'వోల్వో' నా మజాకా.. కేవలం 120 నిముషాల్లో అమ్ముడైపోయిన 'ఎక్స్‌సి40 రీచార్జ్'

దేశీయ మార్కెట్లో దాదాపు చాలా వాహన తయారీదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే టాటా మోటార్స్, హ్యుందాయ్ మొదలైన కంపెనీలు ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తమ వాహనాలను విడుదల చేసి గొప్ప అమ్మకాలతో ముందుకు సాగుతున్నాయి. మరి కొన్ని కంపెనీలు ప్రస్తుతం తయారీ దశలో ఉన్నాయి.

అయితే ఇప్పుడు స్వీడిష్ కార్ల తయారీ సంస్థ 'వోల్వో' (Volvo) భారతీయ మార్కెట్లో ఇటీవల తన మొదటి ఎలక్ట్రిక్ కారు 'ఎక్స్‌సి40 రీచార్జ్' (XC40 Recharge) విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర రూ. 55.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

'వోల్వో' నా మజాకా.. కేవలం 120 నిముషాల్లో అమ్ముడైపోయిన 'ఎక్స్‌సి40 రీచార్జ్'

వోల్వో కంపెనీ విడుదల చేసిన తన మొదటి ఎలక్ట్రిక్ కారు కోసం నిన్న (2022 జులై 27) 11 గంటలకు అధికారిక వెబ్‌సైట్‌లో బుకింగ్స్ స్వీకరించడం ప్రారభించింది. అయితే బుకింగ్స్ ప్రారభించిన కేవలం 2 గంటల్లోనే మొత్తం కంపెనీ యొక్క కార్లు అమ్ముడైపోయాయి. నిజంగా ఇది షాకింగ్ న్యూస్.

'వోల్వో' నా మజాకా.. కేవలం 120 నిముషాల్లో అమ్ముడైపోయిన 'ఎక్స్‌సి40 రీచార్జ్'

నిజానికి వోల్వో కంపెనీ 2022 సంవత్సరానికి గాను మొత్తం 150 యూనిట్లను మాత్రమే కేటాయించింది. ఈ 150 యూనిట్లు బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 120 నిముషాల్లో అమ్ముడైపోయాయి. డెలివరీలు ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రారంభమవుతాయి. అయితే తరువాత డెలివరీల కోసం కూడా బుకింగ్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కావున ఆసక్తిగల కస్టమర్లు బుక్ చేసుకోవచ్చు. అయితే డెలివరీలు కొంత ఆలస్యమవుతాయి.

'వోల్వో' నా మజాకా.. కేవలం 120 నిముషాల్లో అమ్ముడైపోయిన 'ఎక్స్‌సి40 రీచార్జ్'

వోల్వో కంపెనీ యొక్క 'ఎక్స్‌సి40 రీచార్జ్' కర్నాటకలోని బెంగళూరు సమీపంలో ఉన్న కంపెనీ యొక్క హోసాకోట్ ప్లాంట్‌లో అసెంబుల్ చేయబడింది. కంపెనీ యొక్క ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (సిఎమ్ఏ) ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది.

'వోల్వో' నా మజాకా.. కేవలం 120 నిముషాల్లో అమ్ముడైపోయిన 'ఎక్స్‌సి40 రీచార్జ్'

కొత్త వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ చూడటానికి దాదాపు దాని పెట్రోల్ లేదా డీజిల్ మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ ఇందులో అప్డేటెడ్ ఫీచర్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క ముందు భాగంలో పెద్ద వోల్వో బ్యాడ్జ్ ఉంది. ఇంకా వైట్-ఫినిష్డ్ గ్రిల్, ఆటోమేటిక్ ఎల్ఈడి హెడ్‌లైట్లు, బ్లాక్ స్టోన్ రూఫ్, డోర్ మిర్రర్స్, రూఫ్ రైల్స్, కలర్ కో-ఆర్డినేటెడ్ ఫ్రంట్ గ్రిల్ కవర్ మరియు సైడ్ ప్రొఫైల్ లో 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ అందుబాటులో ఉన్నాయి.

