కొత్త కారు కొనడానికి వెళ్తున్నారా..? ఒక్క నిమిషం ఆగండి, త్వరలో రాబోయే ఈ సిఎన్‌జి కార్లపై ఓ లుక్కేయండి!

భారతదేశంలో కొత్త కాలుష్య ఉద్గార నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత, డీజిల్ కార్ల వినియోగం భారీగా తగ్గిపోయింది. మరోవైపు, ఈ కొత్త నిబంధనల కారణంగా డీజిల్ ఇంజన్ల తయారీ కూడా ఖరీదైనదిగా మారడంతో తయారీదారులు కూడా డీజిల్ కార్ల తయారీని గణనీయంగా తగ్గించాయి. మారుతి సుజుకి వంటి కంపెనీలైతే పూర్తిగా డీజిల్ కార్ల తయారీని నిలిపివేశాయి. మైలేజ్‌కి ప్రాధాన్యతనిచ్చే మనదేశంలో డీజిల్ కార్ల వినియోగం తగ్గడంతో తయారీదారులు మరియు కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ ఇంధనమైన సిఎన్‌జి (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) వైపు దృష్టి సారించారు.

కొత్త కారు కొనడానికి వెళ్తున్నారా..? ఒక్క నిమిషం ఆగండి, మరికొద్ది రోజుల్లో రాబోయే ఈ సిఎన్‌జి కార్లపై ఓ లుక్కేయండి!

ఈ నేపథ్యంలో, అధిక మైలేజ్‌ను కోరుకునే వినియోగదారులు ఇప్పుడు డీజిల్ కార్లకు బదులుగా సిఎన్‌జి కార్లను ఎంచుకుంటున్నారు. దీంతో దేశంలో సిఎన్‌జి కార్ల లభ్యత కూడా భారీగా పెరిగింది. పెరుగుతున్న ఇంధన డిమాండ్‌కు అనుగుణందా చమురు కంపెనీలు కూడా దేశవ్యాప్తంగా అనేక కొత్త ప్రాంతాల్లో సిఎన్‍‌జి ఫిల్లింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. నేరుగా పెట్రోల్ లేదా డీజిల్ ఇంధనాలతో నడిచే వాహనాలతో పోల్చుకుంటే, సిఎన్‌జి ఇంధనంతో నడిచే కార్లు వాటి ఇంజన్ శక్తిని భారీగా కోల్పోయినప్పటికీ, అవి అందించే అధిక మైలేజ్ గణాంకాలు మాత్రం కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.

కొత్త కారు కొనడానికి వెళ్తున్నారా..? ఒక్క నిమిషం ఆగండి, మరికొద్ది రోజుల్లో రాబోయే ఈ సిఎన్‌జి కార్లపై ఓ లుక్కేయండి!

ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రస్తుత అధిక ఇంధన ధరల పరిస్థితుల్లో కాస్తంత డబ్బును ఆదా చేసుకోవాలంటే, రయ్యిమని వేగంగా దూసుకుపోయే కార్లకు బదులుగా, నెమ్మదిగానైనా పర్లేదు కాస్తంత ఎక్కువ దూరం ప్రయాణించే కారును కావాలనుకునే వారు సిఎన్‌జి కార్లను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం, మార్కెట్లో అనేక రకాల సిఎన్‌జి కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా, పెరుగుతున్న సిఎన్‌జి కార్ల డిమాండ్‌ను తీర్చడానికి వాహన తయారీదారులు రానున్న రోజుల్లో మరిన్ని కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

కొత్త కారు కొనడానికి వెళ్తున్నారా..? ఒక్క నిమిషం ఆగండి, మరికొద్ది రోజుల్లో రాబోయే ఈ సిఎన్‌జి కార్లపై ఓ లుక్కేయండి!

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ కంపెనీ అయిన మారుతి సుజుకి ఇటీవల దేశీయ విపణిలో తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో మరియు ప్రీమియం ఎమ్‌పివి ఎక్స్‌ఎల్6 మోడళ్లలో సిఎన్‌జి వేరియంట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. టాటా మోటార్స్ కూడా తమ టియాగో, టిగోర్ మోడళ్ల ద్వారా తొలిసారిగా సిఎన్‌జి కార్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ కంపెనీ అనుసరించి కియా కూడా ఈ విభాగంలో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉంది. మరి కొత్తగా మార్కెట్లోకి రాబోయే ఆ అద్భుతమైన సిఎన్‌జి కార్లు ఏవో ఈ కథనంలో చూద్దాం రండి.

కొత్త కారు కొనడానికి వెళ్తున్నారా..? ఒక్క నిమిషం ఆగండి, మరికొద్ది రోజుల్లో రాబోయే ఈ సిఎన్‌జి కార్లపై ఓ లుక్కేయండి!

టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జి

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో టాటా టియాగో ఐ-సిఎన్‌జి మరియు టాటా టిగోర్ ఐ-సిఎన్‌జి మోడళ్ల విజయాన్ని రుచి చూసిన తర్వాత టాటా మోటార్స్ దేశీయ విపణిలో తన సిఎన్‌జి ఉత్పత్తుల శ్రేణిని విస్తరించాలని ఆసక్తిగా ఉంది. మారుతి సుజుకి ఇటీవలే తమ బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో సిఎన్‌జి వేరియంట్‌ను విడుదల చేయడంతో, ఆ మోడల్‌కు పోటీగా టాటా మోటార్స్ కూడా తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అయిన టాటా ఆల్ట్రోజ్ యొక్క సిఎన్‌జి వెర్షన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

కొత్త కారు కొనడానికి వెళ్తున్నారా..? ఒక్క నిమిషం ఆగండి, మరికొద్ది రోజుల్లో రాబోయే ఈ సిఎన్‌జి కార్లపై ఓ లుక్కేయండి!

టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జి హ్యాచ్‌బ్యాక్ ఇప్పటికే భారత రోడ్లపై టెస్టింగ్ దశలో ఉండగా అనేకసార్లు కెమెరా కంటపడింది. సమాచారం ప్రకారం, టాటా టియాగో ఐ-సిఎన్‌జి మరియు టాటా టిగోర్ ఐ-సిఎన్‌జి మోడళ్లలో ఉపయోగిస్తున్న అదే 1.2-లీటర్, న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌నే ఈ కొత్త టాటా ఆల్ట్రోజ్ ఐ-సిఎన్‌జిలో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. పెట్రోల్‌తో పనిచేటప్పుడు ఈ ఇంజన్ గరిష్టంగా 84.82 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కాగా, ఇదే ఇంజన్ సిఎన్‌జి ఇంధనంతో పనిచేటప్పుడు గరిష్టంగా 73 బిహెచ్‌పి శక్తిని మరియు 95 ఎన్ఎమ్ టార్క్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్‌తో పోల్చినప్పుడు ఈ ఇంజన్ పవర్, టార్క్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది. సిఎన్‌జి రూపంలో ఈ ఇంజన్ కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. టాటా ఆల్ట్రోజ్ ఇప్పటికే భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉంది. ఇది గ్లోబల్-ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా దక్కించుకుంది.

కొత్త కారు కొనడానికి వెళ్తున్నారా..? ఒక్క నిమిషం ఆగండి, మరికొద్ది రోజుల్లో రాబోయే ఈ సిఎన్‌జి కార్లపై ఓ లుక్కేయండి!

టొయోటా గ్లాంజా సిఎన్‌జి

హైబ్రిడ్ కార్ల తయారీలో చేయి తిరిగిన అనుభవం కలిగిన జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా కూడా సిఎన్‌జి మార్కెట్లో అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. మారుతి సుజుకి నుండి టొయోటా కొనుగోలు చేస్తున్న గ్లాంజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ (బాలెనో యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్)లో కంపెనీ ఓ సిఎన్‌జి వేరియంట్‌ను విడుదల చేయనుంది. టొయోటా గ్లాంజా అనేది మారుతి సుజుకి బాలెనో యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్ మాత్రమే కాబట్టి, ఇటీవల మార్కెట్లోకి వచ్చిన బాలెనో సిఎన్‌జి మాదిరిగానే గ్లాంజా సిఎన్‌జి కూడా అదే విధమైన పనితీరును కలిగి ఉండనుంది.

కొత్త కారు కొనడానికి వెళ్తున్నారా..? ఒక్క నిమిషం ఆగండి, మరికొద్ది రోజుల్లో రాబోయే ఈ సిఎన్‌జి కార్లపై ఓ లుక్కేయండి!

టొయోటా గ్లాంజా సిఎన్‌జి హ్యాచ్‌బ్యాక్ లో కూడా అదే 1.2-లీటర్, నేచురల్లీ-ఆస్పిరేటెడ్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. మారుతి సుజుకి బాలెనో ఎస్-సిఎన్‌జి మోడల్ లో ఉపయోగించిన ఇదే ఇంజన్ పెట్రోల్ ఇంధనంతో నడుస్తున్నప్పుడు గరిష్టంగా 89 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఇదే ఇంజన్‌ను సిఎన్‌జి ఇంధనంతో నడిపించినప్పుడు అది గరిష్టంగా 76 బిహెచ్‌పి శక్తిని మరియు 98.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

కొత్త కారు కొనడానికి వెళ్తున్నారా..? ఒక్క నిమిషం ఆగండి, మరికొద్ది రోజుల్లో రాబోయే ఈ సిఎన్‌జి కార్లపై ఓ లుక్కేయండి!

