర్):

టొయోట కంపెనీ యొక్క ఆధునిక SUV అయిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ధరలను ఇటీవలే వెల్లడించింది. అయితే కేవలం నీలుడు వేరియంట్స్ ధరలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి, కాగా మిగిలిన వేరియంట్స్ ధరలు వెల్లడి కావాలి. ఇవి మరో 15 రోజుల లోపు వెల్లడయ్యే అవకాశం ఉంది.

భారతీయ విఫణిలో మరో 15 రోజుల్లో విడుదలయ్యే కొత్త కార్లు.. వాటి వివరాలు

దేశీయ విఫణిలో కొత్త హైరైడర్ ప్రారంభ ధరలు రూ. 15.11 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కాగా, టాప్ వేరియంట్ ధర రూ 18.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. ఇది మొత్తం 11 కలర్ ఆప్సన్స్ లో విడుదలైంది. ఇందులో 7 మోనోటోన్ కలర్స్ కాగా, మిగిలిన నాలుగు డ్యూయెల్ టోన్ కలర్స్. టయోటా హైరైడర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

భారతీయ విఫణిలో మరో 15 రోజుల్లో విడుదలయ్యే కొత్త కార్లు.. వాటి వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి చాలా కంపెనీలు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. అయితే ఇందులో ఏ మోడల్ మంచి ఆదరణ పొందుతుంది, మోడల్ విఫలమవుతుందో తెలియదు. అయితే కొత్త ఉత్పత్తులు కాబట్టి తప్పకుండా అన్నీ మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Upcoming cars launch for the festive season in india details
Story first published: Saturday, September 24, 2022, 13:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X