'వోల్వో' నా మజాకా.. కేవలం 120 నిముషాల్లో అమ్ముడైపోయిన 'ఎక్స్‌సి40 రీచార్జ్'

ఇక ఇంటీరియట్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో 12.3 ఇంచెస్ టిఎఫ్‌టి డిస్‌ప్లే, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన స్టీరింగ్ వీల్ , టూ-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్-ఆపరేటెడ్ టెయిల్‌గేట్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్, వోల్వో కార్స్ సర్వీసెస్ యాప్, గూగుల్ ఆటోమోటివ్ సర్వీసెస్, 13-స్పీకర్ హార్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్ మరియు వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్ వంటి ఆధునిక ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

'వోల్వో' నా మజాకా.. కేవలం 120 నిముషాల్లో అమ్ముడైపోయిన 'ఎక్స్‌సి40 రీచార్జ్'

వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ పరిమాణం పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది 4,425 మిమీ పొడవు, 1,863 మిమీ వెడల్పు మరియు 1,652 మిమీ ఎత్తు మరియు 1,652 మిమీ వీల్‌బేస్ కలిగి ఉంటుంది. అదే సమయంలో దీని గ్రౌండ్ క్లియరెన్స్ 175 మిమీ వరకు ఉంది. బూట్ స్పేస్ 419 లీటర్లు. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

'వోల్వో' నా మజాకా.. కేవలం 120 నిముషాల్లో అమ్ముడైపోయిన 'ఎక్స్‌సి40 రీచార్జ్'

వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లను కలిగి ఉంటుంది. ఇందులో రెండు 150 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్లు ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 402 బిహెచ్‌పి పవర్ మరియు 660 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు 78 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తాయి.

'వోల్వో' నా మజాకా.. కేవలం 120 నిముషాల్లో అమ్ముడైపోయిన 'ఎక్స్‌సి40 రీచార్జ్'

ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టాండర్డ్ డీజిల్ వెర్షన్ 'వోల్వో ఎక్స్‌సి40' కంటే కూడా ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు రెట్టింపు పనితీరుని అందిస్తుంది. ఇది ఒక పూర్తి ఛార్జ్ తో గరిష్టంగా 418 కిమీ మైలేజ్ అందిస్తుంది. అదే సమయంలో ఇది కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 180 కిమీ వరకు ఉంటుంది.

'వోల్వో' నా మజాకా.. కేవలం 120 నిముషాల్లో అమ్ముడైపోయిన 'ఎక్స్‌సి40 రీచార్జ్'

వోల్వో యొక్క కొత్త ఎలక్ట్రిక్ కారులో ఆధునిక డిజైన్ మరియు పరికరాలు మాత్రమే కాకుండా.. అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇందులో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, రన్-ఆఫ్ రోడ్ మిటిగేషన్, లేన్ కీపింగ్ ఎయిడ్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ సిస్టమ్, ఐసోఫిక్స్ అటాచ్మెంట్, బ్లైండ్ స్టీర్ అసిస్ట్‌తో కూడిన స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

'వోల్వో' నా మజాకా.. కేవలం 120 నిముషాల్లో అమ్ముడైపోయిన 'ఎక్స్‌సి40 రీచార్జ్'

వోల్వో కంపెనీ ఇప్పుడు తన మొదటి ఎలక్ట్రిక్ కారులోని బ్యాటరీ ప్యాక్ పై 8 సంవత్సరాల వారంటీ, కారుపైన 3 సంవత్సరాల వారంటీ, 3 సంవత్సరాల సర్వీస్ ప్యాకేజీని మరియు 3 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Most Read Articles

Read more on: #వోల్వో #volvo
English summary
Volvo xc40 recharge completely sold out in two hours details
Story first published: Thursday, July 28, 2022, 9:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X