ఫోక్స్‌వ్యాగన్ టైగన్ నుంచి కొత్త ఎడిషన్ లాంచ్.. కొత్త సంవత్సరానికి ముందే సరికొత్త మోడల్ షురూ..!!

భారతీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన 'ఫోక్స్‌వ్యాగన్ టైగన్' ఇప్పడు 'ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌'లో విడుదలైంది. ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ కాస్మొటిక్ అప్డేటెడ్ పొందుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌' ధర రూ. 33.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది చూడటానికి దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ, కొన్ని అప్డేట్స్ గమనించవచ్చు. అయితే యాంత్రికంగా ఎటువంటి మార్పులు జరగలేదు. కావున ఇది అదే ఇంజిన్ అదే పనితీరుని అందిస్తుంది. కావున వాహన వినియోగదారులు ఇందులో పనితీరు తగ్గే అవకాశం ఉందా అని సందేహపడాల్సిన అవసరం లేదు.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ నుంచి కొత్త ఎడిషన్ లాంచ్

కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌లో గమనించదగ్గ పెద్ద హైలెట్ ఏమిటంటే.. దాని స్టాండర్డ్ మోడల్ లో కనిపించే 18 ఇంచెస్ వీల్స్ స్థానంలో 18 ఇంచెస్ ట్విన్ ఫైవ్ స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అంతే కాకుండా వీల్స్ కోసం డైనమిక్ హబ్‌క్యాప్‌లు మరియు వెనుక వైపున కొత్త లోడ్ సిల్ ప్రొటెక్షన్‌ వంటి వాటిని గమనించవచ్చు. B-పిల్లర్‌ మీద ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ బ్యాడ్జింగ్ చూడవచ్చు.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ స్టాండర్డ్ మోడల్ ఏడు కలర్ ఆప్సన్స్ లో లభిస్తే, కొత్త ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌ మొత్తమ్ రెండు ఎక్స్టీరియర్ కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి పెర్ల్ వైట్, ఓరిక్స్ వైట్ కలర్స్. ఇక డిజైన్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో పెద్దగా మార్పులు కనిపించే అవకాశం లేదు. కావున ఇది దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో LED మ్యాట్రిక్స్ హెడ్‌లైట్లు ఉంటాయి.

టైగన్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌లో కూడా అదే 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్లు, లెదర్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్‌ వంటివి ఉంటాయి. అదే సమయంలో ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ స్టార్ట్ అండ్ డిసెంట్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ మరియు ఏబీఎన్ విత్ ఈబిడి వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి.

టైగన్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌లో 2.0 లీటర్, ఫోర్ సిలిండర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 190 హెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. మైలేజ్ విషయానికి వస్తే, ఇది 12.65 కిమీ/లీ అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించబడింది. అయితే ఈ మైలేజ్ సిటీ మరియు హైవే వంటి వాటిలో కొంత వ్యత్యాసం చూపిస్తుంది.

భారతదేశంలో విడుదలైన కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌ మార్కెట్లో జీప్ కంపెనీ యొక్క కంపాస్, హ్యుందాయ్ కంపెనీ యొక్క టక్సన్ మరియు సిట్రోయెన్ కంపెనీ యొక్క సి5 ఎయిర్‌ క్రాస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌ తప్పకుండా దేశీయ మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని ఆశిస్తున్నాము.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఈ ఆధునిక కాలంలో చాలా మంది వాహన కొనుగోలు దారులు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ లేదా అప్డేటెడ్ మోడల్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ఎప్పటికప్పుడు తమ వాహనాలను అప్డేట్ చేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌ పుట్టుకొచ్చింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Volkswagen tiguan exclusive edition launched india price features and details
Story first published: Tuesday, December 6, 2022, 9:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X