మారుతి సుజుకి బ్రెజ్జా సిఎన్‌జి

మారుతి సుజుకి సిఎన్‌జి కార్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలు మినహా ఎస్‌యూవీ లైనప్‌లో ఎలాంటి సిఎన్‌జి కార్లు అందుబాటులో లేవు. అయితే, బ్రెజ్జా సిఎన్‌జి రాకతో ఆ లోటు కూడా తీరిపోనుంది. ఇటీవలే మారుతి సుజుకి విడుదల చేసిన కొత్త 2022 మోడల్ బ్రెజ్జా ఇప్పటికే అమ్మకాల పరంగా దూసుకుపోతుంటే, ఇందులో కొత్తగా సిఎన్‌జి వెర్షన్‌ను ప్రవేశపెట్టడం ద్వారా కంపెనీ ఈ కారుకి మరింత జోరును అందించేందుకు సిద్ధమవుతోంది.

కొత్త కారు కొనడానికి వెళ్తున్నారా..? ఒక్క నిమిషం ఆగండి, మరికొద్ది రోజుల్లో రాబోయే ఈ సిఎన్‌జి కార్లపై ఓ లుక్కేయండి!

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అన్ని సిఎన్‌జి కార్లు కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే లభిస్తుంటే, రాబోయే మారుతి సుజుకి బ్రెజ్జా సిఎన్‌జి మాత్రం మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు రెండింటితోనూ లభ్యం కానున్నట్లు సమాచారం. ఇదే గనుక నిజమైతే మారుతి సుజుకి దేశంలోనే మొట్టమొదటి సిఎన్‌జి ఎస్‌యూవీగా మాత్రమే కాకుండా, దేశంలోనే మొట్టమొదటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన సిఎన్‌జి కారుగా రికార్డు సృష్టిస్తుంది.

సమాచారం ప్రకారం, మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఎస్-సిఎన్‌జి మోడల్‌లో ఉపయోగిస్తున్న అదే ఇంజన్‌ను ఈ కొత్త బ్రెజ్జా సిఎన్‌జిలో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. మారుతి ఎక్స్ఎల్6 ఎస్-సిఎన్‌జిలోని ఈ 1.5-లీటర్, న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ పెట్రోల్ మోడ్‌లో గరిష్టంగా 99 బిహెచ్‌పి శక్తిని మరియు 136 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, ఇదే ఇంజన్ సిఎన్‌జి మోడ్‌లో 87 బిహెచ్‌పి శక్తిని మరియు 121 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త కారు కొనడానికి వెళ్తున్నారా..? ఒక్క నిమిషం ఆగండి, మరికొద్ది రోజుల్లో రాబోయే ఈ సిఎన్‌జి కార్లపై ఓ లుక్కేయండి!

టాటా పంచ్ సిఎన్‌జి

టాటా నుండి రాబోయే మరొక సిఎన్‌జి మోడల్ పంచ్ ఐ-సిఎన్‌జి. ఆకర్షణీయమైన లుక్, సరసమైన ధరతో ఇది భారతీయ కస్టమర్లలో తక్షణ హిట్‌గా మారినప్పటికీ, కంపెనీ ఇప్పుడు ఈ మోడల్ అమ్మకాలను మరింత మెరుగుపరచుకోడానికి ఇందులో ఓ సిఎన్‌జి వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. టియాగో మరియు టిగోర్ ఐ-సిఎన్‌జి వేరియంట్ల మాదిరిగానే పంచ్ ఐ-సిఎన్‌జి కూడా అదే 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన టాటా పంచ్, ప్రస్తుతం భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన చిన్న కార్లలో ఒకటిగా ఉంది.

కొత్త కారు కొనడానికి వెళ్తున్నారా..? ఒక్క నిమిషం ఆగండి, మరికొద్ది రోజుల్లో రాబోయే ఈ సిఎన్‌జి కార్లపై ఓ లుక్కేయండి!

కియా కారెన్స్ సిఎన్‌జి

కియా కారెన్స్ ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎమ్‌యూవీలలో ఒకటిగా ఉంది. అయితే, కియా ఇండియా ఈ పాపులర్ ఎమ్‌యూవీలో ఓ కొత్త సిఎన్‌జి వెర్షన్‌ను విడుదల చేయడం ద్వారా దీని పాపులారిటీని మరింత పెంచాలని చూస్తోంది. ప్రస్తుతం, కియా కారెన్స్ మూడు రకాల ఇంజన్ (న్యాచురల్ పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్) ఆప్షన్లతో లభిస్తోంది. కాగా, గతంలో లీకైన స్పై చిత్రాల ప్రకారం, రాబోయే కియా కారెన్స్ సిఎన్‌జి వేరియంట్ 1.4 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Upcoming cng cars in india tata altroz cng to kia carens cng
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X